సంతానలేమి సమస్య ఇక దూరం

ఆంధ్రజ్యోతి(03/09/140): నేటితరంలో సంతానలేమి సమస్య పెరుగుతోంది. ఆరోగ్యవంతులైన దంపతులు ఏ విధమైన గర్భనిరోధక చర్యలు చేపట్టకుండా రెండు సంవత్సరాల పాటు సాధారణ శృంగార జీవితం గడిపినా పిల్లలు కలగక పోవటాన్ని సంతానలేమి అంటారు. ఈ సమస్యకు స్త్రీ, పురుషులు ఇద్దరూ కారణం కావచ్చు. కారణాలేవైనా హోమియో వైద్యవిధానంలో జెనెటిక్‌ కాన్‌స్టిట్యూషనల్‌ చికిత్స ద్వారా స్త్రీ, పురుషుల్లో సంతానలేమి లోపాలను సరిచేసి సంతానలేమి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించవచ ్చంటున్నారు హోమియో వైద్యనిపుణులు డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్‌.
 
 ప్రస్తుతం పెళ్లి అయిన జంటల్లో 7-8 శాతం మందిలో సంతానలేమి సమస్య ఉంటుంది. రెండేళ్లపాటు సాధారణ లైంగిక జీవనం గడిపినా గర్భం ధరించకుంటే దాన్ని ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. స్త్రీ సాధారణ లైంగిక జీవితం గడిపినా ఒకసారి గర్భం ధరించి, పిల్లలు కలిగినా లేదా గర్భస్రావమై రెండవసారి గర్భధారణ జరగకపోవటాన్ని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు.
మగవారిలో సంతానలేమికి కారణాలు : శుక్రకణాలు లేకపోవటం లేదా శుక్రకణాలు ఉత్పత్తి లేకపోవటం, శుక్రకణాలు ఉత్పత్తి అయినపుడు వాటి కదలికలు సాధారణంగా లేకపోవటం, శుక్రకణాల నిర్మాణంలో తేడా వల్ల సంతానోత్పత్తికి అవకాశం లేదు. వృషణాల్లో ఉండే రక్తనాళాలు వాపునకు గురై వెరికోసిల్‌ అనే సమస్య వచ్చినపుడు, లేదా వృషణాలున్న తిత్తిలో నీరు చేరి హైడ్రోసిల్‌ సమస్య వస్తే శుక్రకణాల ఉత్పత్తిలో తగ్గుదల ఏర్పడి సంతానలేమికి కారణం కావచ్చు. పిట్యుటరీ, థైరాయిడ్‌, టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌లలో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల శుక్రకణాల ఉత్పత్తిపై ప్రభావం పడి సంతానలేమికి దారితీయవచ్చు. అంగస్తంభన, శీఘ్రస్ఖలనం, అధికబరువు, డయాబెటిస్‌ కూడా సంతానలేమికి దారితీయవచ్చు
స్త్రీలలో సంతానలేమికి కారణాలు : స్త్రీ ప్రత్యుత్తి వ్యవస్థలో లోపాలు, చిన్న గర్భసంచి ఉండటం, గర్భసంచి లేకపోవడం, రెండు గదులుగా ఉండే గర్భసంచి, ట్యూబ్స్‌ మూసుకుపోవటం, అండాశయంలో సరైన ఎదుగుదల లేకపోవటం, యోనిమార్గం చిన్నదిగా ఉండటం, యోనిమార్గం మూసుకుపోవటం, హార్మోన్‌ సమస్యలు, పీసీఓడీ, స్త్రీల రుతుచక్రంలో అసమతుల్యతల వల్ల సంతానలేమికి దారితీయవచ్చు. గర్భసంచిలో కణతులు ఏర్పడి ఫాలోపియన్‌ ట్యూబ్స్‌కు అడ్డు తగలడం, ఫలదీకరణం చెందిన పిండం గర్భసంచిలో స్థావరం ఏర్పడకుండా చేయడం వల్ల సంతానలేమికి దారితీస్తుంది. యోనిమార్గంలో ఉండే మ్యూకస్‌ పొర, శుక్రకణాలు ఈదటానికి అనువుగా లేకపోవటం, యోనిలో అధిక ఆమ్లగుణాన్ని కలిగి ఉండటం వల్ల శుక్రకణాలు చనిపోవటం వంటి కారణాలు సంతానలేమి సమస్యకు దారితీస్తాయి. ఇవేవి కాకుండా ఆరోగ్యవంతులకు కూడా ఆకారణంగా పిల్లలు కలగక పోవటాన్ని ఇడియోపతిక్‌ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. 
సంతానలేమి నిర్ధారణ పరీక్షలు : పురుషులకు సీబీపీ, ఈఎస్సార్‌, సీయూఈ, యూఎస్‌జీ అబ్డామిన్‌, యూఎస్‌జీ స్ర్కోటమ్‌, కంప్లీట్‌ సెమన్‌ అనాల్‌సిస్‌, సీరం టెస్టోస్టిరాన్‌, థైరాయిడ్‌ ప్రొఫైల్‌, ఎస్‌.హెచ్‌., ఎఫ్‌.ఎస్‌.హెచ్‌, టెస్టిక్లార్‌ బయాప్సీ పరీక్షలతో సంతానలేమిని గుర్తించవచ్చు. స్త్రీలలో సంతానలేమి సమస్యను సీబీపీ, ఈఎస్‌ఆర్‌, సీయూఈ, ఎఫ్‌ఎస్‌హెచ్‌, ఎల్‌హెచ్‌, సీరం, ప్రొలాక్టిన్‌, థైరాయిడ్‌ ప్రొఫైల్‌, యూఎస్‌జీ, అబ్డామిన్‌, హెచ్‌ఎస్‌జీ, లాప్రొస్కోపీ, పాలిక్యులార్‌ స్టడీ పరీక్షలతో నిర్ధారించవచ్చు. 
కృత్రిమ సంతానోత్పత్తి పద్ధతులు : ఐయుఐ పద్ధతిలో శుక్రకణాలను అండం ఉత్పత్తి అయ్యే సమయంలో గర్భసంచిలో  ప్రవేశపెట్టడం ద్వారా కేవలం 15 నుంచి 20 శాతం వరకు సత్ఫలితాలనిస్తుంది. అంగస్తంభన లేనివారిలో, శీఘ్రస్ఖలనం ఉన్నవారిలో, శుక్రకణాలు తక్కువ సంఖ్యలో ఉన్నపుడు, శుక్రకణాలు సరైన కదలికలు లేనివారు ఈ పద్ధతిని అవలంభించవచ్చు. 
హోమియో వైద్యం : అంగస్తంభన, శీఘ్రస్ఖలనం, శుక్రకణాల ఉత్పత్తి, వాటి చలనశక్తిని శాశ్వతంగా పరిష్కరించి సంతానోత్పత్తి క లిగే విధంగా వైద్యం చేయవచ్చు. 
ఐవీఎఫ్‌ : స్త్రీ అండాన్ని, పురుషుడి శుక్రకణాన్ని లేబరేటరీలో ఫలదీకరణం చెందించి, తిరిగి స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టడాన్ని ఐవీఎఫ్‌ అంటారు. ఈ పద్ధతిని ట్యూబల్‌ బ్లాక్‌, శుక్రకణాల సంఖ్య, చలనశక్తిలో లోపాలున్న వారిలో, ఎక్కువ వయసు ఉన్న వారిలో అవలంభించవచ్చు. హోమియో వైద్య ద్వారా ఒకటి లేదా రెండు ట్యూబల్‌ బ్లాక్‌లు ఉన్నప్పటికీ వాటిని సరిచే స్తే గర్బధారణ జరిగే అవకాశం చాలామంది దంపతులకు ఉంది. 
ఐసీఎస్‌ఐ : ఇందులో శుక్రకణాలను కృత్రిమ పద్ధతి ద్వారా అండంలోకి ప్రవేశపెడతారు. ఐయుఐ పద్ధతి సత్ఫలితాన్నివ్వని సందర్భంలో తక్కువ సంఖ్యలో శుక్రకణాలున్నపుడు ట్యూబల్‌ బ్లాక్‌ ఉన్న సందర్భాల్లో ఈ పద్ధతిని అవలంభిస్తారు. హోమియోలో జెనెటిక్‌ కాన్‌స్టిట్యూషనల్‌ చికిత్స ద్వారా స్త్రీ, పురుషుల్లో సంతానలేమి లోపాలను సరిచేస్తూ శాశ్వత పరిష్కారం చూపించటంతోపాటు రెండవ, మూడవ సంతానానికి మార్గం సుగమం చేయవచ్చు. సంతానలేమి సమస్యకు హోమియో వైద్యవిధానం సత్ఫలితాలను ఇస్తుంది.
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లవార్‌ (సీఎండీ)
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ ప్ర్తె.లి.
 ఫోన్‌ : 9550001199/88
టోల్‌ ఫ్రీ : 1800 102 2202