మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం అమృతం ‘డయామృత్‌’

29-01-13

 
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు వంటివి మధుమేహానికి కారణాలుగా చెప్పవచ్చు. వంశపారంపర్యంగా కూడా మధుమేహం వస్తుంది. మధుమేహం నియంత్రణలో ఉండకపోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు శరీరంపై ఏర్పడే ప్రమాదముంది. దీర్ఘకాలికంగా మందులు, ఇన్సులిన్‌ ఇంజక్షన్‌లు వాడడం కన్నా ప్రత్యామ్నాయంగా ఆయుర్వేద వనమూలికలతో తయారుచేసిన అమృతం ఆయుర్వేద నిలయం వారి ‘డయామృత్‌’ చూర్ణం డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు వరంగా పనిచేస్తుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు ఎన్‌. సుబ్రహ్మణ్యం.
 
ఆధునిక వైద్యపరంగా మధుమేహం రెండు రకాలు. అవి టైప్‌1, టైప్‌2. శరీరంలోని పాంక్రియాస్‌లో సరిపడినంత ఇన్సులిన్‌ ఉత్పత్తి లేకపోవడం వల్ల రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి. ఇది టైప్‌1 డయాబెటిస్‌గా పరిగణిస్తారు. ఈ వ్యాధిగ్రస్తులు నిత్యం ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ తీసుకోవలసి ఉంటుంది. ఇన్సులిన్‌ ఉత్పత్తి తక్కువగా ఉండడం, దాన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోవడం ఏర్పడేది టైప్‌2 డయాబెటిస్‌. ఇది సాధారణంగా 40 ఏళ్ల వయస్సు దాటిన వారిలో తలెత్తే సమస్య. జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిళ్లు, వేళకు ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం కొరవడడం, స్థూలకాయం, వంశపారంపర్యత వంటివి టైప్‌2 డయాబెటిస్‌కి కారణాలుగా చెప్పవచ్చు.
లక్షణాలు
ఏదైనా వ్యాధి రావడానికి ముందు కొన్ని లక్షణాలు శరీరంలో కనపడతాయి. వెంటనే వాటిని గమనించి చికిత్స చేసుకుంటే ఆ వ్యాధి రాకుండా నిరోధించవచ్చు. దీనిని ఆయుర్వేదంలో పూర్వరూపములు అంటారు. ఆయుర్వేదపరంగా శరీరంలో వాత, పిత్త, కఫ దోషములు ప్రకోపించి రకరకాల వ్యాధులు వచ్చే ముందు కనబడే లక్షణాలలో జుట్టు బిరుసెక్కటం, నోరు తీయగా ఉండటం, చేతులు కాళ్లలో స్పర్శ తగ్గడం, మంటరావడం, నోరు ఎండినట్లుండటం, అతిదాహం, శరీరం బద్ధకిస్తుండటం, మలబద్ధకం, మూత్రముపై ఈగలు, చీమలు ప్రాకుతుండటం, శరీరం నుంచి దుర్గంధం రావడం, ఎప్పుడూ కునికిపాట్లు రావడం, అతిగా నిద్ర రావడం లాంటి లక్షణాలు కనబడినపుడు వెంటనే జాగ్రత్తపడి తగిన వైద్య పరీక్షలు చేసుకుని మధుమేహానికి ఔషధాలు ఉపయోగించాలి. మధుమేహం వచ్చిన వాళ్లకు భవిష్యత్తులో గుండె సంబంధ వ్యాధులు, కాళ్లకు, పాదాలకు రకరకాల వ్యాధులు, మొద్దుబారడం, కాళ్ల మంటలు, గాయం అయితే మానకపోవడం, కిడ్నీ సంబంధ వ్యాధులు రావడం, తర్వాత కిడ్నీలు ఫెయిలవ్వడం, చర్మ రోగాలు, కంటిచూపు పోవడం, పక్షవాతం లాంటివెన్నో ఎదుర్కోవలసి వస్తుంది. 
ఆయుర్వేద అద్భుతం
నేడు ఆయుర్వేదం గురించి, సహజవైద్యం గురించి ఎన్నెన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిలో చాలా రకాల ఔషధాలు మధుమేహాన్ని అదుపులోకి తెస్తున్నాయి. ఇతర దుష్ప్రభావాలు కూడా ఉండవు. దీనిలో భాగంగా ‘అమృతం ఆయుర్వేద నిలయం’ మధుమేహ రోగుల కోసం ఓ మహత్తరమైన ఔషధాన్ని తీసుకువచ్చింది. పరిశోధనల ఆధారంగా కూడా నిరూపితమైన మూలికలు గుడ్‌మార్‌, విజయసార్‌, మెంతి, జంబూ, ఉసిరి, గుడూచి, మారేడు, హరిద్ర, చిరాయత, నింబ, కాకర, అవర్తకీ లాంటి పలు రకాల మూలికలతో ఒక ప్రత్యేక పద్ధతిలో మేళవించి తయారు చేయబడిన ఔషధం ‘అమృతం’ డయామృత్‌ చూర్ణం.
ఎలా తీసుకోవాలి?
ఒక స్పూన్‌ చూర్ణం లేదా 5 గ్రాముల మోతాదుతో నీరు లేదా మజ్జిగతో కలిపి ఉదయం పరగడుపున తీసుకోవాలి. సాయంకాలం ఆహారానికి ముందు ఇదే మోతాదులో సేవించాలి. లేదా కషాయం తయారు చేసుకుని, వడపోసి సేవించాలి.ఈ ఔషధం వాడుతున్నప్పుడు తీపి కలిగిన పండ్లు, ఖర్జూరం లాంటివి నిరభ్యంతరంగా తినవచ్చు.
లాభాలు ఎన్నెన్నో...
మధుమేహం కారణంగా కీళ్లకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. అలాంటి వాటిని నివారించగలుగుతుంది ఈ ఔషధం. గుండె పని తీరు మెరుగుపడుతుంది. కాళ్ల మంటలు, తిమ్మిర్లు, కాళ్లలో స్పర్శ లేకపోవడం, ఏదైనా గాయం అయితే తొందరగా మానకపోవడం లాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. కిడ్నీల పనితీరు మెరుగుపరుస్తుంది. రక్త శోధనం జరగడం వల్ల శరీరానికి రక్తం సక్రమంగా ప్రసరణ చేయించడం ద్వారా చర్మం మృదువుగా ఉంటుంది. చర్మవ్యాధులు రాకుండా కాపాడుతుంది. కళ్లకు తగిన పోషకాలు, రక్తం సరఫరా సక్రమంగా కాలేక పోవడం చూపుకోల్పోవడం, కంటి నరాలు, కాటరాక్ట్‌ సమస్యలు వస్తుంటాయి. అలాంటి వాటికి గురికాకుండా నరాలను పటిష్టంగా కాపాడడం ద్వారా చూపును కాపాడుతుంది. ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ వాడేవారు నిత్యం వాడుకుంటూ ఈ చూర్ణం వాడడం ద్వారా మధుమేహం వల్ల వచ్చే దుష్ప్రభావాలకు గురికాకుండా ఉండవచ్చు. ఈ చూర్ణంలోని పీచు పదార్థం సుఖవిరేచనం చేయించగలుగుతుంది. దీని వల్ల మలబద్ధకం సమస్య పోతుంది. స్థూలకాయంతో బాధపడేవారు ఈ చూర్ణం వాడితే బరువు కూడా తగ్గుతారు. మధుమేహం కారణంగా ఏర్పడే లైంగిక బలహీనతలను చూర్ణం పోగొడుతుంది. ఈ ఔషధాన్ని తీసుకోవడం ద్వారా లైంగిక శక్తిని పెంపొందించుకోవచ్చు.
 
ఎన్‌. సుబ్రహ్మణ్యం
అమృతం ఆయుర్వేద నిలయం
9-6, లలితా నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌
హైదరాబాద్‌
ఫోన్‌: 9246565194
040-24062243