డయాబెటిక్‌ న్యూరోపతికి చెక్‌ ఇలా

15-4-15

ఆధునిక జీవన పయనంలో భాగంగా ప్రతీ మనిషి తన గమ్యాన్ని చేరుకునేందుకు ఉరుకులు, పరుగులు పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆహారపు అలవాట్లు క్రమం తప్పడం, అధిక ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు మధుమేహం రావడానికి కారణం అవుతున్నాయి. మన శరీరంలో చాలా ముఖ్యమైంది ప్యాంక్రియాస్‌. ఇది శరీరానికి సరిపడా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల గానీ లేదా ఇన్సులిన్‌ను శరీర కణాలు సహజంగా గ్రహించే ప్రక్రియ దెబ్బతిన్న సందర్భంలో గానీ మధుమేహం సంభవిస్తుంది. 
డయాబెటీస్‌ వల్ల అనేక దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందులో ముఖ్యమైనవి హృద్రోగాలు, డయాబెటిక్‌ నెఫ్రోపతి , డయాబెటిక్‌ రెటినోపతి, డయాబెటిక్‌ న్యూరోపతి ఇందులో డయాబెటిక్‌ న్యూరోపతి ఒక సాధారణమైన దీర్ఘకాలిక సమస్య. సుమారు 60 నుంచి 70 శాతం దీర్ఘకాలిక మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో గ్లూకోజ్‌ శాతం నియంత్రణలో లేకపోవడం వల్ల డయాబెటిక్‌ న్యూరోపతి వచ్చే అవకాశం ఉంది. 
డయాబెటిక్‌ న్యూరోపతి రకాలు 
మధుమేహ వ్యాధిగ్రస్థులు ఎదుర్కొనేటువంటి డయాబెటిక్‌ న్యూరోపతి 4 రకాలుగా కనిపిస్తుంది. ఇవి వరుసగా పెరిఫెరల్‌ న్యూరోపతి, అటోనమిక్‌ న్యూరోపతి, ప్రాక్సిమల్‌ న్యూరోపతి, ఫోకల్‌ న్యూరోపతి. ఈ నాలుగింటిలో సాధారణంగా ఫెరిఫరల్‌ న్యూరోపతి ఎక్కువ మందిలో కనిపిస్తుంది. 
లక్షణాలు 
కాళ్లు దిమ్మపట్టినట్లు ఉండడం, మొద్దు బారడం, సూదులు గుచ్చినట్లుగా ఉండడం, అరికాళ్లలో మంట, కాళ్లలో బలహీనత, కాళ్ల కండరాలలో నొప్పి, కడుపుబ్బరం, విరేచనాలు, మలబద్ధకం, ఛాతిలో మంట, వికారం, వాంతులు, గుండెదడ, అధిక మూత్ర విసర్జన, మూత్ర విసర్జన పై నియంత్రణ కోల్పోవడం, పురుషులు మరియు స్త్రీలలో లైంగిక పరమైన సమస్యలు, ముఖంలోని కొంత భాగం పక్షవాతానికి గురికావడం, చేతుల్లో తిమ్మిరి, నొప్పి వంటి లక్షణాలను  గమనించవచ్చు. డయాబెటిక్‌ న్యూరోపతితో బాధపడుతున్న వారందరిలోనూ పైన పేర్కొన్న లక్షణాలన్నీ ఉండకపోవచ్చు గానీ,  వ్యాఽధి రకాలను బట్టి లక్షణాలు మారుతుంటాయి. 
నిర్ధారణా పరీక్షలు
రోగి లక్షణాల తీవ్రతను పరిశీలించి తద్వారా వ్యాధిని నిర్ధారించేందుకు కొన్ని శారీరక పరీక్షలు అవసరమవుతాయి. ముఖ్యంగా కళ్లలోని స్పర్శజ్ఞానం, కండరాల పటుత్వం, రిఫ్లెక్సెస్‌ వంటి పరీక్షల ద్వారా  వ్యాధి నిర్ధారించబడుతుంది.  రక్తంలో చక్కెర స్థాయిలు, ఫిట్‌మెంట్‌టెస్ట్‌, ఎన్‌సిఎస్‌, సిఎమ్‌జి వంటి పరీక్షల ద్కావరా కూడా వ్యాధిని నిర్ధారించవచ్చు.
హోమియోకేర్‌ చికిత్స
హోమియో కేర్‌ ఇంటర్నేషనల్‌లో డయాబెటిక్‌ న్యూరోపతి సమస్యకు జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ పద్ధతి మేరకు వైద్యం చేయడం జరుగుతుంది. ఈ వ్యాధిగ్రస్తులు ఎదుర్కొనే నరాలనొప్పి, తిమ్మిరి, స్పర్శకోల్పోవడం వంటి సమస్యలను మరియు వీటికి కారణమైన రక్తంలోని వివిధ గ్లూకోజ్‌ స్థాయిలను నియంత్రించవచ్చు. అంతేకాకుండా, రోగి మానసిక, శారీరక స్థితిగతులను క్షుణ్ణంగా విచారించి, తద్వారా దానికి అనువైన చికిత్సను అందివ్వడం ద్వారా నాడి వ్యవస్థ పనితీరును సరిచేసి డయాబెటిక్‌ న్యూరోపతి వ్యాధిని  పూర్తిగా నివారించవచ్చు.
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లవార్‌ (సీఎండీ)
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ ప్ర్తె.లి.
 ఫోన్‌ : 9550001199/88
టోల్‌ ఫ్రీ : 1800 102 2202