నరాల సమస్యలకు నమ్మకమైన వైద్యం!

పోషకాహార లోపం వల్లగానీ, దీర్ఘకాలంగా ఉంటున్న అనేక వ్యాధుల వల్లగానీ న రాలు శక్తిహీనమవుతాయి. ఆ క్రమంలో మరికొన్ని ఇతర సమస్యలు కూడా మొదలవుతాయి. ఆల్కహల్‌, పొగ, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వల్ల కూడా ఆయా సమస్యలు తలెత్తుతాయి. ఆయా సమస్యలను బట్టి హోమియో మందులు వేసుకుంటే శక్తివంతంగా పనిచేస్తాయి.

నరాల బలహీనత వల్ల ఏర్పడుతున్న నిద్ర లేమి, నీరసం, గుండెదడ, వంటి లక్షణాలు ఉన్నవారు అవీనా సతైవా- క్యూ మందులు వేసుకుంటే, మంచి ఫలితం ఉంటుంది.
నీరసంతో ఏ పనీ చేయలేకపోవడం, ఇంద్రియ నష్టం జరగడం, ఆత్మీయులు దూరం కావడం వల్ల కలిగే వ్యధతో నీరసించడం వంటి సమస్యలు ఉంటే, యాసిడ్‌ ఫాస్‌-30 మందు బాగా పనిచేస్తుంది.
తలనొప్పి, అలసట, ఆకలి మందగించడం, మగత ఉంటే విక్రిక్‌ యాసిడ్‌ - 30 వేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
ఆడవాళ్లల్లో తరచూ వచ్చే నడుము నొప్పి, నిస్సత్తువ, ఏ చిన్నపని చేసినా అలసట ఉంటే ల్యాంకేసిస్‌- 30 మందు వేసుకోవడం ఎంతో బెటర్‌.
మానసిక, శారీరక నీరసానికి,, నిస్సత్తువకూ కాలీఫాస్‌ - 30 వేసుకోవడం మిక్కిలి ప్రయోజనకరం.