మధుమేహులకు సబ్జా సాయం!

22-10-2019: సబ్జా విత్తనాల్లో విలువైన పోషకాలు ఉన్నాయి. మధుమేహులకు ఈ పోషకాలు రెట్టింపు మేలు చేస్తాయి. గ్లూకోజ్‌, ఇన్సులిన్‌ టాలరెన్స్‌ను పెంచుతాయి. సబ్జాతో ఉన్న ఇతరత్రా ఉపయోగాలు ఏవంటే....
 
ఇన్‌ఫ్లమేషన్‌: శరీరంలో తలెత్తే పలు రకాల ఇన్‌ఫ్లమేషన్లను ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌తో అదుపు చేయవచ్చు. ఈ పోషకం సబ్జాలో ఉంటుంది. వంద గ్రాములు సబ్జా విత్తనాల్లో 17.8 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అలాగే సబ్జా విత్తనాల్లో అధికంగా ఉండే పీచు కూడా ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. ఈ విత్తనాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి.
 
హృద్రోగాలు: రక్తపోటు కలిగి ఉన్న మధుమేహులు ప్రతి రోజూ క్రమం తప్పకుండా సబ్జా విత్తనాలు తింటే వారి సిస్టాలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌ తగ్గినట్టు పలు పరిశోధనల్లో రుజువైంది. రక్తపోటు తగ్గితే గుండె మీద పడే భారం కూడా తగ్గుతుంది. కాబట్టి సబ్జా విత్తనాలు తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను అరికట్టవచ్చు. సబ్జా విత్తనాలను సరిపడా నీళ్లలో కనీసం 30 నిమిషాల నుంచి 2 గంటలపాటు నానబెట్టాలి. సబ్జా విత్తనాలను నీళ్లను ఎక్కువగా పీల్చుకుంటాయి. కాబట్టి రోజంతా తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి.