థైరాయిడ్‌ సమస్యలకు హోమియో మేలు

22/07/15

మానవుడిశరీరంలోని ముఖ్యమైన గ్రంథులలో థైరాయిడ్‌ ఒకటి. ఈ గ్రంథి మెడ ప్రాంతంలో కంఠం దగ్గర సీతాకోక చిలుక యొక్క రెక్కల రూపంలో శ్వాసనాళానికి ఇరుపక్కలా ఉంటుంది. ఇది థైరాయిడ్‌ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు రక్త ప్రవాహంలో కలిసి శారీరక ఎదుగుదల, వివిధ జీవక్రియలను నిర్వహిస్తుంది. మన మెదడులోని పిట్యూటరీ గ్రంథి థైరాయిడ్‌ గ్రంథిని నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలో తగినంత థైరాయిడ్‌ హార్మోన్లు లేనప్పుడు పిట్యూటరీ గ్రంథి అవసరాన్ని గ్రహించి థైరాయిడ్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌ని విడుదల చేస్తుంది. ఈ ్టటజి సంకేతంతోనే థైరాయిడ్‌ గ్రంథి అనే థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తి ఎకుకవైనా, అలాగే తక్కువైనా కూడా సమస్యగా పరిణమిస్తుంది. వీటి అసమతుల్యతల వల్ల హైపోథైరాయిడ్‌, హైపర్‌ థైరాయిడ్‌, గాయిటర్‌ అనే దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి.
హైపోథైరాయిడిజమ్‌
 ఇది సర్వసాధారణంగా కనిపించే థైరాయిడ్‌ సమస్య. శరీరంలో థైరాయిడ్‌ హార్మోన్లు కావలసిన దానికంటే తక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం వల్ల వస్తుంది. ఏ వయసులో వారైనా హైపోథైరాయిడిజమ్‌కి గురి కావచ్చు. పిల్లలు, స్ర్తీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. 
లక్షణాలు
నిస్సత్తువ, బలహీనత, చర్మం పొడిబారడం, చెమట తక్కువ, బరువు పెరగడం, నెలసరి సరిగా రాకపోవడం, జుట్టు రాలడం, మతిమరుపు, మలబద్ధకం, అజీర్ణం, చలికి తట్టుకోలేకపోవడం, పిల్లల్లో ఎదుగుదల తగ్గడం, ఆడపిల్లల్లో రజస్వల ఆలస్యం లేదా ముందుగానే రావడం, వృద్ధుల్లో కుంగుబాటు వంటి లక్షణాలు ఉంటాయి. 
గర్భిణిల్లో జీవక్రియల వేగం పెరుగుతుంది. కాబట్టి థైరాయిడ్‌ హార్మోన్‌ అవసరము పెరిగి హైపోథైరాయిడిజమ్‌ రావచ్చు.హైపోథైరాయిడిజం ఉన్న గర్భిణిలు చికిత్స తీసుకుంటే పుట్టిన పిల్లల్లో ఐక్యూ మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.
హైపర్‌ థైరాయిడిజమ్‌
శరీరంలో థైరాయిడ్‌ హార్మోన్లు అవసరాన్ని మించి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుండటాన్ని హైపర్‌ థైరాయిడిజం అంటారు. ఈ హైపర్‌ థైరాయిడ్‌ సమస్య ఏ వయసులో వారికైనా రావచ్చు. కాకపోతే 20-40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిలో ఎక్కువ. మొత్తం థైరాయిడ్‌ బాధితుల్లో 80శాతం హైపోథైరాయిడిజం కనిపిస్తే 20శాతం హైపర్‌ థైరాయిడిజం ఉంటుంది. కాని దీన్ని త్వరగా గుర్తించలేకపోయినా, నిర్లక్ష్యం చేసిన దుష్ఫ్రభావాలు తీవ్రంగా ఉంటాయి.
లక్షణాలు  
ఆహారం సరిగ్గా తీసుకుంటున్నా బరువు తగ్గడం, నిద్రలేమి, గుండె దడ , అధిక చెమటలు, చేతులు వణకడం, నీరసంగా ఉండటం, స్త్రీలలో నెలసరి త్వరగా రావడం, అధిక రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
గాయిటర్‌
గొంతు కింద ఉండే థైరాయిడ్‌ గ్రంధి అసహజంగా వాపుకు గురి కావడాన్ని గాయిటర్‌ అంటారు. ఇది ముఖ్యంగా అయోడిన్‌లోపం వల్ల వస్తుంది. ఇది హైపో, హైపర్‌థైరాయిడ్‌ సమస్యలతో కూడుకుని ఉండవచ్చు. కొన్నిసార్లు థైరాయిడ్‌ హార్మోన్లు టీ3, టీ4 సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ గాయిటర్‌ ఉండవచ్చు.
లక్షణాలు
గొంతుకింద వాపు పరిమాణం ఎక్కువగా ఉంటే శ్వాసనాళం, ఆహారనాళంపైన ఒత్తిడి పెరిగి మింగడానికి కష్టం కావడం, స్వరంలో మార్పులు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇవి కాకుండా కొందరిలో హైపో, హైపర్‌థైరాయిడ్‌ లక్షణాలు ఉండవచ్చు. 
హోమియో వైద్యం ప్రస్తుత పరిస్థితుల్లో మానవుడి జీవన విధానం అధిక ఒత్తిడికి గురికావడం వల్ల ఎక్కువ మంది థైరాయిడ్‌ బారినపడుతున్నారు. థైరాయిడ్‌ సమస్యలకు జీవితకాలం మందులు వాడే పనిలేకుండా ఈ సమస్య రావడానికి గల మూలకారణాన్ని గుర్తించి వ్యక్తిత్వానికి అనుగుణంగా సరియైున హోమియో వైద్యం ఇవ్వడం ద్వారా థైరాయిడ్‌ హార్మోన్‌ సమస్యలు సంపూర్ణంగా దూరమవుతాయి.
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లవార్‌ (సీఎండీ)
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ ప్ర్తె.లి.
 ఫోన్‌ : 9550001199/88
టోల్‌ ఫ్రీ : 1800 102 2202