రెడ్‌ వైన్‌తో గర్భం దాల్చే అవకాశం ఎక్కువ!

వాషింగ్టన్‌, అక్టోబరు 29: వారానికో గ్లాసుడు రెడ్‌ వైన్‌ తాగే మహిళల్లో గర్భం దాల్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. నెలకు కనీసం ఐదుసార్లు రెడ్‌వైన్‌ తాగిన గర్భిణుల్లో అండాల నిల్వ ఎక్కువగా ఉందని తమ పరిశోధన ద్వారా తేలిందన్నారు. రెడ్‌వైన్‌లో ఉండే రిజ్వెరట్రాల్‌ అనే యాంటీ ఆక్సిడెంటే దీనికి కారణమని పేర్కొన్నారు.