డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చు

11-09-13

‘‘డయాబెటిస్‌ అంటే ఇక అంతే సంగతులు. అది షుగర్‌ వ్యాధి. ఇక జీవితాంతం దాంతో తీరని సమస్యే’’ అని భయపడేవాళ్లు అనేకమంది. అయితే ఇక ముందు ఆ భయం అక్కర్లేదంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్‌ దీప్తి. ఇప్పుడు స్టార్‌ ఆయుర్వేద డయాబెటిస్‌ బాధితుల కోసం ప్రపంచస్థాయిలో ప్రామాణికమైన, అత్యున్నతమైన వైద్యాన్ని తీసుకొని వచ్చింది. ఆ ఆధునిక ఆయుర్వేద వైద్యం డయాబెటిస్‌ నుంచి శాశ్వత విముక్తి కలిగిస్తుందని ఆమె అంటున్నారు. 
 
డయాబెటిస్‌ వల్ల శారరకంగానే కాదు, మానసికంగా కూడా ఎక్కువ కుంగిపోతుండటం వల్ల అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రతి వందమందిలో 14 మంది డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పుల నుంచి ఆహారంలో ఏర్పడిన మార్పుల వరకు అనేక విషయాలు ఇందుకు కారణం. డయాబెటిస్‌ వ్యాధి వల్ల దుష్ఫలితాలు కింది విధంగా ఉంటాయి.
లక్షణాలు, దుష్ఫలితాలు
విపరీతంగా దాహం పెరుగుతుంది.
ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
విపరీతంగా ఆకలి వేయడం, ఎంత ఆహారం తీసుకున్నా శక్తి లేకపోవడం, బలహీనంగా ఉండటం.
బరువు తగ్గి, చిక్కిపోవటం, నీరసం, నిస్సత్తువ.
చూపు మందగించటం, మబ్బుగా, మసకమసకగా కనిపించడం
విపరీతమైన అలసట, కాళ్లు లాగటం.
గాయాలు తగిలితే త్వరగా తగ్గకపోవటం.
కొన్ని సంవత్సరాల తరువాత శరీరంలో పెద్ద రక్తనాళాలు దెబ్బతినడం వల్ల గుండె, మెదడు, కాళ్లు, చేతుల్లోని రక్తనాళాలు సరిగ్గా పని చేయవు. 
చిన్న రక్తనాళాలు దెబ్బతిన్నందువల్ల కంటిలోని రెటీనా కూడా దెబ్బ తింటుంది.
నరాల బలహీనత, కళ్లల్లో మంటలు
మానసిక ఒత్తిడి, శృంగార సమస్యలు ఎక్కువ కావటం. 
అదుపు అవసరం
డయాబెటిస్‌ను సరైన శ్రద్ధతో కంట్రోల్‌లో వుంచుకోవాలి. అలా చేయకపోతేనే అది క్రమంగా మీ శరీరాన్ని కబళిస్తుంది. షుగర్‌ వ్యాధిని నిరోధించడానికి తరుచుగా వాడే పాశ్చాత్య రసాయనాలు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినప్పటికీ వాటి ద్వారా ఏర్పడే దుష్ఫలితాలూ ఎక్కువే ఉన్నాయి. పాశ్చాత్య రసాయనాలు తరుచుగా వాడటం వల్ల చర్మం మీద మచ్చలు, తలనొప్పి, జీర్ణ సంబంధిత బాధలు వంటి అవాంఛిత ప్రక్రియలు మొదలవుతాయి. కానీ ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా పనిచేసే వైద్యం ఆయుర్వేదం ఒక్కటే. నిజానికి ఆయుర్వేదం ఎంత ప్రభావమైనదో, అంత శాశ్వతమైనది కూడా. అందుకే ఇప్పుడు స్టార్‌ ఆయుర్వేద సరికొత్త ఫార్ములాతో డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించబోతోంది. 36 సంవత్సరాలు అనుభవంతో, ప్రకృతి ప్రసాదించిన వనమూలికల ద్వారా ఎన్నో లక్షల మంది రోగులకు ఉపశమనం కలిగిస్తూ వస్తున్న ఆయుర్వేదం వైద్యంలో ఇప్పుడు అత్యాధునిక మందులు డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల కోసం అందుబాటులోకి వచ్చాయి. 
 ఆయుర్వేదం వైద్యం ఓ ప్రత్యేక పంథాలో సాగుతుందనే విషయం తెలిసిందే. వ్యాధిగ్రస్తులు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు? అది ఆనువంశికమా? మానసిక ఒత్తిడి వల్ల వచ్చిందా? ఇటువంటి ప్రశ్నలను నిపుణులైన డాక్టర్లు కూలంకషంగా పరిశీలించిన తర్వాతే రోగ లక్షణాలకు, వ్యాధి తీవ్రతను బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది.
ప్రి-డయాబెటిక్‌ ట్రీట్‌మెంట్‌
ఈ అత్యాధునిక ఫార్ములాతో కూడిన మందుల వల్ల డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు సరికొత్త జీవితం మొదలవుతుందని నమ్మకంగా చెప్పవచ్చు. డయాబెటిస్‌ను ఎప్పుడూ ఒక తీరని వ్యాధిగా భావించనవసరం లేదు. ఎందుకంటే అది కేవలం మీరు అవలంభించవలసిన జీవిత విధానాల మార్పులను సూచిస్తుంది. అందుకే ఆయుర్వేద వైద్యంతో మీ జీవితంలో మార్పును తీసుకు వచ్చి డయాబెటిస్‌ను అదుపులో ఉంచడమే కాదు, ‘ప్రి-డయాబెటిక్‌ ట్రీట్‌మెంట్‌’తో పూర్తిగా నయం చేయవచ్చు కూడా. 
ఉదాహరణకు, అత్యాధునిక స్టార్‌ ఆయుర్వేద మందులతో పాటు, పీచు పదార్థాలు అధికంగా తీసుకొనడం, ఉప్పు, చక్కెర సంబంధిత పదార్థాలు తగ్గించడం, మితమైన పౌష్టిక ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి ద్వారా డయాబెటిస్‌ను శాశ్వతంగా నివారించవచ్చు. 
సంప్రదాయత, అత్యాధునిక టెక్నాలజీ, అత్యాధునిక మందులు అనుభవజ్ఞులైన ఆయుర్వేద డాక్టర్లు ఇప్పుడు స్టార్‌ ఆయుర్వేదలో అందుబాటులో ఉన్నారు. స్టార్‌ ఆయుర్వేద హాస్పిటల్స్‌ అందిస్తున్న ఆధునిక ఆయుర్వేదం వైద్యం శక్తివంతమైన ఫలితాలను అందిస్తుంది. ఇక డయాబెటిస్‌ గురించి బాధ గానీ, భయం గానీ అవసరం లేదు.
 
డాక్టర్‌ దీప్తి, ఎండీ ఆయుర్వేద,
స్టార్‌ ఆయుర్వేద,
సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్‌
ఫోన్‌: 9030081861, 9030081876