చక్కెరకు చెక్‌!

13-08-2019: ఎన్ని వ్యాయామాలు చేసినా బరువు తగ్గడం లేదంటే, ఆహారంలో మార్పులు చేసుకోవాలని అర్థం. ఇందుకోసం మరీ ముఖ్యంగా ఆహారం నుంచి చక్కెరను పూర్తిగా తొలగించాలి. అదెలాగంటే...
 
శీతల పానీయాలు: ఒక శీతలపానీయంలో సుమారు నాలుగు టీస్పూన్ల చక్కెర ఉంటుంది. కాబట్టి అరుదుగా తీసుకున్నా శరీరంలో అవసరానికి మించి చక్కెర పేరుకుపోతుంది. కాబట్టి శీతలపానీయాలను పూర్తిగా మానేయాలి.

ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌: వీటిలో అత్యధిక చక్కెర ఉంటుంది. చక్కెరకు తోడు ఉప్పు కూడా ఉండే వీలుంది. ఇవి రెండూ బరువు పెంచేవే! కాబట్టి ప్రాసెస్‌డ్‌ పదార్థాలకు, ప్యాకెట్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. 

చక్కెర ప్రత్యామ్నాయాలు: తీపి లేని జీవితం చేదుగా ఉంటుంది అనుకుంటే, దానికి ప్రత్యామ్నాయాలైన ఖర్జూరం, తేనె, కోకోనట్‌ షుగర్‌ మొదలైన వాటిని ఎంచుకోవచ్చు.
 
డార్క్‌ చాక్లెట్‌: తీపి తినాలనే కోరిక కలిగినప్పుడు చిరుచేదుగా ఉండే డార్క్‌ చాక్లెట్‌ను అరుదుగా తినవచ్చు. డార్క్‌ చాక్లెట్‌ జిహ్వచాపల్యాన్ని అణచడంతో పాటు, తీపి తినాలనే కోరికను తగ్గిస్తుంది.