హైపోథైరాయిడిజం సమస్యకు హోమియో వైద్యం

ఆంధ్రజ్యోతి(09-10-2016): థైరాయిడ్‌ గ్రంధి సీతాకోకచిలుక ఆకారంలో గొంతు భాగంలో ఉంటుంది. ఈ గ్రంధి పిట్యూటరి గ్రంధి యొక్క ఆధీనంలో ఉంటుంది. థైరాయిడ్‌ గ్రంధిలో ముఖ్యంగా రెండు తేడాలను చూస్తాం. అవి టి3, టి4 తగ్గడం వలన హైపోథైరాయిడిజమ్‌ రక్తపరీక్షలో టిఎ్‌సహెచ పెరగడం, టి3,టి4 తగ్గడం లేదా నార్మల్‌గా ఉంటుంది. టి3,టి4 పెరగటం వల్ల హైపర్‌ థైరాయిడిజమ్‌ మొదలవుతుంది. థైరాయిడ్‌ గ్రంధి లోపాలు మన శారీరక, మానసిక వ్యవస్థ మీద పనిచేస్తాయి.
 
థైరాయిడ్‌ గ్రంధి జీవక్రియలకు అవసరమైన ముఖ్యమైన గ్రంధి. ఎప్పుడైతే మీ థైరాయిడ్‌ గ్రంధి పనిచేయదో అది మీ ఆరోగ్యపరమైన ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా బరువు, మానసిక ఆందోళనలు మరియు శక్తిస్థాయిలని థైరాయిడ్‌ సమస్యల్ని గుర్తించినట్లయితే అవి హఠాత్తుగా స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులు, మానసిక ఆందోళనలు, ఆత్రుత, వెంట్రుకలు రాలడం, సెక్సువల్‌ డిస్‌ఫంక్షన, సంతానలేమి మరియు ఇతర లక్షణాలు మరియు ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశాల్ని పెంచుతాయి. అందుకే థైరాయిడ్‌ సమస్యని గుర్తిండం అతి ముఖ్యమైనది. 
ప్రపంచ జనాభాలో సుమారు 7.5శాతం స్ర్తీలు థైరాయిడ్‌ సమస్యలతో భాదపడుతున్నారు. మగవారిలో మాత్రం 1.5శాతం మందిలోనే ఈ సమస్య ఉంది. దీనికి కారణం ముఖ్యంగా మారిన జీవనవిధానం, మానసిక ఒత్తిడులే అని చెప్పవచ్చు. థైరాయిడ్‌ గ్రంధి తయారుచేసే హార్మోన్స జీవన యంత్రాన్ని రసాయన పదార్థాలను నియంత్రిస్తుంది. థైరాయిడ్‌ ముఖ్యంగా టి3, టి4 అనే రెండు హార్మోన్సను తయారు చేస్తుంది.
 
టి3 ట్రైఐడో థైరోనిస్ టి4 థైరాక్సిన్
ఈ హార్మో న్స్ శరీరంలో 
1.బిఎమ్‌ఆర్‌ బేస్డ్‌ మెటబాలిక్‌ రేట్‌ను పెంచుతాయి. 
2. ఫాట్స్‌, కార్బొహైడ్రేట్‌ మెటబాలిసమ్‌ను పెంచుతాయి. 
3.ప్రొటీన్ల తయారీ 
4. గుండెకు, ఇతర అవయవాలకు రక్తసరాను పెంచుతుంది. 
పిల్లలలో థైరాయిడ్‌ హార్మోన్స వలన గుండె, మెదడు పెరుగుదల మామూలుగా ఉంటుంది. ఎముకల ఎదుగుదల, కాల్షియం మెటబాలిజమ్‌కు కూడా థైరాయిడ్‌ హార్మోన్స ఆవశ్యకత ఉంది.
ఆరోగ్యంగా ఉన్నప్పుడు థైరాయిడ్‌ పాత్ర 
సరియైున సమతుల్యత, పోషణ, శరీరపెరుగుదలకు థైరాయిడ్‌ గ్రంధి అవసరం చాలా ఉంది. హైపోథలామిక్‌ పిట్యూటరీ థైరాయిడ్‌ ఆక్సిస్‌ ద్వారా థైరాయిడ్‌ హార్మోన్స తయారీ, నియంత్రణ ఆధారపడి ఉంటుంది. 
లక్షణాలు 
ఆకలి బాగా ఉంటుంది. అయినా బరువు తగ్గుట, కోపం, చికాకు, నీరసం, అలసట, ఉద్రేకం, నాడివేగం హెచ్చుట, కాళ్లు, చేతులు వణుకుట, ఎక్కువ వేడిని భరింపలేకపోవుట, చెమటలు పట్టుట, నీటి విరేచనాల వంటి లక్షణాలు ఉంటాయి 
థైరాయిడ్‌ గ్రంధి భాగం వాచి, ఇనప్లమేషన ఉన్నప్పుడు దీనినే థైరో టాక్సికోసిస్‌ లేదా గ్రేవిస్‌ డిసీజ్‌ అంటారు. దీనినే ఆటో ఇమ్యూనడిసార్డర్‌ అంటారు. ఇది 30సంవత్సరముల వయస్సు పైబడ్డ వారిలో ప్రత్యేకించి సీ్త్రలలో ఎక్కువగా కనిపిస్తుంది. కనుగుడ్లు బయటికి వచ్చినట్లుండుట. కనులోపలి కండరాలు, కొవ్వు లోపల భాగం వాచి కనుగుడ్లు బయటికి వస్తాయి. ఇది థైరాయిడ్‌ కణతుల రూపంలో ఒకటి లేదా రెండు, మూడు ఉండవచ్చు. నోడ్యులర్‌ గోయిట్రి అనికూడా అంటారు. 
 
హైపోథైరాయిడిజమ్‌ 
టి3, టి4 హార్మోన్స ఉత్పత్తి కొన్ని కారణముల వలన తగ్గిపోతాయి.
లక్షణములు 
నీరసం, బద్ధకం, వేడి ఉష్ణోగ్రతలో కూడా చలిగా ఉండును. వీటితో పాటు వయస్సు నిలకడలేకపోవుట, శరీర బరువు పెరుగుట 
మానసికంగా కుంగిపోవుట(డిప్రెషన), ముఖం వాచినట్లుండుట, జుట్టురాలుట, చర్మం పొడిబారినట్లుండుట, మలబద్ధకం గొంతు బొంగురుపోవుట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
రోగనిర్ధారణ
రక్తపరీక్ష: థైరాయిడ్‌ ఆంటీబాడిస్‌, థైరాయిడ్‌ స్కానింగ్‌, అల్ట్రాసౌండ్‌
 
హోమియోవైద్యం 
హోమియోపతి వైద్యవిధానంలో థైరాయిడ్‌ వచ్చుటకు గల మూలకారణులను విశ్లేషించి, శారీరక, మానసిక లక్షణములను విచారించి సరియైున హోమియోమందుల తత్వ విచారణ ద్వారా చికిత్స చేయవచ్చను. 
 
డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి, ఎం.డి. 
హోమియో, స్టార్‌ హోమియోతి, 
ఫోన్‌- 8977 336677, 
టోల్‌ ఫ్రీ :1800-108-5566 
www.starhomeo.com
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక