రోజూ గంట వ్యాయామంతో

ఆంధ్రజ్యోతి(20-10-2016): మధుమేహ ముప్పు దూరం కావడానికి 40శాతం తక్కువ వేగంగా నడిచినా, సైకిల్‌ తొక్కినా మేలే

ప్రతిరోజూ గంట సేపు కఠినమైన వ్యాయామాలు చేస్తే టైప్‌ 2 మధుమేహం వచ్చే ప్రమాదం 40 శాతం వరకూ తగ్గుతుందట! అబ్బే... రోజూ కసరత్తులు చేసేందుకు కుదరడం లేదంటారా? అయితే వారానికి కనీసం 150 నిమిషాల పాటు వేగంగా నడిచినా లేదా సైకిల్‌ తొక్కినా లేదా డబుల్స్‌ టెన్నిస్‌ ఆడినా మధుమేహ ముప్పు 26 శాతం తగ్గుతుందట! అమెరికా, ఆసియా, ఆసే్ట్రలియా, ఐరోపా దేశాల్లో జరిగిన 23 పరిశోధనల ఫలితాలను విశ్ల్లేషించిన కేంబ్రిడ్జి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయం గుర్తించారు. స్థూలకాయం కారణంగా 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది టైప్‌ 2 మధుమేహం(ఇన్సులిన్‌ను దేహం సరిగ్గా వాడుకోలేకపోవడం) బారిన పడే అవకాశం ఉందని, వ్యాయామం ప్రాముఖ్యతపై మరింత అవగాహన కల్పిస్తే.. ఈ సమస్యను తగ్గించవచ్చని పేర్కొన్నారు.