నెలసరి నొప్పికి ఫుల్‌స్టాప్‌!

08-07-2019: నెలసరి సమయంలో ప్రతి మహిళకూ ఎంతోకొంత నొప్పి సహజం. ఈ నొప్పులను హోమియో వైద్యంతో అదుపు చేసే వీలుంది.
 
పల్సటిల్లా 30: పెరిగే రక్తస్రావంతో నొప్పి కూడా పెరుగుతూ ఉండేవారికి ఈ ఔషధం సరైనది. తలతిరుగుడు, వాంతులు, పల్చని విరేచనాలు కూడా ఉంటాయి. నొప్పి తొడలలోకి, అక్కడి నుంచి నడుములోకి పాకుతుంది. భావోద్వేగాలు కూడా తీవ్రంగా ఉంటాయి. తీవ్రతను బట్టి పొటెన్సీ 30 నుంచి 200 వరకు పెంచుకోవచ్చు.
 
బెల్లడోనా 200: పిరుదుల్లో నొప్పి ఉంటుంది. నెలసరి నొప్పితోపాటు తలనొప్పి కూడా ఉంటుంది. విపరీతమైన పొత్తికడుపు నొప్పితో పాటు, స్రావం ఉధృతంగా ఉంటుంది.
 
మెగ్నీసియా ఫాస్ఫారికా 200: పొత్తికడుపు మీద వెచ్చని కాపడంతో తగ్గే నొప్పి ఉన్నవారికి ఈ మందు బాగా పని చేస్తుంది. వీరికి వేడి నీటి స్నానంతో ఉపశమనం కలుగుతూ ఉంటుంది. నెలసరి ప్రారంభంలో విపరీతమైన నొప్పి ఉండి, స్రావం పెరిగేకొద్దీ నొప్పి తగ్గుతుంది.