హోమియోలో థైరాయిడ్‌కు పరిష్కారం

27-06-2018: నేటికాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య థైరాయిడ్‌. ఆధునిక జీవనశైలిలో భాగంగా మారిన ఆహారపు అలవాట్లు, వ్యాయామలోపం, అధిక మానసిక ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. దీని బారిన పడిన వారు జీవితకాలం మందులు వాడడం తప్ప మరో మార్గం లేదని, ఆందోళన చెందుతుంటారు. కానీ కాన్స్‌టిట్యూషనల్‌ హోమియో వైద్య విధానం ద్వారా థైరాయిడ్‌ సమస్యలను నియంత్రణలో ఉంచే అవకాశం ఉంది.
 
సాధారణంగా థైరాయిడ్‌ గ్రంథి కంఠం ముందు భాగంలో, సీతాకోకచిలుక ఆకారంలో శ్వాసనాళానికి ఇరుపక్కలా ఉంటుంది. శరీరంలోని హైపోథలామస్‌ నుంచి విడుదలయ్యే ఖీఖఏ (థైరాయిడ్‌ రిలీజింగ్‌ హార్మోన్‌) సంకేతంతో పిట్యుటరీ గ్రంథి - శరీరంలోని హార్మోన్‌ల స్థాయిలను గుర్తించి ఖీఖిఏ (థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ మార్మోన్‌)ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్‌ థైరాయిడ్‌ గ్రంథిని ఉత్తేజపరచడం ద్వారా అది ఖీ3, ఖీ4 హార్మోన్‌లను ఉత్పత్తి చేసి, రక్తప్రవాహంలోకి పంపుతుంది. ఇలా రక్తప్రవాహంలో కలసిన ఆ హార్మోన్‌లు - ప్రతి కనానికి చేరుకుని అన్ని జీవక్రియలైన - గుండె, నాడీ, జీర్ణవ్యవస్థ, మానసిక మరియు శారీరక ఎదుగుదల, బేసల్‌ మెటబాలిక్‌ రేట్‌ మరియు సంతాన ఉత్పత్తి వంటి అన్నింటిపైనా ప్రభావం చూపటం జరుగుతుంది.
 
హైపోథైరాయిడిజం: శరీరంలోని థైరాయిడ్‌ హార్మోన్‌లు తక్కువ మోతాదులో ఉత్పత్తి కావడాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఇది సాధారణంగా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఏ వయస్సు వారికైనా సమస్య రావచ్చు. ఇది చిన్న పిల్లలు, స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది.
 
లక్షణాలు: చిన్నపిల్లలలో: బుద్దిమాంద్యం, ఎదుగుదల లోపం, జ్ఞాపకశక్తి లేకపోవడం, మలబద్దకం, చురుకుదనం కోల్పోవడం, వయస్సుకు మించి లావుగా ఉండటం.
యుక్త వయస్సు వారిలో: బరువు పెరగడం, బరువు తగ్గిపోవడం, రజస్వల ఆలస్యం కావడం, ఋతుచక్ర సమస్యలు- నెలసరి రాకపోవడం, సంతానలేమి, చర్మం పొడిబారటం, ఏకాగ్రత లోపించడం, కీళ్ళు, కండరాల నొప్పికి గురికావడం వంటి లక్షణాలను గమనించవచ్చు.
 
హైపర్‌ థైరాయిడిజం: థైరాయిడ్‌ హార్మోన్‌లు శరీరంలో ఎక్కువ మోతాదులో ఉత్పత్తి కావడాన్ని హైపర్‌థైరాయిడిజం అంటారు. లక్షణాలు: ఆహారం సరైన మోతాదులో తీసుకు న్నప్పటికీ - బరువు తగ్గిపోవడం, నెలసరి త్వరగా రావడం, ఋతుచక్రంలో అఽధిక రక్తస్రావం అవడం, సంతానలేమి, చెమటలు పట్టడం, చేతులు వణకడం, వేడిని తట్టుకోలేకపోవడం, గుండెదడ, వీరేచనాలు, అర్టికేరియా వంటి చర్మ సమస్యలను గమనించవచ్చు.
 
గాయిటర్‌: థైరాయిడ్‌ గ్రంథి వాపునకు గురి కావడాన్ని ‘గాయిటర్‌’ అంటారు. కొన్ని సందర్భాలలో ఇది సాధారణ పరిమాణం కంటే రెండింతలు పెరిగి-స్వరపేటికపైన ఒత్తిడిని కలిగించడం వలన స్వరంలో మార్పు వస్తుంది. గాయిటర్‌లో థైరాయిడ్‌ హార్మోన్‌లు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ గాయిటర్‌ వ్యాధి లేనట్లుగా నిర్థారించలేము. కారణాలు: గాయిటర్‌ వ్యాధికి ముఖ్యమైన కారణం ‘అయోడిన్‌’ అనే మూలకం యొక్క లోపం, లక్షణాలు: గొంతు క్రింద వాపు ఏర్పడటం వలన, మింగడానికి కష్టంగా ఉంటుంది. స్వరంలో మార్పులు రావడం, కనుగుడ్లు బయటకు పొడుచుకు వచ్చినట్లుగా ఉండడం వంటి లక్షణాలను గమనించవచ్చు.
 
కారణాలు: నేటి మానవుని జీవన విధానం ప్రకృతి విరుద్దముగా ఉండడం, అధిక మానసిక ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ తక్కువగా ఉండడం, వ్యాయామం లేకపోవడం, పౌష్టికాహార లోపం, అయోడిన్‌ లోపం, థైరాయిడ్‌ గ్రంథిని కొద్దిగా తొలగించడం, పిట్యూటరీ గ్రంథిలో వచ్చే వ్యాధులు మరియు వంశపారంపర్యత వంటి అంశాల వల్ల ఈ థైరాయిడ్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
 
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ చికిత్స: థైరాయిడ్‌ సమస్యతో బాధపడే చాలామందికి - తాము తీసుకునే మందులు, కేవలం హార్మోన్‌ల సప్లిమెంట్‌ మాత్రమేనని తెలియదు. వారు ఈ సమస్యకు జీవితకాలం మందులు వాడడం తప్ప వేరే మార్గం లేదని అనుకుంటారు. కానీ హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌లో మాత్రమే అందించబడే జెనటిక్‌ కాన్స్‌టిబ్యూషనల్‌ చికిత్సా విధానంలో రోగి మానసిక శారీరక లక్షణాలపై పూర్తిగా అధ్యయనం జరిపి, ఆ రోగిని వ్యక్తిగతీకరించడం ద్వారా, ఆ రోగికి సరిపడిన ఔషదాన్ని గుర్తించి, చికిత్స అందించడం వలన అసమతులతకు గురి అయిన హార్మోన్‌ల స్థాయిలను సరిచేయడం జరుగుతుంది. అందువలన జీవితకాలం మందులు వాడే అవసరం లేకుండా వ్యాధి సమర్థవంతంగా నయమవుతుంది.
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ CMD
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి