మధుమేహుల మధుర ఫలాలు

14-10-15

 
డయాబెటిస్‌ వ్యాధి గ్రస్తులు చక్కెర ఎక్కువగా ఉండే పండ్లు తినటానికి సందేహిస్తుంటారు. కానీ వారు సందేహం లేకుండా కొన్ని పండ్లను తినొచ్చు.
డయాబెటిస్‌ ఉండే వారు ఫ్రూట్స్‌ను నిరభ్యంతరంగా తినొచ్చు అంటున్నారు పరిశోధకులు. విటమిన్‌ సి అధికంగా ఉండే నారింజ పండ్లు తింటే డయాబెటిక్‌ పేషెంట్స్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫైబర్‌ కంటెంట్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండే ఆపిల్‌ పండ్లు తినొచ్చు. ఇవి సులభంగా జీర్ణమవుతారు
చెర్రీలతోపాటు బ్లాక్‌ బెర్రీలను తినొచ్చు.పుచ్చకాయలో చక్కెర అధికంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. ఫైబర్‌తో పాటు మినరల్స్‌ కూడా ఎక్కువగా ఉండే ఈ పండ్లను తినటం వల్ల సుగర్‌ లెవల్స్‌ ఎటువంటి పరిస్థితుల్లో పెరగవని నిపుణులు అంటున్నారు.కార్బోహైడ్రేట్స్‌ అధికంగా ఉండే మామిడిపండ్లు తినొచ్చు.త్వరగా శక్తినిచ్చే అరటి పండ్లను డయాబెటిస్‌ పేషెంట్స్‌ తినటం వల్ల ఎలాంటి హాని జరగదు.విటమిన్స్‌, మినరల్స్‌, ఫైబర్‌, చక్కెర ఉండే ద్రాక్ష కూడా తీసుకోవచ్చు.దానిమ్మ పండ్లు డయాబెటిస్‌ పేషంట్స్‌ తినవచ్చు. వీరికి బొప్పాయి చక్కని పండు.