థైరాయిడ్‌ సమస్యలకు తిరుగులేని వైద్యం

02-09-13

 
జీవక్రియలకు అవసరమైన ముఖ్యమైన గ్రంథి థైరాయిడ్‌. ఎప్పుడైతే థైరాయిడ్‌ గ్రంథి సరిగ్గా పనిచేయదో అది ఆరోగ్యానికి సంబంధించిన  ప్రతివిషయాన్ని ప్రభావితం చేస్తుంది. హఠాత్తుగా స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులు, మానసిక ఆందోళనలు, ఆత్రుత, వెంట్రుకలు ఊడటం, సెక్సువల్‌ డిస్‌ఫంక్షన్‌, సంతానలేమి వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే థైరాయిడ్‌ సమస్యను గుర్తించడమే ముఖ్యమంటూ దానికి పరిష్కారాలు చెబుతున్నారు హోమియోపతి వైద్యులు మురళీ అంకిరెడ్డి. 
 
థైరాయిడ్‌ గ్రంథి సీతాకోక చిలుక ఆకారంలో గొంతు భాగంలో వుంటుంది. ఇది పిట్యుటరీ గ్రంథి ఆధీనంలో ఉంటుంది. థైరాయిడ్‌ గ్రంథిలో ముఖ్యంగా రెండు తేడాలను చూస్తాము. అవి టీ3, టీ4 తగ్గడం వలన హైపోథైరాయిడిజమ్‌, రక్త పరీక్షలో టీ5 హెచ్‌ పెరగటం, టీ3, టీ4 తగ్గటం లేదా నార్మల్‌గా వుంటుంది. టీ3, టీ4 పెరగటం వలన హైపర్‌ థైరాయిడిజమ్‌ చూస్తాము. ప్రపంచ జనాభాలో సుమారు 75శాతం మహిళలు ధైరాయిడ్‌ సమస్యతో బాధపడుతున్నా రు. మగవారిలో కేవలం 15శాతం! దీనికి కారణం మారిన జీవనవిధానం, మానసిక ఒత్తిళ్లే. థైరాయిడ్‌ టీ3, టీ4 హార్మోన్స్‌ను తయారు చేస్తుంది. టీ3 ట్రై ఐడో థైరోనిన్‌, టీ4 థైరాక్సిన్‌  హార్మోన్స్‌ శరీరంలో...
బీఎమ్మార్‌ బేస్డ్‌ మెటబాలిక్‌ రేట్‌ను పెంచుతా యి, ఫ్యాట్‌, కార్బోహైడ్రేట్‌ మెటబాలిజమ్‌ పెం చుతాయి, ప్రొటీన్ల తయారీ, గుండెకు, ఇతర అవ యవాలకు రక్త సరఫరా హెచ్చిస్తాయి. పిల్లల్లో థైరా యిడ్‌ హార్మోన్స్‌ వల్ల గుండె, మెదడు పెరుగుదల సాధారస్థాయిలో వుంటుంది. ఎముకల ఎదుగుదల, కాల్షియం మెటబాలిజమ్‌లో థైరాయిడ్‌ హార్మోన్స్‌ ఆవశ్యకత వున్నది. 
ఆరోగ్యంగా ఉన్నప్పుడు థైరాయిడ్‌ పాత్ర: సమతుల్యత, పోషణ, శరీర పెరుగుదలకు థైరాయిడ్‌ గ్రంథి అవసరం చాలా వుంది. హైపోథాలమిక్‌, పిట్యూటరీ థైరాయిడ్‌ ఆక్సిన్‌ ద్వారా థైరాయిడ్‌ హార్మోన్స్‌ తయారీ, నియంత్రణ ఆధారపడి ఉంటుంది. 
కొన్ని కారణాల వలన కలిగే మార్పులు: 
థైరాయిడ్‌ గ్రంథిలో వాపు, ఇన్‌ఫ్లమేషన్‌, హార్మోన్స్‌ ఎక్కువ కావడం, హార్మోన్స్‌ తక్కువ కావడం, ఇలా థైరాయిడ్‌ హార్మోన్స్‌ ఎక్కువయినప్పుడు దానిని హైపర్‌థైరాయిడి జమ్‌ అంటారు.
లక్షణాలు: 
ఆకలి ఎక్కువ ఉంటుంది. కానీ, బరువు తగ్గుతారు, కోపం, చికాకు, అలసట, ఉద్రేకం, నాడీవేగం పెరగడం, కాళ్లు, చేతులు వణకడం, చెమటలు పట్టడం, నీటివిరేచనాలు!
థైరాయిడ్‌ గ్రంథి భాగం వాచి, ఇన్‌ఫ్లమేషన్‌ వున్నప్పుడు థైరోటాక్సికోసిస్‌/గ్రేవ్స్‌డిసీజ్‌ అంటారు. దీన్నే ఆటోఇమ్యూన్‌ డిసార్డర్‌ అని కూడా అంటారు. ఇది 30ఏళ్లు పైబడిన మహిళల్లో ఎక్కువ కనిపిస్తుంది. కనుగుడ్లు బయటకు వచ్చినట్టు అనిపించడం, కనులోపలి కండరాలు, కొవ్వులోపలి భాగం వాచి కనుగుడ్లను బయటకు తోస్తాయి. ఇది థైరాయిడ్‌ కణుతుల రూపంలో ఒకటి/ రెండు మూడు ఉండవచ్చు. దీన్నే నోడ్యూలర్‌ గాయిటర్‌ అని కూడా అంటారు.
హైపోథైరాయిడిజమ్‌: టీ3,టీ4 హార్మోన్స్‌ ఉత్పత్తి కొన్ని కారణాల వల్ల తగ్గుతుంది. 
లక్షణాలు: నీరసం, బద్దకం, వేడి ఉష్ణోగ్రతలో కూడా చలిగా ఉంటుంది, బరువుపెరుగటం, డిప్రెషన్‌, ముఖం వాచినట్టు ఉండటం, జుట్టు రాలటం, చర్మం పొడిబారినట్టు ఉండటం, మలబద్దకం, గొంతు బొంగురు పోవటం. 
కారణాలు: థైరాయిడ్‌ గ్రంథిలోనే లోపం కలుగటం. దీన్ని హషిమోటోస్‌ థైరాయిడ్‌ వాపు అంటారు. శరీరంలో యాంటీబాడీస్‌ తయారై గ్రంథిని పనిచేయనికుండా చేస్తాయి. ఇది కూడా ఆటోఇమ్యూన్‌ డిసార్డరే. ఇది 30- 50 ఏళ్ల స్త్రీలలో ఎక్కువ కనిపిస్తుంది. నియంత్రణ లేని హైపర్‌ థైరాయిడ్‌ ట్రీట్‌మెంట్‌ వలన హైపోథైరాయిడ్‌గా మారవచ్చు.
చిన్నపిల్లల్లో హైపోథైరాయిడ్‌ వలన పెరుగుదల లోపాలుంటాయి. మెదడు పెరుగుదల ఆగిపోవచ్చు. అంతేకాదు పుట్టుకతో థైరాయిడ్‌ లోపాలుండవచ్చు. 
రోగనిర్ధారణ: 
రక్తపరీక్ష: టీ3, టీ4, టీ5హెచ్‌ లెవల్స్‌.
గ్రేవ్స్‌డిసీజ్‌: టీ3,టీ4 లెవల్స్‌ ఎక్కువలో టీ3హెచ్‌ లెవల్‌ తక్కువగా ఉంటుంది.
రక్తపరీక్ష: థైరాయిడ్‌ యాంటిబాడీస్‌, థైరాయిడ్‌ స్కానింగ్‌, అల్ర్టాసౌండ్‌.
చికిత్స: 
హైపర్‌థైరాయిడ్‌: యాంటీ థైరాక్స్‌, నియో
ఈ డ్రగ్‌ థైరాయిడ్‌ హార్మోన్‌ తయారిని తగ్గిస్తుంది. 
హైపోథైరాయిడ్‌:
థైరోనార్మ్‌: థైరాక్సిన్‌ సోడియం, 25,50,100 సీజీలలో లభించును. ఎలకో్ట్రక్సిన్‌, రాక్సిన్‌, ప్రొలాయిడ్‌.
కొలోసొల్‌(అయోడిన్‌)లిక్విడ్‌ 8గ్రా.,అయోడిన్‌ 5.ఎం.ఎల్‌. 
హైపర్‌ థైరాయిడిజమ్‌లో వాడవచ్చు. ఇది థైరాయిడ్‌ హార్మోన్‌ రిలీజ్‌ ఆపుతుంది. 
హోమియోవైద్యం: హోమియోపతి వైద్యవిధానంలో థైరాయిడ్‌కు గల మూలకారణాలను విశ్లేషించి, శారీరక, మానసిక లక్షణాలను విచారించి సరైన హోమియో మందుల తత్వ విచారణ ద్వారా చికిత్స చేయవచ్చు. 
 
డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి 
ఎండీ, హోమియో, స్టార్‌ హోమియోపతి 
సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి, విజయవాడ, వైజాగ్‌, తిరుపతి, రాజమండ్రి, కర్నాటక
ఫోన్‌: 90300 81876, 9030081861