స్వైన్ ఫ్లూ
11-09-2017: ఇది స్వైన్ ఫ్లూ సీజన్. ఈ వైరస్ బారిన పడకుండా ముఖానికి మాస్క్‌లు ధరించినవారు చాలామందే కనిపిస్తుంటారు. అయితే స్వైన్ ఫ్లూ పేరు వినగానే బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదంలో, హోమియోపతిలో ఈ వైరస్‌కు తగిన మందులున్నాయంటున్నారు వైద్యులు.
దుల్లో ఫ్లూ జ్వరాన్ని తెచ్చి పెట్టే వైరస్ కావడం వల్ల, పందుల నుంచి మనుషులకు వ్యాపించడం వల్ల ఈ వైర్‌సను స్వైన్- ఫ్లూ వైరస్ అంటున్నారు. అయితే ఆ తర్వాత పరిణామంగా మనుషుల నుంచి మనుషులకు పాకడాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. రుతువు మారినప్పుడల్లా ఈ వైరస్ తలెత్తుతుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే విజృంభిస్తుంది.
స్వైన్ ప్లూ లక్షణాలు 3 దశల్లో....
మొదటి దశలో...
తీవ్రస్థాయిలో జలుబు, విపరీతంగా తుమ్ములు, ముక్కువెంట విపరీతంగా నీరు కారడం, తలనొప్పి, ఒంటి నొప్పులు, స్వల్పంగా జ్వరం ఉంటాయి.
రెండవ దశలో..
కొంచెం కొంచెంగా జ్వరం పెరుగుతూ ఉండడం, ఒంటి నొప్పులు తీవ్రం కావడం, దగ్గు పెరిగిపోవడం, స్వల్పంగా ఆయాసం ఉంటాయి.
మూడవ దశలో...
జలుబు తీవ్రమై, ఆయాసంతో గుక్క తిప్పుకోలేకపోవడం.
చాతీలో స్వల్పంతా నొప్పి, తీవ్రత పెరిగాక అపస్మారక స్థితిలోకి వెళ్లడం
ఈ లక్షణాలు ప్రధాన కనిపిస్తాయి.
స్వైన్- ప్లూ వైర్‌సతో వచ్చే ప్రధానమైన చిక్కు ఏమిటంటే, మ్యూటేషన్ కారణంగా దాని అంతర వ్యవస్థ ఏటేటా మారిపోతూ ఉంటుంది. అందుకే గత సంవత్సరం రూపొందించిన టీకాలు ఈ సంవత్సరం పనిచేయవు. అందుకే మళ్లీ కొత్త టీకాలు తయారు చేయడం అనివార్యమవుతుంది. మిగతా వైర్‌సల మాట ఎలా ఉన్నా, స్వైన్ ఫ్లూ వైరస్ (హెచ్- 1, ఎన్-1)లో మాత్రం చాలా వేగంగా మ్యూటేషన్ జరుగుతుంది. అయితే హోమియోలో వైర్‌సలో ఎప్పటికప్పుడు జరిగే మ్యూటేషన్‌తో సంబంధం లేకుండా శరీర వ్యవస్థనంతా ఆవ రించిన వ్యాధి నిరోధక శక్తిని పెంచే మందులు హోమియోపతిలో ఇవ్వబడతాయి. దీనివల్ల ఎటువంటి వైర్‌సనైనా ఎదుర్కొనే శక్తి శరీరంలో పెరుగుతుంది.
రక్షణ శక్తి తగ్గకుండా....
వైద్య చికిత్సలతో పాటు పోషక పదార్థాలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే శరీర వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయి అందుకకే ఆ లోపాలు లేకుండా చూసుకోవాలి.
నిద్ర తక్కువైనా, శారీరక, మానసిక ఒత్తిళ్లల ఎక్కువైనా వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది.
తరుచూ యాంటీబయాటిక్స్ వేసుకునే వారిలో జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా దెబ్బ తింటుంది. దీనివల్ల జీర్ణవ్యవస క్షీ ణించి శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. ఇది కూడా వ్ధాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వైరస్ బారిన పడే పరిస్థితి పెరిగిపోతుంది.
అందుకే సైన్- ప్లూ వంటి వ్మాధుల బారిన పడకుండా ఉండడానికి పోషక పదార్థాల లోపాలు లేకుండా చూసుకోవడం ప్రధమ జాగ్రత్త అవుతుంది.
హోమియోలో...
మహమ్మారి వ్యాధులను నివారించడానికి హోమియోపతి అనుసరించే విధానాన్ని జీన్సఎపిడె మికస్ అంటారు. ఏదైనా ఒక వ్యాధి బారిన పడిన ఓ పదిమందిని తీసుకుని వారందరిలోనూ కనిపించే కొన్ని సాధారణ లక్షణాల ఆధారంగా దాన్ని రాకుండా నివారించే మందును నిర్ణయించడం ఈ విధాన లక్ష్యం. అయితే ఒక సారి నిర్ణయించిన మందు ఆ వ్యాధి ప్రతి ఏటా పనికి రాకుండా పోవచ్చు. కానీ, ఆ సారికి మాత్రం సమర్ధవంతంగా పనిచేస్తుంది. కాలానుగుణంగా ఆ వైర స్లో వచ్చే మార్పులు, వాతావరణ పరిస్థితులు, కొత్త సంయోగాల (రీ-కాంబినేషన్స్) వంటి అనేక కారణాల వల్ల దాదాపు ప్రతిసారీ మందులు మార్చవలసి రావచ్చు.
నివారణగా.....
ఒకసారి ఏదైనా తీవ్రవ్యాధికి గురైనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి యాంటీబాడీస్ వృద్ధిచెంది. మళ్లీ అదే వ్యాధికి గురయ్యే అవకాశం దాదాపు ఉండదు. కానీ, రెండవ సారి ఆ వ్యాధి రాకపోయినా మొదటి సారి వచ్చిన తాలూకు ప్రభావాలు చాలా కాలం వేధిస్తూనే ఉంటాయి. అందుకే ఆ మొదటిసారి కూడా వ్యాధి శరీరంలోకి వ్యాధి చొరబడకుండా చూడటం చాలా ముఖ్యం. అలా వ్యాధి రాకుండా నిరోధించడలో ఇన్ఫ్లూఎంజిన్ -200 బాగా పనిచేస్తుంది. ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు వేసి ఆగిపోవాలి. 5 రోజుల తర్వాత ఆర్సెనిక్ ఆల్బ్ -200 మందును ఒక రోజు మూడు సార్లల వవేఏసిఇ ఆపేయాలి. ఒకవేళ వ్యాధి మహమ్మారిగా మారినప్పుడు వారం తర్వాత మరో డోసు వేస్తే సరిపోతుంది.
వైద్య చికిత్సగా....
రోగిలో కనిపించే లక్షణాల ఆధారంగానే వైద్య చికిత్సలు ఉంటాయి. అందులో భాగంగా ఆర్సెనిక్ ఆల్బ్, జెల్సీనియం మందులు ఇస్తూ యుపటోరియం మందు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మందును వ్యాధి తీవ్రతను బట్టి పొటెన్సీని 30 నుంచి 200 దాకకా పెంచవలసి ఉంటుంది. చివరగా, ట్యూబర్క్లీనమ్ ఒక డోసు ఇస్తే, శరీరంలో వ్యాఽధినిరోధక శక్తి పెరుగుతుంది. కాకపోతే ఈ మందులను హోమియో వైద్యుని పర్యవేక్షణలో తీసుకోవడమే శ్రేయస్కరం.
ఎవరికి ముప్పు?
స్వైన్‌ఫ్లూ ఎవరికైనా రావచ్చు.. అయితే, పిల్లలు, వృద్ధులు, మహిళు ఈ వైరస్ బారిన పడ అవకాశాలు ఎక్కువ. స్త్రీలలో ప్రత్యేకించి గర్భినీ స్త్రీలు ఈ వైర్‌సకు గురయ్యే అవకాశాలు మరీ ఎక్కువ.
రెండేళ్ల లోపు చిన్న పిల్లలు, ఆస్తమా భాధితులు, సీఓపీడి, దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల జబ్బులతో బాధపడే వారు కూడా చాలా త్వరితంగా ఈ వైర స్ బారన పడతారు.
గుండె జబ్బులు, కాలేయ, కిడ్నీ సమస్యలు గలవారు, జీవక్రియల సమస్యలతో ఉన్నవారు, మధుమేహ వ్యాధి గ్రస్తులు కూడా ఈ వైర్‌సకు గురయ్యే అవకాశాలు ఎక్కువ.
అన్నింటినీ మించి రోగ నిరోధక శక్తి తగ్గిన వారు స్వైన్ ఫ్లూ వైర్సక ఎక్కువగా గురవుతుంటారు.
- డాక్టర్ కె గోపాలకృష్ణ
హోమియో వైద్యనిపుణులు