మలేరియాపై పోరుకు కొత్త ఔషధం

14-09-2017: మలేరియా వ్యాధిని తగ్గించే సరికొత్త ఔషధాన్ని అమెరికాలోని తులనే వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉన్న చికిత్సలకు లొంగని పరాన్నజీవులను కూడా ‘ఏక్యూ-13’ అనే ఔషధం అంతమొందిస్తుందట. వ్యాధికి కారణమయ్యే పరాన్నజీవుల్ని ఈ మందు వారంలోనే చంపేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. 66మంది రోగులపై నిర్వహించిన పరీక్షల్లో ఆశాజనక ఫలితాలు వచ్చాయని వివరించారు.