ఎబోలా కట్టడెలా?

ఆంధ్రజ్యోతి, 19/10/14: ప్రపంచాన్ని వణికిస్తున్న ‘ఎబోలా’ మహమ్మారిని అంతం చూసేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిలో కొద్దిగా పురోగతి కనిపించింది. ఎబోలా వైరస్‌కు సంబంధించిన కీలకసమాచారాన్ని వారు తెలుసుకోగలిగారు. ఈ సమాచారం హెల్త్‌ ఆథారిటీస్‌కు ఉపయోగపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎబోలా మహమ్మారి ఎలా అభివృద్ధి చెందుతోంది? వ్యాప్తి చెందడాన్ని ఎలా అడ్డుకోవచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం హెల్త్‌ ఆధారిటీస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలు సేకరించిన కీలకసమాచారం ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడానికి ఉపయోగపడనుంది. రీప్రోడక్టివ్‌ నెంబర్‌, వైరస్‌ సోకిన వ్యక్తిలో ఎన్ని ఇన్‌ఫెక్షన్లు సోకుతున్నాయనే అంశాలను శాస్త్రవేత్తలు కనుకున్నారు. ఇంక్యుబేషన్‌కు, ఇన్‌ఫెక్షన్‌ పీరియడ్‌కు మధ్య సంబంధం ఉందని తేల్చారు. ఎబోలా వైరస్‌ జీన్‌ సీక్వెన్స్‌ను బేస్‌ చేసుకుని పారామీటర్స్‌ను క్యాలిక్యులేట్‌ చేశామని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ టాంజా స్టాడ్లర్‌ అన్నారు. ఈయన బాసెల్‌లోని కంప్యూటేషనల్‌ ఎవల్యూషన్‌ ఇన్‌ ద డిపార్టుమెంట్‌ ఆఫ్‌ బయోసిస్టమ్స్‌ సైన్స్‌ అండ్‌  ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన పరిశోధనలు చేస్తున్న గ్రూప్‌ అనేక మంది పేషెంట్ల నుంచి రక్తనమూనాలను సేకరించి స్టాటిస్టికల్‌ కంప్యూటర్‌ ప్రొగ్రామ్‌ను అభివృద్ధి చేసింది. రక్తనమూనాలను గినియా దేశం నుంచి వైరస్‌ వ్యాప్తి చెందిన సమయంలో సియెర్రా లియోన్‌లో సేకరించారు. అంతేకాకుండా వైరస్‌ ఇంక్యుబేషన్‌ కాలాన్ని, ఇన్‌ఫెక్షన్‌ సమయాన్ని లెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫెక్షన్‌ సోకిన 1.2 నుంచి 7 రోజుల తరువాత వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లుగా భావిస్తున్నారు.