స్వైన్‌ఫ్లూ రాకుండా ఇలా...

ఆంధ్రజ్యోతి, 15/09/15:
హత్తుకోవడం, షేక్‌హ్యాండ్స్‌, ముద్దులు పెట్టుకోవడం చేయకూడదు. దగ్గినపుడు, తుమ్మినపుడు  రుమాలును అడ్డంగా పెట్టుకోవాలి. తరచుగా  చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. 

ఫ్లూ సంబంధ  లక్షణాలు ఉన్నట్లయితే ఇతరులతో కనీసం ఒక మీటరు దూరం మెయింటేన్‌ చేయండి.
 
చేతులు కడుక్కోకుండా కళ్లు నలుపుకోవడం, ముక్కు, నోటి దగ్గర చేతులు పెట్టుకోవడం చేయకూడదు.
 
టిష్యూపేపర్‌ ఉపయోగించినట్లయితే వెంటనే వాటిని డిస్పోస్‌ చేయాలి.
 
ఒకవేళ ఫ్లూ సంబంధ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.  
 
లక్షణాలు గుర్తించడం ఎలా? వాటి నివారణకు అనుసరించవలసిన పద్ధతులు

కొద్దిపాటి జ్వరం, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు, డయేరియా ఉంటే, పరీక్షలు అవసరం లేదు. టామిఫ్లూ వంటి యాంటీవైరల్‌ మందులు అవసరం లేదు. విశ్రాంతి అవసరం. హైరిస్క్‌ గ్రూప్‌లోనూ, పబ్లిక్‌లోనూ తిరగకూడదు. తీవ్రమైన జ్వరం, గొంతునొప్పి ఎక్కువగా ఉంటుం ది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి.  హెచ్‌1ఎన్‌1 పరీక్షలు అవసరం లేదు. డాక్టర్‌ సలహా మేరకు యాంటీవైరల్‌  మందులు వేసుకోవాలి. కేటగిరీ ఎ, కేటగిరీ బిలోని లక్షణాలతోపాటు బిపి పడిపోవడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీనొప్పి, ఉమ్మిలో రక్తం పడటం వంటి లక్షణాలు ఉంటాయి. హెచ్‌1ఎన్‌1 పరీక్ష  అవసరం. డాక్టర్‌ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. ఆసుపత్రిలో అడ్మిట్‌  కావాలి.