మధుమేహులకు ఉప్పూ ముప్పే!

13-03-2019: చక్కెర వ్యాధి ఉంటే తీపిపదార్థాలు తినకూడదు. అయితే, మధుమేహ రోగులు ఉప్పు ఎక్కువగా తీసుకున్నా ముప్పేనంట. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల టైప్‌-2 మధుమేహం ఉన్నవారిలో చక్కెరస్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయని యూకేకు చెందిన వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా రక్తపోటు, హృద్రోగాలు కూడా వచ్చే ప్రమాదం ఉన్నందున వీలైనంత వరకు ఉప్పు వాడకాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. రోజులో టే బుల్‌ స్పూన్‌కు మించి ఉప్పు తీసుకోకపోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారమే తీసుకోవాలని సూచిస్తున్నారు.