థైరాయిడ్‌ సమస్యకు ఇదిగో పరిష్కారం

09-01-12

గ్రంధుల పనితీరు సక్రమంగా ఉంటేనే జీవక్రియలు సక్రమంగా ఉంటాయి. గ్రంధుల పనితీరులో తేడా వస్తే మొత్తం శరీర వ్యవస్థపై దాని ప్రభావం పడుతుంది. దీనికి మంచి ఉదాహరణ థైరాయిడ్‌ గ్రంధి. ఈ గ్రంధి విడుదల చేసే హార్మోన్లలో తేడా వస్తే అనేక సమస్యలు వచ్చిపడతాయి. అందుకే థైరాయిడ్‌ సమస్య ఉందని తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలంటున్నారు హోమియో వైద్యనిపుణురాలు డాక్టర్‌ కవిత. 
మానవ శరీరంలో అతి ముఖ్యమైన గ్రంధి థైరాయిడ్‌. దీన్ని అవటుగ్రంధి అని కూడా అంటారు. ఇది మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. మనం చేసే దైనందిన కార్యక్రమాలన్నీ ఈ గ్రంధి ఉత్పత్తి చేసే థైరాక్సిన్‌ అనే హార్మోన్‌ అధీనంలో ఉంటుంది. అంతేకాకుండా ఈ హార్మోన్‌ మానసిక, శారీరక ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్థ, శ్వాసవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, కండరవ్యవస్థ, నాడీవ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ ఈ గ్రంధి ఆధీనంలో ఉంటాయి. అంతేకాకుండా ఇది ఉత్పత్తి చేసే కాల్సిటోనిన్‌ అనే హార్మోన్‌ శరీరంలో కాల్షియం సమతుల్యతను కాపాడుతుంది. ఏవైనా కారణాల వల్ల థైరాయిడ్‌ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్‌లో హెచ్చుతగ్గులయినపుడు థైరాయిడ్‌ సమస్యలు ఏర్పడతాయి. 
హైపోథైరాయిడిజమ్‌
థైరాయిడ్‌ ఉత్పత్తి చేసే హార్మోన్‌లు తగ్గితే హైపోథైరాయిడిజమ్‌ అని అంటారు. దీనివల్ల శరీరం లావు కావడం, మంద బుద్ది, మతిమరుపు, పనిపైన ఆసక్తి లేకపోవడం, మలబద్దకం, రక్తహీనత, రక్తపోటు తగ్గిపోవడం, చర్మం పొడిబారినట్టు ఉండటం, వెంట్రుకలు రాలిపోతుండటం జరుగుతుంది. హైపో థైరాయిడిజమ్‌ స్త్రీలలో ఉంటే నెలసరి సరిగ్గా రాకపోవడం, 2-3 నెలలకొకసారి రావడం లేక 6 నెలల వరకు రాకపోవడం, రక్తస్రావం చాలా ఎక్కువగా అవుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సంతానలేమి సమస్య తలెత్తుతుంది. ఒకవేళ గర్భం ధరించినా అబార్షన్‌ కావడం జరుగుతుంది. గర్భిణీగా ఉన్నప్పుడు థైరాయిడ్‌ సమస్య ఉంటే పిల్లలు పుట్టుకతోనే లోపంతో జన్మించే అవకాశాలు ఉంటాయి. మానసిక ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, గుండె సంబంధిత వ్యాధులతో జన్మించడానికి ఆస్కారం ఉంటుంది. 
హైపర్‌థైరాయిడిజమ్‌
థైరాక్సిన్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తి అయినపుడు ఈ సమస్య ఏర్పడుతుంది. బరువు తగ్గడం, అధిక రక్తపోటు, చేతులు వణకడం, నిద్రలేమి, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరిలో సంతానలేమి సమస్య కూడా ఉంటుంది. స్త్రీలు, పురుషులు, పిల్లలు...వీరిలో ఎవరికైనా థైరాయిడ్‌ సమస్య రావచ్చు. అయితే థైరాయిడ్‌ సమస్య స్త్రీలలో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. 
కారణాలు
థైరాయిడ్‌ సమస్యకు అయోడిన్‌ లోపం ప్రధాన కారణంగా ఉంటుంది. దీనికితోడు కంజీనియల్‌ హైపోథైరాయిడిజమ్‌, అటో ఇమ్యూన్‌ డిజార్డర్స్‌, డ్రగ్స్‌ వాడకం, గ్రేవ్స్‌ డిసీజ్‌, పిట్యూటరీ ఎడినోమా, థైరాయిడ్‌ గ్రంథికి ఆపరేషన్‌ చేయడం, థైరాయిడైటిస్‌ వంటి కారణాల వల్ల థైరాయిడ్‌ సమస్య ఏర్పడుతుంది. 
వ్యాధులకు మూలం
థైరాయిడ్‌ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అనేక వ్యాధులు వచ్చిపడతాయి. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోకుంటే అనేక దుష్ఫరిణామాలు సంభవిస్తాయి. డయాబెటిస్‌, కొలెస్ట్రాల్‌ పెరిగిపోవడం, సంతానలేమి, గుండె సంబంధిత వ్యాధులు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. గొంతు దగ్గర వాపు ఏర్పడటం వల గొంతు బొంగురు పోవడం, ఆహారం మింగడానికి కష్టం కావడం, శ్వాసకు ఇబ్బంది ఏర్పడటం జరుగుతుంది. 
నిర్ధారణ పరీక్షలు
థైరాయిడ్‌ సమస్యను నిర్ధారించుకోవడానికి కొన్ని పరీక్షలు అవసరమవుతాయి.  టి3, టిఎస్‌హెచ్‌, టీఎస్‌ఐ, థైరాయిడ్‌ స్కాన్‌, ఎఫ్‌ఎన్‌ఏసి వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా థైరాయిడ్‌ సమస్య ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. 
హోమియో చికిత్స
వ్యక్తి యొక్క వ్యాధి లక్షణాలు, మానసిక లక్షణాలు, జీవనశైలి, అలవాట్లని ఆధారంగా చేసుకొని హోమియో చికిత్సను అందించడం జరుగుతుంది. ఈ విధానంలో ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు. ఈ చికిత్స వల్ల వ్యాధి లక్షణాలు తగ్గడంతో పాటు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. 
నేట్రంమూర్‌ : అతి తక్కువగా మాట్లాడటం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం, బాధల్ని బయటపెట్టడానికి ఇష్టపడకపోవటం, సానుభూతి చూపిస్తే తట్టుకోలేకపోవడం, ఓదారుస్తే బాధపెరగడం, ఉప్పు ఎక్కువగా ఉంటే పదార్థాలు(చిప్స్‌) తినాలనిపించడం, ఎండకు వెళితే తలనొప్పి రావడం వంటి లక్షణాలతో బాధపడుతున్నవారు ఈ ఔషధం ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
కాల్కేరియా కార్బ్‌ : తెల్లగా, లావుగా ఉంటారు. చలిని తట్టుకోలేరు. పాలు,గుడ్లు ఎక్కువగా ఇష్టపడతారు. పిరికి స్వభావం ఉంటుంది. నలుగురితో ఉండటానికి ఇష్టపడతారు. సానుభూతి పొందడానికి ఇష్టపడుతుంటారు. ఈ లక్షణాలు ఉన్న వారు కాల్కేరియా కార్బ్‌ తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. 
పల్సటిల్లా : త్వరగా ఏడ్చే వ్యక్తిత్వం ఉంటుంది. ఓదార్చినా, బాధను చెప్పుకున్నా ఉపశమనంగా ఉంటుంది. మూడ్‌ ఎప్పుడూ మారుతుంటుంది. వేడిని తట్టుకోలేరు. నీళ్లు తక్కువగా తాగుతారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఉపయోగించదగిన మందు. 
సెపియా : కుటుంబ సభ్యులపైన ప్రేమ, ఆప్యాయతలు లేకపోవడం, ఒకప్పుడు ఇష్టపడిన వారిని ఇప్పుడు అసహ్యించుకోవడం, ఒంటరిగా ఉండాలని కోరుకోవడం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందు తీసుకుంటే ఫలితం ఉంటుంది. 
థైరాయిడ్‌ సమస్య ఉందని తెలియగానే తెలిసిన నాలుగు మందులు వేసుకుంటే ఫలితం ఉండదు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో పూర్తి స్థాయి చికిత్సతీసుకున్నప్పుడే పూర్తిగా వ్యాధి నియంత్రణ సాధ్యమవుతుంది. 
తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
గాయిటర్‌ జెనిక్‌ సబ్‌స్టెన్సెస్‌ అయినటువంటి గోబిపువ్వు, గోబిగడ్డ, ముల్లంగి, సోయా ఉత్పత్తులను మానేయాలి. పొగతాగడం, మద్యంసేవించడం అలవాటుకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వాకింగ్‌ చేయాలి. 
 
డా. కవిత
సీనియర్‌ ఫిజీషియన్‌
మాస్టర్స్‌ హోమియోపతి
ఫోన్‌ : 7842 106 106
         9032 106 106