థైరాయిడ్‌ సమతుల్యతతో సంతానలేమి దూరం

17-05-13

శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్‌ ఒకటి. శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషించే ఈ గ్రంథి పనితీరు గతి తప్పడం వల్ల హైపో థైరాయిడ్‌, హైపర్‌ థైరాయిడ్‌ సమస్యలతో సంతానలేమికి దారితీస్తుంది. ఈ సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే హోమియో చికిత్సతో సంతానసాఫల్యాన్ని పొందవచ్చంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్‌ శ్రీకర్‌ మను.
 
 
ఆధునిక జీవనశైలి వల్ల శారీరక, మానసిక ఒత్తిళ్లను తట్టుకునే సామర్ధ్యంతోపాటు రోగనిరోధక శక్తి తగ్గుతోంది. మెడవ ద్ద కంఠముడి కింద ఉండే థైరాయిడ్‌ గ్రంధి జీవక్రియల సమతుల్యాన్ని కాపాడుతుంది. మనం తీసుకునే ఆహారం సరైన రీతిలో వంటబట్టడానికి, ప్రోటీన్‌ జీవక్రియలను కాపాడేందుకు, శరీర సమతుల్యాన్ని నియంత్రించే ఈ గ్రంధి టీ3, టీ4 హార్మోన్‌లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్‌ గ్రంధి శరీర అవసరానికంటే ఎక్కువగా టీ 3, టీ 4 ఉత్పత్తి చేస్తే హైపర్‌ థైరాయిడ్‌ సమస్యగా చెప్పవచ్చు. శరీర అవసరానికంటే తక్కువ శాతంతో పనిచేయడం వల్ల హైపో థైరాయిడ్‌ సమస్యగా చెపుతారు. థైరాయిడ్‌ గ్రంధి అతలాకుతలం అవడం వల్ల సంతాన సాఫల్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. హార్మోన్ల నియంత్రణతో సరిపెట్టడం తాత్కాలిక ఉపశమనమే. 
స్ర్తీలలో థైరాయిడ్‌ సమస్యలు
హైపర్‌ థైరాయిడిజం వల్ల తల్లితోపాటు పుట్టబోయే బిడ్డలకూ ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది. నెలసరి సమస్యలు, అండం విడుదల కాకపోవడం, గర్భస్రావం, సంతానం ఎదుగుదలలో లోపాలు, ఆరోగ్యసమస్యలు తలెత్తవచ్చు. ఎక్కువగా చెమట పట్టడం, గుండెదడ, విపరీతమైన ఉష్ణం, ఆందోళన, కోపం, చిరాకు, వాంతులు, వికారం, విరోచనాలతో పాటు బరువు తగ్గడం, నిమిషానికి వందసార్లకు పైగా గుండె కొట్టుకోవడం హైపర్‌ థైరాయిడ్‌ లక్షణాలు. ఈ లక్షణాలున్నపుడు పరీక్షలు చేయించుకొని, చికిత్స చేయించుకోవటం మేలు. 
హైపో థైరాయిడ్‌ సమస్య
బరువు పెరగటం, తీవ్ర నీరసం, నిస్సత్తువ, వాపు సాధారణ లక్షణాలు. థైరాయిడ్‌ సమస్య వల్ల ఆరోగ్యసమస్యలతోపాటు సంతానలేమికి కూడా కారణమవుతుంది. స్త్రీలకు హార్మోనల్‌ సమస్యలు, ఒబేసిటీ, డయాబెటిస్‌, ఆర్థరైటిస్‌ సమస్యలు వస్తుంటాయి. స్త్రీలలో థైరాయిడ్‌ అసమతుల్యత వల్ల అండాశయం విడుదల, ఎదుగుదల లోపాలతోపాటు పీసీఓడి, అండాశయంలో కణుతులు, బుడగలు ఏర్పడటం వల్ల సంతాన సాఫల్యంపై ప్రభావం చూపిస్తోంది. స్త్రీలలో ప్రొలాకి ్సన్‌ హార్మోన్‌ అసమతుల్యత వల్ల నెలసరి తగ్గటం, ఆగిపోవటం జరగవచ్చు. దీనివల్ల సంతానలేమికి దారితీస్తుంది. 
పురుషుల్లో థైరాయిడ్‌ సమస్యలు
థైరాయిడ్‌ అసమతుల్యత వల్ల వీర్యం సహజత్వం కోల్పోవటం, సెక్స్‌ సమస్యలు తలెత్తుతుంటాయి. దీనివల్ల తలెత్తే దుష్పరిణామాలు సంతాన సాఫల్యతపై ప్రభావం చూపిస్తాయి. వీర్యకణాల అభివృద్ధి ప్రక్రియలో థైరాయిడ్‌ హార్మోన్‌ పాత్ర ఉంటుంది. అందుకే థైరాయిడ్‌ అసమతుల్యతను నిర్లక్ష ్యం చేయడం ప్రమాదకరం. 
కారణాలు
థైరాయిడ్‌ అసమతుల్యత వల్ల సంతానలేమి సమస్య ఉత్పన్నమవుతుంది. గర్భాశయం, ఫాలోపియన్‌ ట్యూబ్స్‌, అండాశయం, సర్వెక్స్‌లు సంతానోత్పత్తిలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇందులో ఏ అవయవానికి ఇన్ఫెక్షన్‌ సోకినా సంతాన లేమికి దారితీస్తుంది. 
ప్రేరేపక అంశాలు
జీవనశైలిలో మార్పులు వాతావరణ మార్పులు, ఆహారం పోషకాల అసమతుల్యత, ఒబేసిటీ, పొగ తాగటం, మద్యపానం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. స్త్రీలలో ఫైబ్రాయిడ్స్‌, పీసీఓడీ, నెలసరి సమస్యలు, డయాబెటిస్‌, టీబీ లాంటి ఆరోగ్య సమస్యలకు సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల థైరాయిడ్‌ అసమతుల్యత వల్ల సంతానలేమిపై ప్రభావం చూపిస్తుంది.
దుష్ప్రభావాలు 
థైరాయిడ్‌ అసమతుల్యత వల్ల సంతానలేమితోపాటు ఒబేసిటీ, ఆర్థరైటిస్‌, హార్మోనల్‌ సమస్యలు, డయాబెటిస్‌ వంటివి తలెత్తవచ్చు. సరైన చికిత్స లేకపోవడం వల్ల, లక్షణాలు తాత్కాలికంగా తగ్గినా, పునరావృతాలతో పాటు వివిధ రకాల దుష్పరిణామాలకు దారితీయవచ్చు. సంతానపై ప్రభావం వల్ల మానసిక, శారీరక లోపాలు తలెత్తవచ్చు. పిల్లల్లో కూడా థైరాయిడ్‌ సమస్యలు ఆరంభం కావచ్చు. 
పరీక్షలు
రోగ లక్షణాలతోపాటు టీఎస్‌హెచ్‌, టీ 3, టీ 4, యాంటీ థైరాయిడ్‌ బాడీస్‌, ఈఎస్‌హెచ్‌, ప్రొలాక్టిన్‌ హార్మోన్ల పరీక్షలు, సీబీపీ, ఈఎస్సార్‌, అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌, వీర్యకణాల పరీక్షలు, ఎంఆర్‌ఐ, బయాప్సీ పరీక్షలు చేయించి వ్యాధిని నిర్ధారించవచ్చు. 
హోమియో వైద్యం
ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులు లేకుండా మూలం నుంచి అనారోగ్యాన్ని పారదోలే వైద్యంగా హోమియోకు గుర్తింపు లభించింది. హోమియో చికిత్సతోత థైరాయిడ్‌ అసమతుల్యతతో కలిగే సంతానలేమికి పరిష్కారం లభిస్తుంది. మానవుని జన్యునిర్మాణంపై ప్రభావంతో థైరాయిడ్‌ అస మతుల్యతను నిర్మూలించి జీవక్రియల ప్రాముఖ్యాన్ని బట్టి సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చడం హోమియో వైద్యంతోనే సాధ్యం. వాడుతున్న మందులను ఒకేసారి ఆపకుండా, ఒక క్రమపద్ధతిలో తగ్గించుకుంటూ పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధింపచేయడమే కాకుండా దుష్పలితాలు, పునరావృతాలను నియత్రించవచ్చు. 
 
డా. శ్రీకర్‌ మను
ఫౌండర్‌ ఆఫ్‌ డా. మనూస్‌ హోమియోపతి,
ఫోన్‌ : 9032 108 108
    9030 339 999