స్వైన్‌ఫ్లూకు ఉచితంగా హోమియో మందు

 ఆంధ్రజ్యోతి(03-02-2017):

అన్ని ఆయుష్‌ కేంద్రాల్లో సరఫరా: ప్రభుత్వం 

హైదరాబాద్‌, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): స్వైన్‌ఫ్లూను నియంత్రించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆయుష్‌ కేంద్రాల్లో ఉచితంగా హోమియో మందు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్‌ కేంద్రాల్లో హోమియో మందులను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించింది. ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరింది. వ్యాధి నిర్ధారణ కాకున్నా.. జలుబు, తుమ్ముల వంటి లక్షణాలు కలిగిన వారంతా ఈ హోమియో మందులు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 171మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్లుగా ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.