పెయిన్‌కిల్లర్స్‌తో సంతానలేమి

లండన్‌, ఏప్రిల్‌ 16: తలనొప్పి, ఒళ్లు నొప్పులు.. ఇలా సమస్య చిన్నదైనా, పెద్దదైనా పెయిన్‌కిల్లర్స్‌ వాడుతుంటాం. అయితే కాసేపటి ఉపశమనానికి వాడే ఈ పెయిన్‌కిల్లర్స్‌తో పుట్టబోయే పిల్లల్లో సంతానలేమి ఏర్పడే ప్రమాదం ఉందని యూకేలోని ఎడిన్‌బర్గ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గర్భిణులు పెయిన్‌కిల్లర్స్‌ను వేసుకున్నపుడు.. వాటి అవశేషాలు డీఎన్‌ఏలో కలిసి పుట్టబోయే పిల్లలపై దీని ప్రభావం చూపుతుందని తెలిపారు. గర్భిణులు సాధ్యమైనంత వరకు పారాసిటమాల్‌, ఐబుప్రొఫీన్‌ మందులకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు