సంతానలేమికి ఇద్దరూ బాధ్యులే

ఆంధ్రజ్యోతి(28/01/14): మన దేశంలో ఎంతోమంది దంపతులు సంతానలేమితో బాధపడుతున్నారు. అందుకు పాశ్చాత్య సంస్కృతిలాగా రాత్రీ పగలూ తేడా లేకుండా వృత్తిపనుల్లో బిజీగా ఉండటం, సరైన వయసులో పెళ్లిళ్లు కాకపోవడం, మానసిక ఒత్తిడికిలోను కావడం వంటివి హార్మోన్‌ సంబంధమైన సమస్యల్ని సృష్టిస్తున్నాయి. అయితే, ఇవి పరిష్కారం లేని సమస్యలేమీ కాదని, సరైన చికిత్స తీసుకుంటే లైంగిక సమస్యలు పరిష్కారం కావడమే కాక, సంతానం కలగడానికి కూడా అవకాశం ఉంటుందని ప్రముఖ వైద్యురాలు డాక్టర్‌ సి. జ్యోతి. స్టార్‌ ఫెర్టిలిటీ సంస్థలోని నిపుణులు దీన్ని తేలికగా పరిష్కరిస్తున్నారని కూడా ఆమె చెబుతున్నారు.
 
చాలామంది స్త్రీలలో నెలసరి సమస్యలున్నా, భర్త కన్నా భార్య వయసు ఎక్కువగా ఉన్నా, భార్యాభర్తలిద్దరూ సంతాన నిరోధక పద్ధతులేవీ పాటించకుండా సంవత్సరం కాలంపాటు ప్రయత్నించినా గర్భధారణ కాకపోవచ్చు. మరికొంత మందిలో సంవత్సర కాలం దాటినా అంటే, ఏళ్లు గడుస్తున్నా గర్భధారణ కాకపోవచ్చు.
 
స్త్రీలు మాత్రమే బాధ్యులా?
సంతానంలేమితో బాధపడుతున్నారంటే స్త్రీలలోనే లోపం ఉండవచ్చనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ సంతానలేమికి అసలు కారణం స్త్రీపరుషులిద్దరూ కావచ్చు. దంపతుల్లో ఒకరికి లేదా ఇద్దరికీ లోపం ఉన్నా గర్భధారణ కలుగకపోవచ్చు. పురుషులలో వీర్యకణాల ఉత్పత్తిలో లోపం ఉన్నా సంతానలేమికి దారి తీయవచ్చు. అదే స్త్రీలలో అయితే హార్మోను లోపం, థైరాయిడ్‌, పి.సి.ఓ.డి... ఇలా కొన్ని రకాల కారణాలూ ఉండవచ్చు.
సాధారణంగా దంపతులిద్దరూ ఏ విధమైన గర్భనిరోధక విధానాలూ పాటించకుండా దాంపత్య జీవితం గడిపితే 5 నెలల లోపే 50 శాతం మందికి గర్భం వస్తుంది. ఏడాది లోపు 75 శాతం మందికి గర్భం వస్తుంది. 2 సంవత్సరాల లోపు 90 శాతం మందికి గర్భం వస్తుంది. ఎవరికైనా ఇంతకాలం గడిచినా గర్భం రాలేదంటే ఏదో సమస్య ఉందనే భావించాలి. సమస్యను తెలుసుకోవాలని స్త్రీలు ముందుకొచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నా, పురుషులు మాత్రం అందుకు సిద్ధంగా ఉండటం చాలా తక్కువ. 
 
ఆకృతి కోల్పోయినా...
మన జీవన శైలితో పాటు కాలుష్యం, వాతావరణం, పొగతాగటం, మద్యం సేవించటం, బిగుతు దుస్తులు ధరించటం, అధిక బరువులు మోయటం, మానసిక ఒత్తిడి, కొన్ని రకాల మందులు ఆరోగ్యకరమైన వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చూపడం వల్ల పురుషులలో శుక్ర కణాల సంఖ్య తగినంత లేకపోవడం, ఒకవేళ ఉన్నా వాటిలో చురుకుదనం లేకపోవటం జరుగుతోంది. వాటి ఆకృతి బాగా లేకపోయినా కష్టమే. కొందరిలో శుక్ర కణాలు అసలు ఉండవు. స్త్రీలలో నెలసరి సమస్యలు, అండం విడుదల సరిగా లేకపోవటం లేదా విడుదలైన అండాలు నాణ్యంగా లేకపోవటం ప్రధాన కారణాలు. వయసు పెరిగే కొద్దీ గర్భస్రావాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 30 సంవత్సరాలు దాటిన స్త్రీలలో సంతానం కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
 
సరైన పద్ధతులు
ట ఐ.యు.ఐ
ట ఇక్సీ
ట ఐ.వి.ఎఫ్‌.
 
ఐ.యు.ఐ: భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ల్యాబ్‌లో పరీక్షించి దానిలోంచి ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్న కణాలను మాత్రం వేరు చేసి సిద్ధం చేస్తారు. వాటిని ఒక సన్నని గొట్టం ద్వారా స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఇలా ఒక నెలలో చేస్తే 15 శాతం వరకు సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఇలా ఆరు రుతుచక్రాల పాటు ఈ చికిత్స చేసినా ఫలితం లేకపోతే అప్పుడు ఐ.వి.ఎఫ్‌ ద్వారా ప్రయత్నించవచ్చు.
ఇక్సీ: స్త్రీ నుంచి సేకరించిన అండంలోకి పురుషుని శుక్ర కణాన్ని ఒక ప్రత్యేకమైన మైక్రోమాఫ్యులేటర్‌ సహాయంతో ప్రవేశపెట్టి ఫలదీకరణం చెందిస్తారు. వాటిని తిరిగి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ పద్ధతి ద్వారా 40 శాతం వరకు విజయం సాధించవచ్చు. శుక్ర కణాల సంఖ్య తక్కువగా ఉన్నవారిలో ఇది మరింత ఉపయోగకరం. 
 
ఐ.వి.ఎఫ్‌.
దీన్నే ‘టెస్ట్‌ట్యూబ్‌ విధానం’ అంటారు. ముందు స్త్రీ నుంచి పక్వమైన అండాలను బయటకు తీసి పురుషుడి శుక్ర కణాలతో బయటే ఫలదీకరణం చెందిస్తారు. ఇలా ఏర్పడిన తొలి దశ పిండాల్లో రెండు లేదా మూడింటిని తిరిగి స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెడతారు. దీని ద్వారా 30-35 శాతం ఫలితం పొందవచ్చు. ఇటీవల కాలంలో సంతాన సాఫల్య చికిత్సలో మరెన్నో కొత్త విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలదీకరించిన పిండాలలో గర్భాశయంలోకి ప్రవేశపెట్టగా మిగిలిన పిండాలను అతిశీతల పరిస్థితుల్లో ఉంచి తరువాత వాటినే వాడటం జరుగుతుంది. అవసరాన్ని బట్టి అండాలను గానీ, శుక్ర కణాలను గానీ దాతల నుంచి స్వీకరించి వాడటం జరుగుతుంది. వీటితో పాటు పిండాన్ని మరో స్త్రీ గర్భాశయంలో పెంచే ఒక వినూత్నమైన ‘సరొగసి’ విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. అందుకే సంతానం కలగటం లేదని ఏళ్ల తరబడి బాధపడే కన్నా ఎన్నో ఆధునిక పద్ధతలున్న ‘స్టార్‌ ఫెర్టిలిటీ’ని ఆశ్రయించటం ఎంతో శ్రేయస్కరం.
 
డాక్టర్‌ సి. జ్యోతి.
ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌, స్టార్‌ ఫెర్టిలిటీ
సెయింట్‌ ఆన్స్‌ హైస్కూల్‌,
 విజయా డయాగ్నోస్టిక్స్‌ ఎదురుగా, 
మారేడుపల్లి, సికింద్రాబాద్‌. 
ఫోన్‌: 7416 106 106, 90300 81877

www.starfertility.com