మా వారి సమస్యకు విరుగుడు లేదా?

ప్రశ్న: డాక్టర్‌! మా పెళ్లై ఇప్పటికి నాలుగేళ్లు. ఇప్పటివరకూ పిల్లలు కలగలేదు. ఇందుకు కారణం మా వారికి స్పెర్మ్‌ కౌంట్‌ తక్కువగా ఉండడమేనని వైద్యులు చెప్పారు. దాంతో మందులు వాడడం మొదలుపెట్టాం. మందులు వాడినప్పుడు తాత్కాలికంగా పెరుగుతూ, ఆపగానే తిరిగి స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గిపోతోంది. దాంతో వైద్యులు పిల్లల కోసం ఐ.వి.ఎఫ్‌ను ఆశ్రయించమని అంటున్నారు. మా వారికి స్పెర్మ్‌ కౌంట్‌ నిలకడగా ఉండి, సహజసిద్ధంగా మేము పిల్లలను కనే అవకాశమే లేదా?

.....ఓ సోదరి, మచిలీపట్నం.
 
సమాధానం: మందులు వాడినప్పుడు స్పెర్మ్‌ కౌంట్‌ పెరుగుతుంది కాబట్టి మీ వారికి పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి తీవ్రమైన సమస్యలు లేనట్టే! అయితే మందులకు స్పందిస్తూ, ఆపగానే కౌంట్‌ తగ్గిపోవడానికి మూల కారణాన్ని కనిపెట్టాలి. వృషణాలలో ఇన్‌ఫెక్షన్‌, హార్మోన్లలో హెచ్చుతగ్గులు, వేరికోసిల్‌ సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. కాబట్టి మీ వారికి సంబంధిత పరీక్షలు చేయించండి. ఫలితాన్ని బట్టి చికిత్స చేస్తే స్పెర్మ్‌ కౌంట్‌ ఎప్పటికీ నిలకడగా ఉంటుంది. ఐ.వి.ఎ్‌ఫతో పని లేకుండా, పిల్లలను కూడా సహజసిద్ధంగా కనవచ్చు. వీర్యకణాలకు సంబంధించిన సమస్యలకు సమర్థమైన చికిత్సలు అందుబాటు లో ఉన్నాయి. కాబట్టి ఆందోళన చెందకుండా మీ వారిని ఆండ్రాలజి్‌స్టకు చూపించి, తగిన వైద్యం చేయించండి.
 
డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌
8332850090
(కన్సల్టేషన్‌ కోసం)