హైపో థైరాయిడ్‌కు అమూల్యమైన చికిత్స

11-12-13

 ఎప్పుడైతే థైరాయిడ్‌ గ్రంథి పనిచేయదో ఆ ప్రభావం శరీరంలోని అన్ని రకాల జీవక్రియలపై పడుతుంది. థైరాయిడ్‌ సమస్యల్ని గుర్తించకుంటే స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులు, ఆందోళన, జుట్టు రాలడం, సెక్సువల్‌ డిస్‌ఫంక్షన్‌, సంతానలేమి వంటి సమస్యలు రావచ్చు. అంతేకాదు థైరాయిడ్‌ గ్రంథిలోపాల వలన హైపోథైరాయిడిజమ్‌కు గురవుతారు. అయితే అలాంటి సమస్యలను ఎదుర్కోవటానికి హోమియో వైద్యమే సరైన చికిత్స అంటున్నారు డాక్టర్‌ గోరంట్ల చంద్రశేఖర రావు.
 
 
థైరాయిడ్‌ గ్రంథి: సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్‌ గ్రంథి శరీరంలో మెడ ముందరి భాగంలో ఉంటుంది. ఽథైరాయిడ్‌ గ్రంథికి కుడి, ఎడమ భాగాలుంటాయి. ఈ రెండు భాగాలను ‘ఇస్తమస్‌’ అనే భాగం కలుపుతుంది.
థైరాయిడ్‌ హార్మోన్స్‌: మొదట మెదడులో ఉండే హైపోథెలామస్‌ అనే భాగం టీఆర్‌హెచ్‌(థైరాయిడ్‌ రిలీజింగ్‌ హార్మోన్‌)ను ఉత్పత్తి చేస్తుంది. టీఆర్‌హెచ్‌ మెదడులోనే ఉండే పీయూష గ్రంథి ముందరి భాగాన్ని (ఆంటీరియర్‌ పిట్యూటరి) ప్రేరేపించి టీఎస్‌హెచ్‌(థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌)ను విడుదల చేస్తుంది. ఈ టీఎస్‌హెచ్‌ థైరాయిడ్‌ గ్రంథిని ప్రేరేపించి థైరాయిడ్‌ హార్మోన్స్‌ అయిన టీ3(ట్రై అయిడో థైరోనిన్‌), టీ4(థైరాక్సిన్‌)ను విడుదల చేస్తుంది. ఈ చర్యను హైపోథెలామస్‌ పిట్యూటరీ థైరాయిడ్‌ యాక్సిస్‌గా చెప్పుకోవడం జరుగుతుంది. 
థైరాయిడ్‌గ్రంథి ముఖ్య విధులు
 థైరాయిడ్‌ హార్మోనులు శరీరంలోని వివిధ జీవక్రియల సమతుల్యతలకు ఉపయోగపడతాయి.
 ఈ హార్మోనులు శరీరంలోని కొవ్వును కరిగించడానికి ఉపయోగపడతాయి.
  శరీరంలో ఎముకల పెరుగుదలకు ఈ హార్మోన్స్‌ అవసరం.
 తల్లిగర్భంలో ఉండే శిశువుకి, చిన్నపిల్లల్లో మెదడులోని నాడీ కణాలు అభివృద్ధి చెందడానికి ఈ హార్మోన్స్‌ ముఖ్య పాత్ర పోషిస్తాయి. థైరాయిడ్‌ హార్మోన్స్‌ లోపం వలన పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదల ఉండదు. ఈ సమస్యే ‘క్రెటినిజమ్‌’. 
ఎలా గుర్తించాలి? 
చిన్నపిల్లల్లో...
మానసిక, శారీరక ఎదుగుదల లేకపోవడం, అధిక బరువు ఉండటం, పిల్లల ఎత్తులో లోపాలు ఉండటం, చదువులో వెనకబడిపోవడం, మలబద్దకం ఉండటం.
యుక్త వయసులో...
క్రమేపి బరువు పెరగడం, జుట్టు రాలడం, అతి నీరసం, నిద్ర ఎక్కువగా రావడం, మంచి నిద్ర తర్వాత కూడా నిద్ర మత్తుగా ఉండటం, ఆడపిల్లల్లో రుతుచక్రం ఆరంభం కాకపోవడం, చదువులో వెనకబడిపోవడం, మతిమరుపు. 
మధ్య వయసులో....
నెలసరి లేటుగా రావడం, వచ్చినా ఎక్కువగా అవటం, చాలా రోజులు ఉండటం, బరువు పెరిగిపోవటం, థైరాయిడ్‌ వాపు(గాయిటర్‌), చర్మం, జుట్టు పొడిబారటం, కండరాల నొప్పులు, నెలసరి సమస్యల వల్ల సంతానలేమి, ముఖం, కాళ్లు వాపు రావడం.
పెద్ద వయసులో....
అధిక కొలెస్ట్రాల్‌, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం(ఫ్యాటీ లివర్‌), నాడి తక్కువగా కొట్టుకోవడం, రక్తపోటు అధికం అవడం, గుండె సంబంధ వ్యాధులు, మానసిక ఆలోచన, దేనిమీదా ఆసక్తి లేకపోవడం(డిప్రెషన్‌), సెక్స్‌ సామర్థ్యం తగ్గడం.
 ఏ పరీక్షలు చేయాలి?
క హైపోథైరాయిడ్‌ ఉందో, లేదో తెలుసుకోవడానికి టీ3, టీ4, టీఎస్‌హెచ్‌ పరీక్షలు చేయాలి.
క టీపీఓ యాంటీ బాడీస్‌ లేక, మైక్రోసోమల్‌ యాంటీ బాడీస్‌.
క థైరాయిడ్‌ వాపు ఉంటే ఎఫ్‌ఎన్‌ఏసీ లేక అలా్ట్రసౌండ్‌ పరీక్ష.
క అధిక కొలెస్ట్రాల్‌ కోసం లిపిడ్‌ ప్రొఫైల్‌.
క రక్తహీనత తెలుసుకోవడానికి హెచ్‌బీ పర్సెంటేజ్‌ పరీక్షలు.
హోమియో ట్రెండ్‌ చికిత్స: 
హైపోథైరాయిడ్‌ రావడానికి ముఖ్య కారణం ‘ఆటో ఇమ్యునిటీ’ అంటే...మనను రక్షించవలసిన రక్షణ వ్యవస్థ మన థైరాయిడ్‌ మీద దాడిచేసి హైపోథైరాయిడ్‌ను కలుగజేస్తుంది. మానసిక ఒత్తిడి, బాధ, ఆందోళన, జీవితంలో జరిగే అనుకోని సంఘటనలు ఇవన్నీ ఆటో ఇమ్యునిటీ రావడానికి కారణం. కొన్నిసార్లు వంశపారంపర్యంగా కూడా హైపోథైరాయిడ్‌ వస్తుంది. ప్రతి మనిషికి హైపోథైరాయిడ్‌ రావడానికి వివిధ రకాలైన కారణాలు ఉంటాయి. వాటి లక్షణాల సముదాయం కూడా కొద్దిగా వేరుగా ఉండవచ్చు. కనుక ప్రతి మనిషికి వారి మానసిక, శారీరక, వ్యాధి లక్షణాలను బట్టి మందు ఎంపిక జరగాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. హోమియో ట్రెండ్స్‌లో అధునాతన ‘తత్వచికిత్స’ ద్వారా ‘అసలైన జర్మనీ మందుల’ ద్వారా సంపూర్ణ థైరాయిడ్‌ చికిత్స చేయడం జరుగుతుంది. మందుల వలన ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా థైరాయిడ్‌ లక్షణాలు తగ్గడం జరుగుతుంది. హైపోథైరాయిడ్‌ వల్లవచ్చే సంతానలేమి, అధిక కొలెస్ట్రాల్‌, మలబద్దకం, బొల్లి, సొరియాసిస్‌, డిప్రెషన్‌ కూడా ఈ చికిత్స ద్వారా పరిష్కారమవుతాయి.
 
డాక్టర్‌ గోరంట్ల చంద్రశేఖర రావు
ఎండీ, హోమియో
డైరెక్టర్‌ హోమియో ట్రెండ్స్‌
హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, విజయవాడ
77 3000 3000, 77 3000 4000