డయాబెటిస్‌కు హోమియో చికిత్స

19-06-2018: డయాబెటిస్‌ దీర్ఘకాలికంగా వేధించే ఒక ఆరోగ్య సమస్య. దీని బారిన పడినవారు జీవితకాలం మందులు వాడటం తప్ప వేరే మార్గం లేదని మానసికంగా చాలా కుంగిపోతూంటారు. చాలా మందిలో సరైన ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం చేయడం, మందులు వాడటం లాంటి జాగ్రత్తలు పాటించినా తమ రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలోకి రాకపోవడం, దుష్ప్రభావాలకు లోనై ఇబ్బందులకు గురవుతారు. కానీ ఈ వ్యాధిని గుర్తించిన వెంటనే సరైన హోమియో చికిత్స అందించడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రణలో ఉంచడమే కాకుండా తద్వారా ఏర్పడే దుష్ప్రభావాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడకునే అవకాశం ఉంది. శరీరంలో మిగిలిపోయిన చక్కెర పదర్థాలు ఎక్కువగా ఉంటే డయాబెటిస్‌ అంటారు. ఇది ఒక మెటబాలిక్‌ డిజార్డర్‌.
 
డయాబెటిస్‌ రకాలు
టైప్‌ 1: ఇది శరీర రోగనిరోధక వ్యవస్థ, క్లోమా గ్రంథిలోని ఇన్సులిన్‌ ఉత్పత్తి చేసే కణాలను నాశనం చేయడం వల్ల కలుగుతుంది. దీనిని ఎక్కువ శాతం 20 ఏళ్ల వయసులోపు వారిలో గమనించవచ్చు. ఇది ఎక్కువగా చిన్న వయసులో వచ్చే అవకాశం ఉంది. దీనినే ‘జువనైనల్‌ డయాబెటిస్‌’ అంటారు.
కారణాలు: ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు, క్లోమ గ్రంథి ‘సిస్టిక్‌ పెబ్రోసిస్‌’ లోను కావడం, క్రానిక్‌ ప్యాంక్రియాటిస్‌, పార్షియల్‌ ప్యాంక్రియాటెక్టమి వంటివన్నీ ఈ వ్యాధికి కారణం కావచ్చు.
టైప్‌ 2: ఈ రకం డయాబెటిస్‌ 30 ఏళ్ల వయస్సువారిలో కనిపిస్తుంది.
కారణాలు: సరిపడిన మోతాదులో ఇన్సులిన్‌ ఉత్పత్తి కాకపోవడం, ఒకవేళ ఉత్పత్తి అయినా కణాలు సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం
వయసు పైబడటం ఫ శారీరక శ్రమ తగ్గడం
అధిక మానసిక ఒత్తిడి
వంశపారంపర్యత, జెస్టేషనల్‌ డయాబెటిస్‌ కలిగి ఉండటం
టైప్‌ 3: జెస్టేషనల్‌ డయాబెటిస్‌: ఇది గర్భిణీల్లో కనిపిస్తుంది.
లక్షణాలు: అధిక ఆకలి, దాహం, మూత్రస్రావం, బరువు తగ్గిపోవడం, త్వరగా నీరసించిపోవడం, పిక్కల్లో నొప్పులు, గాయాలు నయం కాకపోవడం, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు
బరువు తగ్గిపోవడం, నీరసం ఫ ఒళ్లు నొప్పులు, చర్మవ్యాఽధులు ఎక్కువగా రావడం
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు ఫ సెక్స్‌ కోరికలు తగ్గిపోవడం దుష్ఫలితాలు: సరైన చికిత్స అందకపోతే డయాబెటిస్‌ ఇతర వ్యాధులకు దారి తీసే ప్రమాదం ఉంది. సరిగ్గా లేకపోతే అవేంటంటే...
డయాబెటిక్‌ ఫుట్‌ ఫ డయాబెటిక్‌ నెఫ్రోపతి (కాళ్లపై ప్రభావం)
డయాబెటిక్‌ రెట్రోపతి (కళ్లపై ప్రభావం)
గుండెపోటు, పక్షవాతం, క్యాటరాక్ట్‌, గ్యాస్ట్రిక్‌ సమస్యలు రోగనిర్థారణ సమస్యలు: ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌(ఎఫ్‌బీఎస్‌), పోస్ట్‌ ప్రాండియల్‌ బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌, గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్ట్‌ (జీటీటీ), యూరిన్‌ షుగర్‌ లెవల్స్‌ మొదలైన పరీక్షలు చేయిస్తే డయాబెటిస్‌కు సరైన చికిత్స అందుతుంది.
హోమియోకేర్‌ ఇంటర్‌నేషనల్‌ చికిత్స: హోమియోకేర్‌లో జెనెటిక్‌ కాన్సిటిట్యూషనల్‌ వైద్యవిధానం ద్వారా కేవలం వ్యక్తిలోని డయాబెటిస్‌ జబ్బుకే కాకుండా, డయాబెటిస్‌కి గురైన వ్యక్తికి సమర్థమైన చికిత్స అందించడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడమే కాకుండా ఎలాంటి కాంప్లికేషన్స్‌ బారిన పడకుండా కాపాడవచ్చు. ఇంతటి విశిష్టమైన వైద్యం అందించడానికి ముందుగా రోగి మానసిక, శారీరక లక్షణాలను క్షణ్ణంగా విచారించి దానికి సరిపడిన ఔషధాన్ని అందించడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించడం సాధ్యమవుతుంది.

డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ CMD

హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి