మెడనొప్పి, వెన్ను నొప్పి వీరికే ఎక్కువ!

12-03-2019: నూటికి తొంభైశాతం మంది తమ జీవితంలో ఎక్కువ కాలం పై రెండు సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. మామూలు వ్యక్తులతో పోల్చుకుంటే, షుగర్‌ వ్యాధిగ్రస్తులలో ఈ సమస్యలు మరింత ఎక్కువగా అంటే 25 నుంచి 35 శాతం ఎక్కువగా ఉంటాయన్న విషయం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆరోగ్యవంతులైన వారిలో ఈ సమస్యలు సాధారణ చికిత్సతో తగ్గిపోతాయనీ, షుగర్‌ ఉన్నవారికి అలాసాధ్యం కాదని అధ్యయనకారులంటున్నారు. ముఖ్యంగా టైప్‌–2 డయాబెటిస్‌ ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపించడానికి కారణం అధికబరువు, శారీరక శ్రమ అంతగా లేకపోవడం కారణం కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీని మీద ఇంకా అధ్యయనాలు చేయాలని వారు స్పష్టం చేస్తున్నారు.