వెంటాడే వ్యాధి థైరాయిడ్

నేడు వరల్డ్‌ థైరాయిడ్‌ డే  

వందలో ఇరవై మంది బాధితులే..!

బాధితుల్లో మహిళలే ఎక్కువ

పరీక్ష చేస్తే కానీ గుర్తించలేని పరిస్థితి

25-5-2017,ఆంధ్రజ్యోతి:  థైరాయిడ్‌... ఇప్పుడు అందరినీ వేధించే సమస్య... ఏదైనా బాధతో డాక్టర్‌ వద్దకు వెళ్లితే ప్రధానంగా థైరాయిడ్‌ ఎలా ఉందనే చూస్తారు... థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధించేదే ఈ థైరాయిడ్‌. ప్రస్తుతం థైరాయిడ్‌తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒత్తిడి, టెన్షన్‌, ఆటుపోట్ల జీవితం, హార్మోన్ల సమతుల్యం దెబ్బతినడం వంటివి థైరాయిడ్‌ రావడానికి దోహదం చేస్తున్నాయి. చిన్న పిల్లాడి నుంచి వృద్ధుల వరకు థైరాయిడ్‌తో బాధపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. పదేళ్ల క్రితం థైరాయిడ్‌ సమస్య ఉన్న వాళ్లు చాలా తక్కువగా ఉండే వారు. థైరాయిడ్‌ పరీక్షలు కూడా వైద్యులు పెద్దగా చేసే వారు కాదు. కానీ ఇప్పుడు ఏదైనా ఒక సమస్యతో వైద్యుడి వద్దకు రోగి వస్తే చాలు థైరాయిడ్‌ పరీక్షలు తప్పని సరిగా చేయిస్తున్నారు. ఈ థైరాయిడ్‌ ఒక్కసారి వస్తే జీవితాంతం వెంటాడుతుందని, జీవితాంతం మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. ఓ వైద్యుడి దగ్గరికి వచ్చే 100 మంది రోగుల్లో 20 మంది థైరాయిడ్‌ సమస్యతోనే వస్తున్నారు. ఇందులో అయిదుగురు మహిళల్లో ఒకరు తప్పని సరిగా ఉంటున్నారని వైద్యులు తెలిపారు. గర్భిణుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటోందని, తల్లి నుంచి గర్భస్థ శిశువుకు ఈ జబ్బు వచ్చే ముప్పు ఉందని వైద్యులు వివరిస్తున్నారు.
 

థైరాయిడ్‌ రావడానికి కారణాలు అనేకం....

థైరాయిడ్‌ రావడానికి అనేక కారణాలు దోహదం చేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడి, హోర్మోన్ల సమతుల్యత లోపించడం, ఉప్పులో అయోడిన్‌ లోపించడం, కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నా థైరాయిడ్‌ వచ్చే ప్రమా దముందని వైద్యులు అంటున్నారు. థైరాయిడ్‌ ప్రధానంగా రెండు రకాలు గా ఉంటుంది. ఒకటి హైపర్‌ థైరాయి డిజమ్‌, రెండోది హైపో థైరాయిడిజమ్‌. శరీరంలోని ఒక భాగంలో ఎక్కడైనా ఇది దెబ్బతింటే ఇతర భాగాలలో కూడా ఇవి దెబ్బ తినడం ప్రారంభిస్తాయని డాక్టర్లు వివరిస్తున్నారు. దీని కారణంగా హైపర్‌ థైరాయిడిజమ్‌, హైపో థైరాయిడిజమ్‌ వంటివి ఏర్పడతాయని, దీని పర్యవసానంగా ఆటో ఇమ్యూ న్‌ లోపాలు, అయోడిన్‌ లోపం వంటివి ఏర్పడతాయని వైద్యులు చెప్పారు. 

హైపోథైరాయిడ్‌ లక్షణాలు...

నీరసం, బద్ధకం, బరువు కోల్పోవడం, ఆకలి మందగిం చడం, గొంతు జీరపోవడం, జలుబు, అసహనం, మలబ ద్ధకం మహిళల్లో రుతుస్రావ సమయంలో అధికంగా రక్తం పోవడం, గుండె, నాడి వేగం తగ్గడం, కొన్నిసార్లు అధిక రక్తప్రసరణ జరగడం వంటివి కనిపిస్తాయి. కేశాలు పలచబడి పొడిగా మారడం, ఆసక్తి తగ్గిపోవడం, చర్మం పొడిగా, గోళ్లు పలచగా మారి చిట్లిపోవడం, కండరాలు బిగుసుకుపోవడం, కీళ్లలో నొప్పులు రావడం, మతిమరుపు, ఆలోచనా శక్తి తగ్గిపోయి, మాట నెమ్మదిగా రావడం వంటివి దీని లక్షణాలుగా చెప్పవచ్చు.
హైపర్‌థైరాయిడిజమ్‌ లక్షణాలు...
ఆకలి ఎక్కువై అధిక ఆహారం తీసుకున్నప్పటికీ బరువు తగ్గిపోవడం, ఆందోళన, చిరాకు, నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, శరీరం వెచ్చగా ఉండడం, చెమట ఎక్కువగా పట్టడం, శరీరంలో మంటలు వచ్చినట్లు ఉండడం, తరచూ విరేచనాలు కావడం దీని లక్షణాలు.
మందులతో నియంత్రణ...
థైరాయిడ్‌ ఒక్కసారి వస్తే తగ్గేది కాదు. రాకుండా జాగ్రత్త పడలేం, వచ్చాక పూర్తిగా తగ్గించలేం. కానీ మందులతో నియంత్రణలో పెట్టగ లం. థైరాయిడ్‌ ఉందని తేలితే వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా ప్రకారం క్రమం తప్ప కుండా మందులు వాడాలి. సాధారణ స్థితికి చేరు కుంది కదా.. ఇక మందులు అవసరం లేదని ఎవరికి వారు నిర్ణయించుకోవద్దు. థైరాయిడ్‌ స్థాయి బట్టి మందుల డోస్‌ నిర్ణయించాల్సి ఉంటుంది. థైరాయిడ్‌ సమస్యను మందులతోనే నియంత్రణలో ఉంచవచ్చు. 80 శాతం వరకు మందులతోనే దీనిని కంట్రోల్‌ చేసే అవకాశముంది. మందులతో తగ్గకపోతే మాత్రం సర్జరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. థైరాయిడ్‌ వ్యాధి ఉన్న వారు నిరంతరం జాగ్రత్తలు తీసుకోవాలి. 
- డాక్టర్‌ దిలీప్‌ నందమూరి, ఎండోక్రైనాలజిస్ట్‌, స్టార్‌ ఆస్పత్రి
 
 
రోజుకు నాలుగైదు కొత్త కేసులు... 
థైరాయిడ్‌ గ్రంధి తగినంత హో ర్మోన్‌ను ఉత్పత్తి చేయకపోతే హై పోథైరాయిడిజమ్‌ సమస్య వెంటా డుతుంది. థైరాయిడ్‌ సమస్యతో రోజుకు నాలుగైదు కొత్త కేసులు వ స్తున్నాయి. ఇవే కాకుండా పాత కే సులు రోజుకు 10 నుంచి 15 ఉంటున్నాయి. ప్రతి రో జు కనీసం 20 మంది థైరాయిడ్‌ బాధితులకు చికిత్స లు  అందిస్తున్నాం. ఇందులో అధిక శాతం మహిళలే ఉంటున్నారు. కుటుంబ సభ్యులకు థైరాయిడ్‌ ఉంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. అకస్మాత్తుగా బరువు తగ్గినా, పెరిగినా, మహిళలకు రుతుక్రమం స రిగా లేకపోయినా థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవా లి. టీఎస్‌హెచ్‌ (స్టిమిలేషన్‌ హోర్మోన్‌), టీ-3, టీ-4 పరీ క్షలు చేయించుకోవాలి. చాలా మంది పరీక్షలు చేసుకో వడం వల్ల థైరాయిడ్‌ను మొదట్లోనే గుర్తిస్తున్నారు. 
- డాక్టర్‌ రవిశంకర్‌ ఎరుకలపాటి, ఎండోక్రైనాలజిస్ట్‌, అపోలో ఆస్పత్రి