లెస్బియన్‌, గేలకు మధుమేహం!

వాషింగ్టన్‌, జూలై 29: లెస్బియన్‌, గే, బై సెక్సువల్‌ యువతకు ఒత్తిడి, కుంగుబాటు సమస్యలే కాకుండా మధుమేహం, ఊబకాయ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలో 14 నుంచి 18 ఏళ్ల వయసున్న 3.5లక్షల మందిని పరీక్షించగా అందులో లెస్బియన్‌, గే సంబంధాలు కలిగిన వారు శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తమ పరిశోధనలో తేలిందని నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.