హోమియో వైద్యంతో షుగర్‌ వ్యాధి మాయం

ఆంధ్రజ్యోతి, 03-05-13: డయాబెటిస్‌ ఉందని తెలిస్తే జీవితాంతం మందులు వాడాల్సిందే. అయితే దీర్ఘకాలం పాటు వ్యాధి కొనసాగటం వల్ల అనేక సమస్యలు వచ్చిపడతాయి. కానీ హోమియో వైద్యంతో ఆ భయం లేదు. హోమియో మందుల వల్ల డయాబెటిస్‌ అదుపులో ఉండటమే కాకుండా, ఆ వ్యాధి మూలంగా తలెత్తే ఇతర సమస్యలకు అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు డాక్టర్‌ శ్రీకాంత్‌. 

రక్తంలో గ్లూకోజ్‌ లెవెల్స్‌ పెరిగిపోవడాన్ని మధుమేహం (డయాబెటిస్‌)అంటారు. అంటే క్లోమగ్రంధి ఇన్సులిన్‌ను సరిగ్గా ఉత్పత్తి చేయకపోవడం లేదా ఉత్పత్తి చేసిన ఇన్సులిన్‌ను శరీర కణాలు సక్రమంగా వినియోగించుకోలేకపోవడం జరుగుతుంది. ఈ రెండు కారణాలలో ఏదో ఒక కారణం మూలంగా షుగర్‌ వ్యాధి వస్తుంది. 

డయాబెటిస్‌ రెండు రకాలు 

టైప్‌ 1 డయాబెటిస్‌ : దీనిని ఇన్సులిన్‌ ఆధారిత డయాబెటిస్‌ అంటారు. జువెనైల్‌ డయాబెటిస్‌ అని కూడా అంటారు. వీరిలో ఇన్సులిన్‌ ఉత్పత్తి సరిపడా ఉండదు. 20 ఏళ్ల లోపు వారిలో కనిపిస్తుంది. 
టైప్‌ 2 డయాబెటిస్‌: దీనిని ఇన్సులిన్‌పై ఆధారపడని డయాబెటిస్‌ అంటారు. అడల్ట్‌ హుడ్‌ డయాబెటిస్‌ అని కూడా అంటారు. ఈ రకం డయాబెటిస్‌ఉన్న రోగుల్లో ఇన్సులిన్‌ సక్రమంగా వినియోగించుకోలేకపోవడం జరుగుతుంది. 40 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. 

లక్షణాలు

తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, అతిగా దాహం, బరువు తగ్గడం, త్వరగా అలసిపోవడం, గాయాలు త్వరగా మానకపోవడం, కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం, అరికాళ్ల మంటలు, దురదలు, చర్మవ్యాధులు, చూపు మందగించడం, అంగస్తంభన సమస్యలు ప్రారంభం కావడం, స్త్రీలలో తెల్లబట్ట ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

కారణాలు

వంశపారంపర్యంగా రావడం, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి, కొన్ని రకాల మందులు, క్లోమగ్రంధికి సంబంధించిన వ్యాధులు రావడం వంటి కారణాల వల్ల డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఉంటుంది. 

నిర్ధారణ పరీక్షలు

ఉదయాన ఏమీ తినకుండా, తాగకుండా పరగడపున రక్తపరీక్ష (ఎఫ్‌బీఎస్‌) చేయించాలి. మళ్లీ భోజనం చేసిన రెండు గంటల తరువాత మళ్లీ ఒకసారి రక్తపరీక్ష (పీఎల్‌బీఎస్‌) చేయించాలి. ఈ పరీక్షల్లో ఎఫ్‌బీఎస్‌ 120 ఎమ్‌జీ/డీఎల్‌ కన్నా ఎక్కువగా, పీఎల్‌బెస్‌ 200 ఎమ్‌జీ/డీఎల్‌ కన్నా ఎక్కువగా ఉంటే డయాబెటిస్‌ ఉన్నట్టుగా భావించాలి. వీటితో పాటు గ్లూకోజ్‌ టాలరెంట్‌ టెస్ట్‌, గ్లైకోజిలేటెడ్‌ హీమోగ్లోబిన్‌ పరీక్ష, యావరేజ్‌ బ్లడ్‌ గ్లూకోజ్‌ వంటి పరీక్షలు ఉపయోగపడతాయి. అధిక బరువు ఉన్న వారిలో టైప్‌ 2 డయాబెటిస్‌ వస్తుంది. 

దుష్ఫలితాలు

డయాబెటిస్‌ వల్ల కలిగే దుష్ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి తాత్కాలిక దుష్ఫలితాలు, దీర్ఘకాలిక దుష్ఫలితాలు. 

తాత్కాలిక దుష్ఫలితాలు : రక్తంలోని గ్లూకోజ్‌ను శరీరం వినియోగించుకోలేకపోయినపుడు తనకు అవసరమైన శక్తి కోసం శరీరంలోని కణాలలో కొవ్వు పదార్థాలు, ప్రొటీన్‌ల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో కీటోన్స్‌ అనబడే పదార్థాలు తయారై అవి రక్తంలో నిలువ ఉండి తదుపరి మూత్రంలోకి ప్రవహించుతాయి. రక్తంలో గ్లూకోజ్‌ అధికంగా ఉన్నప్పుడు మాదిరిగా మూత్రంలో కీటోన్స్‌ అధికంగా ఉన్నప్పుడు కూడా మూత్రవిసర్జన అధికంగా జరిగి శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీనివల్ల రక్తం ఆమ్లపూరితం అవుతుంది. ఈ పరిస్థితిని కీటోఅసిడోసిస్‌ అంటారు. రక్తంలో ఏర్పడుతున్న ఈ కీటోన్స్‌ అనబడే పదార్థాలు అత్యంత విషపూరితమై మెదడు కణాలలో వాపు ఏర్పడి స్పృహ కోల్పోవడం జరుగుతుంది. దీనిని డయాబెటిక్‌ కోమా అంటారు. దాహం ఎక్కువ, అతిగా మూత్రవిసర్జన, బరువు తగ్గడం, వికారం, వాంతులు, అలసట, మత్తుగా ఉండటం, శ్వాసలో ఇబ్బంది, పొత్తికడుపులో నొప్పి, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తపరీక్ష, మూత్రపరీక్ష, సీరమ్‌ఎలకో్ట్రలైట్స్‌, ఇసిజి వంటి పరీక్షలు వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడతాయి. 

దీర్ఘకాలిక దుష్ఫలితాలు: కాటరాక్ట్‌, డయాబెటిక్‌ రెటినోపతి, గ్లకోమా వస్తుంటాయి. కాటరాక్ట్‌ అంటే కళ్ల పొరలు ఏర్పడి కంటి చూపు తగ్గుతుంది. డయాబెటిక్‌ రెటినోపతిలో కంటి వెనుక ఉండే రెటినా అనే భాగంలో రక్తనాళాలు బలహీనపడటం వల్ల అంధత్వం వచ్చే ప్రమాదం ఉంది. గ్లకోమా అంటే కళ్లలోపల ఉండే ద్రవాలలో ఒత్తిడి పెరగడం మూలంగా అంధత్వం వచ్చే అవకాశం ఉంది. 

కిడ్నీ సమస్యలు: కిడ్నీల్లో ఉండే రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల లేదా కుచించుకుపోవడం వల్ల కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంది. 

గుండె సమస్యలు: షుగర్‌ నియంత్రణలో లేకపోతే రక్తనాళాలు గట్టిపడటం, మందం కావడం జరుగుతుంది. దీనిని అథెరోస్కెలరోసిస్‌ అంటారు. ఇదే పరిస్థితి కొనసాగితే హైపర్‌టెన్షన్‌, గుండెపోటు, పక్షవాతం లాంటి జబ్బులు వస్తాయి. 

పాదాల సమస్యలు: డయాబెటిస్‌ రోగులకు పాదాలలో నరాలు బాగా దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల పాదాలకు రక్తప్రసరణ సరిగ్గా అందదు. స్పర్శజ్ఞానం తగ్గిపోతుంది. గాయం అయితే మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. గాంగ్రిన్‌గా మారితే కాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

డయాబెటిక్‌ న్యూరోపతి : స్పర్శలేకపోవడం, కాళ్లు, చేతుల్లో మంట, తిమ్మిర్లు, నొప్పులు, కాళ్లు బిగుసుకుపోవడం జరుగుతుంది. 

సెక్స్‌ సమస్యలు : దీర్ఘకాలం డయాబెటిస్‌ ఉన్న వారిలో అంగస్తంభన సమస్యలు ఏర్పడుతాయి. స్త్రీలలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వస్తుంటాయి. 

డా. శ్రీకాంత్‌ మొర్లవార్‌
సీఎండీ
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ ప్ర్తె.లి.
ఫోన్‌ : 9550003399