నడకొకటే చాలదు..

6-10-15

మధుమేహం వచ్చిన వాళ్లు అడవిలో తప్పిపోయిన ఆవును వెతికితే చాలు అని పెద్దలు సెలవిచ్చారు. అంటే.. షుగర్‌ వ్యాధిగ్రస్తులకు వాకింగ్‌కు మించిన మెడిసిన్‌ లేదని చెప్పకనే చెప్పారు. మధుమేహాన్ని నియంత్రించాలంటే నడకతో పాటు ఈ టిప్స్‌ కూడా ఫాలో అయిపోండి..షుగర్‌ను నియంత్రించడంలో ఆహారపు అలవాట్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు పిండిపదార్థాలను పక్కపెట్టి ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉండే కాయగూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఒంట్లో కొవ్వు చేరకుండా జాగ్రత్తపడాలి.

ప్రతి రోజూ 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించండి. శరీరంలో ఇన్సులిన్‌ లెవల్స్‌ క్రమబద్ధీకరించడంలో వ్యాయామం ప్రభావం అధికంగా ఉంటుంది.
అమితంగా ఆహారం తీసుకోవడం ఒకటే షుగర్‌ పెరిగేందుకు కారణం కాదు. కొందరు ఎంత ఫిట్‌గా ఉన్నా.. షుగర్‌ చేసే డ్యామేజ్‌ నుంచి తప్పించుకోలేరు. శారీరకంగానే కాదు మానసికంగా కూడా బలంగా ఉండాలి. మానసిక ఒత్తిడి మధుమేహానికి ప్రధాన శత్రువు. మెంటల్‌ టెన్షన్స్‌ ఎక్కువైనపుడు శరీరంలో షుగర్‌ లెవల్స్‌ అమాంతంగా పెరిగిపోతాయి. అందుకే ఒత్తిడిని జయించే ప్రయత్నం చేయండి. యోగాసనాలు వేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతి ఉదయం పదిహేను నిమిషాలు యోగాకు కేటాయించండి. దీంతో పాటు చిన్న చిన్న 
విషయాలకు లోతుగా ఆలోచించడం మానేయండి.