హైపోథైరాయిడిజంకు అసలైన విరుగుడు

06-09-13

 
థైరాయిడ్‌ గ్రంథి పనిచేయనట్టయితే ఆ ప్రభావం అన్ని రకాల జీవక్రియలపైనా పడుతుంది. ముఖ్యంగా బరువు, మానసిక ఆందోళన, శక్తి స్థాయిలపై ప్రభావం చూపిస్తుంది. స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులు, ఆందోళన, ఆత్రుత, వెంట్రుకలు ఊడటం, సెక్సువల్‌ డిస్‌ఫంక్షన్‌, సంతానలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా థైరాయిడ్‌ సమస్య వల్ల  హైపోథైరాయిడిజమ్‌కు గురవుతారు. అయితే అలాంటి సమస్యలను ఎదుర్కోవటానికి హోమియో వైద్యమే సరైన చికిత్స అంటున్నారు డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లవార్‌.
 
 
దేశవ్యాప్తంగా థైరాయిడిజమ్‌ను ఎదుర్కొంటున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. చాలామందికి థైరాయిడ్‌ గ్రంథి విధి విధానాలకు తెలియవు. నిజానికి అది శరీరంలోని అన్ని జీవక్రియలకూ అవసరమైన ముఖ్యమైన గ్రంథి. మనకు శక్తినివ్వడంలో థైరాయిడ్‌దే ప్రధాన పాత్ర. సీతాకోకచిలుక ఆకారంలో మెడ ముందు భాగంలో ఉంటుందది. పిట్యూటరీ గ్రంథి ఆధీనంలో ఉంటుంది. టి3, టి4 హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్స్‌ శరీరంలోని బేసల్‌ మెటబాలిక్‌ రేట్‌(బీఎమ్‌ఆర్‌)ను నియంత్రిస్తాయి. మనం తీసుకునే ఆహారాన్ని శక్తిరూపంలోకి మారుస్తాయి. ఈ హార్మోన్స్‌ ఉత్పత్తి ఎక్కువైతే బీఎమ్‌ఆర్‌ పెరుగుతుంది. ఉత్పత్తి తక్కువైతే బీఎమ్‌ఆర్‌ తగ్గుతుంది. థైరాయిడ్‌ గ్రంథి లోపాలు మన శారీరక, మానసిక వ్యవస్థల మీద పనిచేస్తాయి. థైరాయిడ్‌ గ్రంథి ముఖ్యంగా మూడు హార్మోన్లను విడుదల చేస్తుంది. అవి ట్రైఐడో థైరోనిన్‌, థైరాక్సిన్‌, కాల్సిటోనిక్‌. ఈ హార్మోన్ల వల్ల మెటబాలిక్‌ ప్రాసెస్‌ త్వరితగతిన సాగుతుంది. ఇవి బరువు, ఎత్తు, ఎదుగుదల, మానసిక ఆందోళన, శరీర ఉష్ణోగ్రతలను, రక్తపోటును నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రతి వ్యవస్థపై ఈ హార్మోన్‌ ప్రభావం ఉంటుంది. థైరాయిడ్‌ గ్రంథిలో ముఖ్యంగా రెండు తేడాలు చోటు చేసుకుంటాయి. ఒకటి హైపర్‌ థైరాయిడిజమ్‌, రెండోది హైపో థైరాయిడిజమ్‌. ప్రస్తుతం హైపో థైరాయిజిమ్‌ గురించి చర్చించుకుందాం. హైపోథైరాయిడిజమ్‌: టి3, టి4 తగ్గడం వల్ల హైపోథైరాయిడిజమ్‌ వస్తుంది. అంటే టి3, టి4 హార్మోన్ల ఉత్పత్తి కొన్ని కారణాల వల్ల తగ్గిపోతాయి. తద్వారా వచ్చేదే హైపోథైరాయిడిజమ్‌.
కారణాలు
 గాయిటోజెనిక్‌ పదార్థాలు తినడం, సర్జరీ చేసి థైరాయిడ్‌ గ్రంథి భాగం తీయడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఉంది. చర్మ సంబంధ వ్యాధులకు కార్టికోస్టెరాయిడ్స్‌ మందుల్ని దీర్ఘకాలం పాటు వాడినప్పుడు కూడా హైపోథైరాయిడిజమ్‌ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు అంటే రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, డయాబెటిస్‌, పీసీఓడి వంటి సమస్యలున్న వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. 
లక్షణాలు
 ఆకలి మందగించడం, బరువు పెరగడం, త్వరగా అలసిపోవడం, చలికి తట్టుకోలేకపోవడం, జుట్టు రాలడం, చర్మం పొడిబారడం, రుతుసమస్యలు ప్రారంభం కావడం, నెలసరి సరిగ్గా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తిమ్మిర్లు రావడం, కీళ్లనొప్పులు, లో బీపీ, సంతానలేమి, మలబద్ధకం, డిప్రెషన్‌, ఆందోళన, నిద్రలేమి, రక్తహీనత వంటి లక్షణాలు కూడా ఉంటాయి. గొంతు బొంగురుపోవడం, థైరాయిడ్‌ గ్రంథి బయటకు కనిపించే విధంగా పెద్దగా అవడం- ఇవన్నీ థైరాయిడ్‌ వ్యాధి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. వెంట్రుకలు ఊడిపోవడం అనేది థైరాయిడ్‌ సమస్యలో కనిపించే ప్రధాన లక్షణం. హైపోథైరాయిడిజమ్‌ కలిగిన వారిలో వెంట్రుకలు ముతకగా, మందంగా, ఎండినట్లుగా అవుతాయి. చర్మం కూడా మందంగా, ఎండిపోయినట్లుగా అవుతుంది. 
నిర్ధారణ
 రక్తపరీక్షలు చేయడం ద్వారా టి3, టి4, టీఎస్‌హెచ్‌ లెవెల్స్‌ తెలుసుకోవచ్చు. ఇందుకోసం థైరాయిడ్‌ ప్రొఫైల్‌ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. ఎక్స్‌రే నెక్‌, అల్ర్టాసౌండ్‌ వంటి పరీక్షలు చేయడం ద్వారా రోగనిర్ధారణ చేసుకోవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గాయిటోజెనిక్‌ పదార్థాలను తీసుకోకూడదు. క్యాబేజీ, కాలీఫ్లవర్‌, సోయా ఉత్పత్తులు, పాలకూర, చేపలు వంటి వాటిని తినకూడదు. 
చికిత్స
 హోమియోపతి చికిత్స ద్వారా థైరాయిడ్‌ సమస్యలను సరిచేసే వీలుంది. కాన్‌స్టిట్యూషనల్‌ విధానంలో థైరాయిడ్‌ గ్రంథిని ప్రేరేపించడం ద్వారా హార్మోన్స్‌ను రెగ్యులేట్‌ చేయడం జరుగుతుంది. ఒకసారి టి3, టి4, టీఎస్‌హెచ్‌ నార్మల్‌ రేంజ్‌కు వచ్చిన తరువాత చాలా ఏళ్ల వరకు థైరాయిడ్‌ నార్మల్‌గా పనిచేస్తుంది. లక్షణాలన్నీ తగ్గిపోతాయి. లక్షణాలు కనిపించిన వెంటనే హోమియో వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటే సులభంగా నయమయ్యే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లవార్‌ (సీఎండీ)
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ ప్ర్తె.లి.
బ్రాంచీలు: హైదరాబాద్‌, విజయవాడ, వైజాగ్‌, రాజమండ్రి, గుంటూరు, హన్మకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు
ఫోన్‌ : 9550001199
 

 

Actually antidote haipothairayidijanku