సెక్సువల్‌ ఎట్రాక్షన్‌ లోపిస్తే?

ఆంధ్రజ్యోతి(28-11-15):ప్రశ్న: నాకు పెళ్లై ఏడు నెలలు. కానీ ఈమధ్య మావారిని చూస్తే ఎటువంటి సెక్సువల్‌ అట్రాక్షన్‌ కలగట్లేదు. బదులుగా పరాయి మగవాళ్లని చూస్తే అలాంటి ఫీలింగ్స్‌ కలుగుతున్నాయి. ఎందుకిలా?

జవాబు:  మీకు మీ లైఫ్‌ మొత్తం బోర్‌ కొడుతోందా? లేదంటే మీ వారే బోర్‌ కొడుతున్నారా? ఒకవేళ రెండోదే నిజమైతే ఈ 3 విషయాల్లో మార్పులు చేసుకోండి.
1. మీ కెరీర్‌ మరింత ఎక్సయిటింగ్‌గా ఉండటం కోసం ఏదైనా కొత్త వర్కింగ్‌ స్కిల్‌ పెంచుకోండి.
2. మీ ఇద్దరూ ఇన్వాల్వ్‌ అయ్యే ఏదైనా కొత్త హాబీని అలవరుచుకోండి.
3. మీకిష్టమైన ప్రదేశానికి మీవారితో వెకేషన్‌ ప్లాన్‌ చేయండి.
ఈ మూడు ఏరియాల్లో మార్పులు చేయటం ద్వారా చాలావరకు జీవితంలో చోటుచేసుకున్న బోర్‌డమ్‌ తొలగిపోతుంది. వెకేషన్‌కి వెళ్లేటప్పుడు సెక్సీ దుస్తులు వెంట తీసుకెళ్లండి. సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ చేయండి. వెకేషన్‌ మొత్తాన్ని శృంగారానికే కేటాయించండి. మీకు ఎలాంటి స్పర్శ ఇష్టమో, ఏ ప్రదేశాల్లో తాకితే నచ్చుతుందో మీవారితో వివరంగా చెప్పండి. మగవాళ్లు వాళ్ల చర్యల వల్ల పొందే తృప్తిని స్త్రీల మాటల్లో వినాలని ఆశపడతారు. అలాగే ఆయనలో దేన్ని చూసి ప్రేమలో పడ్డారో ప్రతిరోజూ గుర్తు చేసుకుంటూ ఉండండి. పెళ్లైన తొలినాళ్లలోనే దాంపత్య జీవితంలో స్తబ్దతని చొరబడనివ్వకండి. దాన్ని దూరం చేసే మార్గాలున్నాయి.

 డాక్టర్‌. షర్మిల మజుందార్‌
కన్సల్టెంట్‌ సెక్సాలజిస్ట్‌
రామయ్య ప్రమీల హాస్పిటల్‌.
[email protected]