స్వైన్‌ ఫ్లూని తరిమేద్దాం

ఆంధ్రజ్యోతి(20-02-2017):   హెచ్‌1ఎన్‌1 అనే వైరస్‌ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. పందుల ద్వారా సంక్రమించిన ఈ వైరస్‌ ప్రస్తుతం మనుషుల నుంచి మనుషులకు వేగంగా విస్తరిస్తోంది.  జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు వంటి సాధారణ ఫ్లూ లక్షణాలుంటాయి. 

 ఐదేళ్లలోపు చిన్న పిల్లలు, 65ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు స్వైన్‌ ఫ్లూ బారినపడితే రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. 
 స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించినపుడు డాక్టర్‌ని సంప్రదించి చికిత్స తీసుకోవడం, ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడం చేయాలి. 
 ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా స్వైన్‌ ఫ్లూ రాకుండా కాపాడుకోవచ్చు. 
ఇలా చేయండి 
 
దగ్గినపుడు, తుమ్మినపుడు కర్చిఫ్‌ను  అడ్డంగా పెట్టుకోండి. 
 
తరచుగా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోండి. 
 
ఫ్లూ లక్షణాలుంటే ఇతరులకు దూరంగా ఉండండి. 
 
కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం, కరచాలనం వంటివి చేయకూడదు. 
 
వాడిన టిష్యూ పేపర్లను వెంటనే డస్ట్‌బిన్‌లో పడేయండి. 
 
జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పులుంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. 
 
ఫ్లూ లక్షణాలు కనిపించినపుడు జన సమ్మర్దం ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి. 
 
చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్లు, ముక్కు తుడుచుకోవడం చేయకండి.