థైరాయిడ్‌ సమస్యలకు హోమియోతో చెక్‌

24-01-12

శరీరంలో కణాల విభజనకు, గర్భిణులలో శిశువు ఎదుగుదలకు, ఎదిగిన పిల్లలు, పెద్దలలో శరీర నిర్మాణానికి కీలకంగా పనిచేసే ఽథైరాయిడ్‌ సమస్యల నుంచి విముక్తి పొందేందుకు హోమియో వైద్యం సత్ఫలితాలు ఇస్తుందంటున్నారు జెనెటిక్‌ హోమియో వైద్య నిపుణులు డాక్టర్‌ కె. రాజశేఖర్‌రెడ్డి.
శరీరంలో ప్రధాన హార్మోన్‌లైన థైరాక్సిన్‌, ట్రియోడోథైరానిన్‌ను విడదీయడంలో ముఖ్యపాత్ర పోషించే థైరాయిడ్‌ గ్రంధి మానవ శరీర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్‌ గ్రంధికి చెందిన ఆటో ఇమ్యూన్‌ అసమతుల్యత కారణంగా థైరాయిడ్‌ హార్మోన్ల అధికోత్పత్తి(హైపర్‌థైరాయిడిజమ్‌) లేక హార్మోన్‌ లోపాలకు, గ్రంధుల విధ్వంసం(హైపోథైరాయిడిజమ్‌) ఏర్పడుతుంది. వీటితో పాటు తదనంతర కాలంలో థైరాయిడ్‌ క్యాన్సర్‌కు ఇది దారితీయవచ్చు.
హైపోథైరాయిడిజమ్‌
థైరాయిడ్‌ గ్రంధి తగినంత హార్మోన్‌ను ఉత్పత్తి చేయకపోతే ఏర్పడేదే హైపోథైరాయిడిజమ్‌. పురుషులలో పోలిస్తే స్ర్తీలలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. హైపోథైరాయిడిజమ్‌ను రెండు విభాగాలుగా చూడాల్సి ఉంటుంది. థైరాయిడ్‌ గ్రంధిలోనే సమస్య ఉండడాన్ని ప్రాథమిక దశగా చూస్తారు. సాధారణ స్థాయి కన్నా తక్కువ థైరాయిడ్‌ హార్మోన్లు ఈ దశలో ఉత్పత్తి అవుతాయి. థైరాయిడ్‌లో కాకుండా హైపోథలామస్‌లో లేదా పిట్యూటరీలో సమస్య ఏర్పడితే దాన్ని రెండవరకం హైపోథైరాయిడిజమ్‌గా వ్యవహరిస్తారు.
కారణాలు
ఒత్తిడి: శరీరం ఒత్తిడికి గురైనపుడు కార్టిసాల్‌ అనే రసాయనిక పదార్థం వెలువడుతుంది. అడ్రినల్‌ గ్రంధుల ఉత్పత్తి చేసే రెండు ప్రధాన హార్మోన్లలో కార్టిసాల్‌ ఒకటి. దీర్ఘకాలిక ఒత్తిడిని తట్టుకోవడంలో కార్టిసాల్‌ తోడ్పడుతుంది. అయితే తరచు ఒత్తిడికి లోనవుతుంటే అనేక దుష్ఫలితాలు ఎదురవుతాయి. మెదడులో ఉండే హైపోథలామస్‌, పినియల్‌, పిట్యూటరీ గ్రంఽధులు, మెడ భాగంలో ఉండే థైరాయిడ్‌, పారాథైరాయిడ్‌ గ్రంధులు, కిడ్నీలపైభాగంలో ఉండే అడ్రినల్‌ గ్రంధులు, స్ర్తీలలో అండాశయంలో, పురుషులలో బీజాలలో ఉండే పునరుత్పత్తి గ్రంధులు మొత్తాన్ని కలిసి ఎండోక్రిన్‌ వ్యవస్థగా వ్యవహరిస్తారు. శరీరంలోని ఒక భాగంలో ఎక్కడైనా ఇది దెబ్బతింటే ఇతర భాగాలలో కూడా ఇవి దెబ్బతినడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా హైపర్‌థైరాయిడిజమ్‌, హైపోథైరాయిడిజమ్‌ వంటివి ఏర్పడతాయి. దీని పర్యవసానంగా ఆటో ఇమ్యూన్‌ లోపాలు, అయోడిన్‌ లోపం వంటివి ఏర్పడతాయి.
లక్షణాలు
హైపోథైరాయిడ్‌ ఉన్నవారికి సాధారణంగా నీరసం, బద్ధకం, బరువు కోల్పోవడం, ఆకలి మందగించడం, గొంతు జీరపోవడం, జలుబు, అసహనం, మలబద్ధకం, రుతుస్రావ సమయంలో అధికంగా రక్తం పోవడం, గుండె, నాడి వేగం తగ్గడం, కొన్నిసార్లు అధిక రక్త ప్రసరణ జరగడం వంటివి కనిపిస్తాయి. ముఖంలో కళ తగ్గడం, మాట వేగంగా రాకపోవడం, అన్ని విషయాలపై ఆసక్తి తగ్గిపోవడం, చర్మం పొడిగా మారి, గోళ్లు పలచగా మారి చిట్లిపోవడం, కేశాలు పలచబడి పోయి పొడిగా మారడం, కండరాలు బిగుసుకుపోవడం, కీళ్లలో నొప్పులు రావడం, మెడలో వాపు కనపడడం, మనసు స్థిమితంగా ఉండకపోవడం, మతిమరుపు, ఆలోచనా శక్తి తగ్గిపోయి, మాట నెమ్మదిగా రావడం వంటివి దీని లక్షణాలు చెప్పవచ్చు.
హైపర్‌థైరాయిడిజమ్‌ లక్షణాలు
జీర్ణవ్యవస్థ అసహజంగా పనిచేయడం వల్ల ఆకలి ఎక్కువై అధిక ఆహారం తీసుకున్నప్పటికీ బరువు తగ్గిపోవడం, తరచు ఆందోళన చెందుతుండడం, చిరాకు, నిద్రలేమి, దేనిపైన ఏకాగ్రత ఉండకపోవడం, వొళ్లు వెచ్చగా ఉండడం, చెమట ఎక్కువగా పట్టడం, వొంట్లో మంటలు వచ్చినట్లు ఉండడం, తరచు విరేచనం కావడం వంటివి దీని లక్షణాలు.
హోమియో చికిత్స
సాధారణంగా థైౖరాయిడ్‌ వ్యాధితో బాధపడేవారు హోమియో వైద్యులను మూడు వేర్వేరు పరిస్థితులలోనే సంప్రదించడం జరుగుతుంది.
 హైపోథైరాయిడ్‌ వ్యాధి రావడానికి నిర్ధారణ జరగడానికి ముందు అకారణంగా బరువు పెరగడంతోపాటు ఇతర లక్షణాలు కనిపించగానే ముందుగా రక్తపరీక్షలు చేసుకోవడం జరుగుతుంది. అయితే రక్తపరీక్షలలో ఏదీ కనపడకపోవడంతో హోమియో వైద్యుని సంప్రదించడం జరుగుతుంది.

హైపోథైరాయిడ్‌ నిర్ధారణ జరిగిన తర్వాత అల్లోపతి మందులు వాడడానికి ముందు హోమియో వైద్యుని కొందరు సంప్రదిస్తారు. కొందరేమో అల్లోపతి మందులు వాడుతూనే హోమియోపతి వైద్యుని కూడా సంప్రదిస్తారు. అయితే ఈ మూడు సందర్భాలలోను థైరాయిడ్‌ సమస్యలకు అత్యున్నత వైద్యాన్ని అందచేసే హోమియో వైద్య విధానం మాత్రం జెనెటిక్‌ హోమియో చికిత్స మాత్రమేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ వైద్య విధానంలో వ్యాధి లక్షణాలనే కాక రోగి పూర్వ ఆరోగ్య పరిస్థితిని, మానసిక పరిస్థితిని సంపూర్ణంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. కాల్క్‌ అయోడ్‌, న్యాట్రమ్‌ మూర్‌, సెపియా, థైరాడినమ్‌, న్యాట్‌ సల్ఫ్‌, ఫాస్‌, మెర్క్‌ సాల్‌ వంటి హోమియో మందులు థైరాయిడ్‌ సమస్యలకు బాగా పనిచేస్తాయి. అయితే వైద్యుని పర్యవేక్షణలోనే మాత్రం వీటిని వాడాల్సి ఉంటుంది.

డాక్టర్‌ కె.రాజశేఖర్‌ రెడ్డి
జెనెటిక్‌ హోమియోపతి
ఐసిఐసిఐ బ్యాంకు ఎదురుగా
చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌
హైదరాబాద్‌-60
ఫోన్‌: 8125 108 108, 9132 180 108