23-08-13
జీవక్రియలు నిర్వర్తించే గ్రంఽథుల పనితీరులో తేడా వస్తే దాని ప్రభావం మొత్తం శరీర వ్యవస్థపై పడుతుంది. ఇందుకు మంచి ఉదాహరణ థైరాయిడ్ గ్రంథి. ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్లలో తేడా వస్తే అనేక సమస్యలు వచ్చిపడతాయి. తెలియని ఆందోళన మొదలవుతుంది. చాలామంది థైరాయిడ్ సమస్యకు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుందని భావిస్తుంటారు. కానీ ఆ అవసరం లేదని, హోమియో చికిత్సతో థైరాయిడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంటున్నారు హోమియో వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్ మొర్లవార్.
థైరాయిడ్ గ్రంథి మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. జీవక్రియలన్నింటికీ ఇది అతి ముఖ్యమైన గ్రంథి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ గ్రంథిలో వచ్చే కొన్ని మార్పుల వల్ల సమస్యలు మొదలవుతాయి. దాని ప్రభావం జీవక్రియ వ్యవస్థపై పడుతుంది. పుట్టిన పిల్లలు బరువు అధికంగా లేదా తక్కువగా ఉండటం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గడం, తరచూ జలుబు, దగ్గు, ఆయాసం బారినపడటం జరుగుతుంది. నీరసం, చిరాకు, కాళ్లు చేతులు చల్లబడటం, ముఖంలో వాపు, కీళ్లవాపులు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రావడం జరుగుతుంది. స్త్రీలలో పీసీఓడి, ఫైబ్రాయిడ్లు, తెల్లబట్ట, మొటిమలు, నల్లమచ్చలు, సంతానలేమి వంటి సమస్యలు కనిపిస్తాయి. పురుషుల్లో వీర్యకణాల లోపం, సెక్స్ సమస్యలు కనిపిస్తాయి.
రకాలు
థైరాయిడ్ సమస్యలు రెండు రకాలు. ఒకటి హైపోథైరాయిడిజమ్, రెండవది హైపర్‌థైరాయిడిజమ్.
హైపోథైరాయిడిజమ్
థైరాయిడ్ ఉత్పత్తి చేసే హార్మోన్లు తగ్గితే హైపోథైరాయిడిజమ్ అని అంటారు. ఇది స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. బరువు పెరగడం, నెలసరి సరిగ్గా రాకపోవడం, ఆయాసం, చలికి తట్టుకోలేకపోవడం, జుట్టు రాలడం, చర్మం పొడిబారడం, కీళ్లనొప్పులు, ఏ పని మీదా దృష్టి నిలపకపోవడం, చిరాకు వంటి సమస్యలు ఉంటాయి. హైపో థైరాయిడిజమ్ స్త్రీలలో ఉంటే నెలసరి సరిగ్గా రాకపోవడం, 2-3 నెలలకొకసారి రావడం లేక 6 నెలల వరకు రాకపోవడం, రక్తస్రావం చాలా ఎక్కువగా అవుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సంతానలేమి సమస్య తలెత్తుతుంది. ఒకవేళ గర్భం ధరించినా గర్భస్రావం జరుగుతుంది. గర్భిణీగా ఉన్నప్పుడు థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టుకతోనే లోపంతో జన్మించే అవకాశాలు ఉంటాయి. మానసిక ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, గుండె సంబంధిత వ్యాధులతో జన్మించడానికి ఆస్కారం ఉంటుంది.
హైపర్‌థైరాయిడిజమ్
థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. గుండె దడ, చేతులు, కాళ్లు వణకడం, నిద్రలేమి, ఆందోళన, బరువు తగ్గిపోవడం, వేడిని తట్టుకోలేకపోవడం, ఆకలి పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరిలో సంతానలేమి సమస్య కూడా ఉంటుంది. ఆలోచనా శక్తి సన్నగిల్లడం, చదువులో వెనకబడటం వంటి సమస్యలు వస్తాయి. స్త్రీలు, పురుషులు, పిల్లలు...వీరిలో ఎవరికైనా థైరాయిడ్ సమస్య రావచ్చు. అయితే థైరాయిడ్ సమస్య స్త్రీలలో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది.
నిర్ధారణ పరీక్షలు
థైరాయిడ్ సమస్యను నిర్ధారించుకోవడానికి కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. టి3, టి4, టిఎస్హెచ్ హార్మోన్ల తీవ్రతను రక్తపరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ హార్మోన్లలో ఉండే హెచ్చుతగ్గులను బట్టి వ్యాధిని నిర్ధారణ చేయడం జరుగుతుంది.
కారణాలు
థైరాయిడ్ సమస్యకు అయోడిన్ లోపం ప్రధాన కారణంగా ఉంటుంది. దీనికితోడు కంజీనియల్ హైపోథైరాయిడిజమ్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, డ్రగ్స్ వాడకం, గ్రేవ్స్ డిసీజ్, పిట్యూటరీ ఎడినోమా, థైరాయిడ్ గ్రంథికి ఆపరేషన్ చేయడం వంటి కారణాల వల్ల థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది.
వ్యాధులకు మూలం
థైరాయిడ్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అనేక వ్యాధులు వచ్చిపడతాయి. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోకుంటే అనేక దుష్ఫరిణామాలు సంభవిస్తాయి. డయాబెటిస్, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, సంతానలేమి, గుండె సంబంధిత వ్యాధులు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. గొంతు దగ్గర వాపు ఏర్పడటం వల్ల గొంతు బొంగురుపోవడం, ఆహారం మింగడానికి కష్టం కావడం, శ్వాసకు ఇబ్బంది ఏర్పడటం జరుగుతుంది.
హోమియో చికిత్స
థైరాయిడ్ సమస్యకు హోమియోలో చక్కని వైద్యం అందుబాటులో ఉంది. ఈ మందులను జీవితాంతం వాడవల్సిన అవసరం ఉండదు. వ్యాధి లక్షణాలు, మానసిక లక్షణాలు, జీవనశైలి, అలవాట్లని ఆధారంగా చేసుకొని హోమియో చికిత్సను అందించడం జరుగుతుంది. ఈ విధానంలో ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. ఈ చికిత్స వల్ల వ్యాధి లక్షణాలు తగ్గడంతో పాటు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో పూర్తి స్థాయి చికిత్స తీసుకున్నప్పుడే పూర్తిగా వ్యాధి నియంత్రణ సాధ్యమవుతుంది.
డాక్టర్ శ్రీకాంత్ మొర్లవార్
సీఎండీ
హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్ర్తె.లి.
ఫోన్ : 9550003399