అక్కడ తేమ తగ్గితే?

ఆంధ్రజ్యోతి(24-10-15):ప్రశ్న: నాకు పెళ్లై ఆరు నెలలైంది. అయితే ఈమధ్య కాలంలో లైంగికంగా ఎప్పుడు కలిసే ప్రయత్నం చేసినా యోని పొడిగా మారి ఇబ్బంది పెడుతోంది. తేమ లోపించటం మూలంగా కలయిక కష్టమౌతోంది. ఇందుకు కారణమేంటో అర్థం కావటం లేదు?

జవాబు: కలయిక సులువుగా జరగాలంటే యోని లోపలి బర్తొలిన్‌ గ్రంథులు సహజ స్రావాలను స్రవించాలి. అప్పుడే యోని జారుడుగా తయారవుతుంది. ఫోర్‌ ప్లే తగ్గినా, శృంగారం మీద, భాగస్వామి మీద ఆసక్తి సన్నగిల్లినా ఈ స్రావాలు స్రవించక యోని పొడిగా తయారవుతుంది. గతంలో ఏదైనా ఇన్‌ఫెక్షన్‌కు గురైనా యోని డ్రైగా తయారవుతుంది. ఇన్‌ఫెక్షన్‌ కారణం కాకపోతే కె - వై జెల్లీ అనే వాటర్‌ బేస్డ్ లూబ్రికెంట్‌ వాడి చూడండి. దీన్ని కలయిక ముందు తగినంత పరిమాణంలో యోని లోపలి గోడలకు అప్లై చేస్తే కలయిక నొప్పి లేకుండా జరిగిపోతుంది. ఈ జెల్లీ అన్ని మెడికల్‌ షాపుల్లో దొరుకుతుంది.
 
డాక్టర్‌. షర్మిల మజుందార్‌
కన్సల్టెంట్‌ సెక్సాలజిస్ట్‌
రామయ్య ప్రమీల హాస్పిటల్‌.