సొగసైన నడుము కోసం...

05-09-2019: సాధారణంగా ప్రసవం తదనంతరం నడుము, పిరుదుల్లో కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. చీరలు కట్టినప్పుడు ఎబ్బెట్టుగా కనిపించే ఈ కొవ్వును కరిగించడం కోసం తేలికపాటి వ్యాయామాలు క్రమం తప్పక చేయాలి. అవేమిటంటే....
 
మోచేతులు, మోకాళ్ల మీద కూర్చుని, మడిచిన కుడి కాలును వెనక్కి పైకి లేపాలి. ఇదే తరహాలో ఎడమ కాలునూ లేపి దించాలి. ఇలా ఒక్కో కాలుతో 20 రెప్స్‌, 3 సెట్లు చేయాలి.
నిటారుగా నిలబడి ఒక కాలును వంచకుండా వీలైనంత వెనక్కి చాచాలి. ఇలాగే రెండో కాలితోనూ చేయాలి. ఒక్కో కాలితో 20 రిపిటీషన్స్‌, 3 సెట్లు చేయాలి.