థైరాయిడ్‌ సమస్య ఇక దూరం

17/12/14

థైరాయిడ్‌ హార్మోన్‌ ప్రభావం అన్ని జీవ వ్యవస్థల ఎదుగుదల, కార్బొహైడ్రేట్‌ కొవ్వు   పదార్థాల జీవ వ్యవస్థ, బీఎంఆర్‌, శ్వాస, గుండె, నాడీ , జీర్ణ, సంతాన ఉత్పత్తి వ్యవస్థలపై ఉంటుంది. థైరాయిడ్‌ సమస్యలను హోమియో వైద్యంలోని జెనిటిక్‌ కాన్‌స్టిట్యూషన్‌ సిమిలిమం విధానం ద్వారా నయం చేయవచ్చంటున్నారు హోమియో వైద్యనిపుణులు డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్‌.
థైరాయిడ్‌ గ్రంధి గొంతు భాగంలో థైరాయిడ్‌ కార్టిలేజ్‌ అనే మృదులాస్థిపైన ఉంటుంది. ఈ గ్రంధిలో మార్పుల వల్ల హైపర్‌ థైరాయిడ్‌, హైపోథైరాయిడ్‌ సమస్యలు వస్తుంటాయి.
కారణాలు : జీవన విధానంలో మార్పులు, అధిక ఒత్తిడి, కొరవడిన వ్యాయామం, పోష్టికాహారలోపం వల్ల థైరాయిడ్‌ బారిన పడతారు. వంశపారంపర్యంగా సమస్యలు, అయోడీన్‌ లోపం, పిట్యూటరీ గ్రంధిలో వచ్చే వ్యాధుల వల్ల థైరాయిడ్‌ సమస్యలు వస్తుంటాయి. 
హైపోథైరాయిడిజం
శరీరంలో కావాల్సిన దానికంటే తక్కువ మోతాదులో థైరాయిడ్‌ గ్రంధి థైరాక్సిన్‌ ఉత్పత్తి చేయడం వల్ల వస్తుంది. పిల్లలు, స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. 
లక్షణాలు : పిల్లల్లో బుద్దిమాంద్యం, ఎదుగుదల లోపం, జ్ఞాపకశక్తి లేకపోవటం, మలబద్ధకం, చురుకుదనం కోల్పోవటం, వయసుకు మించి లావుగా ఉండటం.
యుక్తవయసువారిలో : ఒంట్లో నీరు చేరి బరువు పెరగటం, బీఎంఆర్‌ తగ్గిపోయి రజస్వల ఆలస్యం కావటం, రుతుచక్రం ఆలస్యం కావటం, నెలసరిలో అధిక రక్తస్రావం, తక్కువ రక్తస్రావం కావడం, సంతానలేమి, చ ర్మం పొడిబారటం, వెంట్రుకలు రాలడం, బద్ధకంగా ఉండి పనిచేయాలని అనిపించక పోవడం, చలిని తట్టుకోలేక పోవడం, ఆడవారిలో రోజూ వేసుకునే దుస్తులు, గాజులు బిగుతు కావడం, అర్టికేరియా చర్మ సంబంధ వ్యాధుల లక్షణాలతో హైపో థైరాయిడ్‌ను గుర్తించవచ్చు. 
హైపర్‌ థైరాయిడిజం
థైరాయిడ్‌ గ్రంధి ఎక్కువ మోతాదులో థైరాక్సిన్‌ను విడుదల చేయడం వల్ల వచ్చే సమస్యను హైపర్‌ థైరాయిడిజం అంటారు. 
లక్షణాలు: ఆహారం సరైన మోతాదులో తీసుకున్నా బరువు తగ్గడం, గుండెదడ, అధిక చెమటలు, విరేచనాలు, చేతులు వణకడం, నీరసంగా ఉండటం, నెలసరి త్వరగా రావడం, రుతుచక్రంలో అధిక రక్తస్రావం జరగటం. 
హషిమోటోస్‌ థైరాయిడైటిస్‌ : ఇది జీవనక్రియల అసమతుల్యత వల్ల వచ్చే థైరాయిడ్‌ సమస్య. థైరాయిడ్‌ గ్రంధికి వ్యతిరేకంగా యాంటీబాడీస్‌ ఉత్పన్నం అయి ఈ గ్రంధిని సరిగా పనిచేయనియ్యవు. 
గాయిటర్‌ : థైరాయిడ్‌ గ్రంధి వాపునకు గురవటాన్ని గాయిటర్‌ అంటారు. పరిమాణం పెరిగి స్వరపేటికపైన ఒత్తిడి చేయడం వల్ల వాయిస్‌లో మార్పు వస్తుంది. అయోడీన్‌ లోపం వల్ల ఈ వ్యాధి వస్తుంది. స్వరంలో మార్పులు రావటం, గొంతుకింద వాపు, కనుగుడ్లు బయటకు పొడుచుకు వచ్చినట్లుగా ఉండటం.
నిర్ధారణ పరీక్షలు : థైరాయిడ్‌ ప్రొఫైల్‌, యాంటీ థైరాయిడ్‌ యాంటీబాడీస్‌, గొంతు సీటీస్కాన్‌.
హోమియో చికిత్స :థైరాయిడ్‌కు థైరాక్సిన్‌ అనేది ట్రీట్‌మెంట్‌ సప్లిమెంట్‌ మాత్రమే. హోమియో వైద్యంలో రోగి యొక్క శరీర తత్వాన్ని బట్టి సరైన చికిత్స చేస్తే త్వరగా థైరాయిడ్‌ వ్యాధి నయం అవుతుంది. జెనిటిక్‌ కాన్‌స్టిట్యూషన్‌ సిమిలిమం విధానం ద్వారా హైపోతేలమస్‌ పిట్యూటరీ, థైరాయిడ్‌ వ్యవస్థను సరిచేయడం వల్ల థైరాయిడ్‌ సమస్య దూరమవుతుంది.
 
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లవార్‌ (సీఎండీ)
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ ప్ర్తె.లి.
హైదరాబాద్‌
 ఫోన్‌ : 9550001199/88
టోల్‌ ఫ్రీ : 1800 102 2202