లైంగిక వ్యాధులను జయించవచ్చు

ఆంధ్రజ్యోతి, 16-12-2013: శృంగారం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వ్యాధులను లైంగిక వ్యాధులు లేదా సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ డిసీజెస్‌ (ఎస్‌టిడి) అంటారు. వీటిలో ప్రమాదకరమైనవి హెచ్‌ఐవి, హెపటైటిస్‌ బి,సి, హెర్పిస్‌, గనేరియా, సిఫిలిస్‌, హెచ్‌పివి. ఈ వ్యాధులకు హోమియో చికిత్స ద్వారా చక్కని పరిష్కారం లభిస్తుందని అంటున్నారు డాక్టర్‌ రవికిరణ్‌. 

హ్యూమన్‌ ఇమ్యునోడెఫిషియెన్సి వైరస్‌ (హెచ్‌ఐవి) మనిషిని అక్వైర్డ్‌ ఇమ్యునో డెఫిషియెన్సి సిండ్రోమ్‌(ఎయిడ్స్‌) అనే పరిస్థితికి తీసుకువెళుతుంది. దీంతో ఆ వ్యక్తి రోగ నిరోధక శక్తి క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఈ కారణంగా టి.బి, ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌, విరేచనాలు, రకరకాల చర్మవ్యాధులు దాడి చేసి మరణానికి చేరువ చేస్తాయి. హెచ్‌ఐవికి గురైన రోగిలో వెంటనే ఎటువంటి లక్షణాలు కనపడనప్పటికీ కొంత కాలం తరువాత రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అప్పుడు ఒక వ్యాధి తరువాత మరో వ్యాధి దాడి చేయడం మొదలుపెడతాయి. సాధారణ ఇన్ఫెక్షన్స్‌ కాకుండా కొన్ని రకాల కేన్సర్లను కూడా ఇవి తేగలవు. ఉదాహరణకు చర్మ కేన్సర్‌, సర్వైకల్‌ కేన్సర్‌ వంటివి. హెచ్‌ఐవి రెండు రకాలు. హెచ్‌ఐవి 1, హెచ్‌ఐవి 2గా వీటిని పేర్కొంటారు. హెచ్‌ఐవి 1 చాలా ప్రమాదకరమైనది. ఇది శరీరంలో వేగంగా వ్యాపిస్తుంది. అంతే వేగంగా శరీరాన్ని నాశనం చేస్తుంది. హెచ్‌ఐవి 2 మెల్లగా వ్యాపించి కొంత సమయం తరువాత విధ్వంసాన్ని మొదలుపెడుతుంది. మన రోగ నిరోధక శక్తిలో ముఖ్యమైన పాత్ర వహించే సిడిజి, టి సెల్స్‌, మాక్రోఫేజెస్‌, మైక్రోగ్లియాస్‌ సెల్స్‌ లోకి ప్రవేశించి వాటిని నిర్వీర్యం చేస్తుంది. 

ఎయిడ్స్‌ లక్షణాలు 
సురక్షితం కాని శృంగారంలో పాల్గొన్న 2-4 వారాల తరువాత ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే హెచ్‌ఐవి పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. జ్వరంగా అనిపించడం, గొంతునొప్పి, ఒంటి నిండా కురుపులు లేదా దద్దుర్లు, వొళ్లు నొప్పులు, నిసా్త్రణంగా ఉండడం, నోటి పూత, తలనొప్పి, వికారం, వాంతులు, క్రమంగా బరువు కోల్పోవడం, నోట్లో అల్సర్లు, రాత్రి పూట చెమటలు పట్టడం, కీళ్లనొప్పులు(హఠాత్తుగా), జలుబు రావడం, గవద బిళ్లలు వాచడం(గొంతు, చెవి, పైతొడల వద్ద), కాలేయం, ప్లీహము వాచిపోవడం వంటివి ఎయిడ్స్‌ వ్యాధి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. 

వైద్య పరీపక్షలు 

ఎలిసా టెస్ట్‌ ద్వారా హెచ్‌ఐవి వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. ఇంకా కచ్ఛితమైన వ్యాధి నిర్ధారణకు వెస్ట్రన్‌ బ్లాట్‌ టెక్‌ చేయించాలి. ట్రైడల్‌ టెస్ట్‌ ద్వారా కూడా హెచ్‌ఐవి నిర్ధారణ చేసుకోవచ్చు. అయితే ఆరువారాల తరువాత లేదా మూడు నెలల తరువాత లేదా ఆరునెలల తరువాత కచ్ఛితమైన ఫలితం తెలుస్తుంది.
 
హెపటైటిస్‌ బి, సి 
ఈ వ్యాధులు రావడానికి లైంగిక సంపర్కమే ముఖ్య కారణం. హెపటైటిస్‌ బి వైరస్‌, హెపటైటిస్‌ సి వైరస్‌ ద్వారా ఈ వ్యాధులు వస్తాయి.
 
లక్షణాలు 
ఈ వైరస్‌లు సోకినపుడు కనపడే లక్షణాలు రెండు రకాలుగా ఉంటాయి. వైరస్‌ సోకిన వెంటనే వచ్చే లక్షణాలను గమనిస్తే అలసట, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, వొళ్లంతా నొప్పులు, దద్దుర్లు రావడం, శరీరం పచ్చబడడం, మూత్రం పచ్చగా రావడం వంటివి కనపడతాయి. ఈ వ్యాధి ముదిరినట్లయితే జ్వరం, చర్మము మీద దద్దుర్లు, కీళ్ల నొప్పులు (అన్ని కీళ్లు), త్వరగా అలసిపోవడం, బరువు కోల్పోవడం, అరచేతిలో, అరికాళ్లలో చిన్న కురుపులు లేదా దద్దుర్లు, పురుషులలో రొమ్ములు లేదా చనుమొల పెరగడం, గాయపడినపుడు రక్తస్రావం ఆగకపోవడం, చర్మము మీద రక్తకోశ నాళికలు కనపడడం, పొట్ట వాచిపోవడం, తిన్నది అరగకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
 
వ్యాధి నిర్ధారణ 
హెచ్‌బిఎస్‌ ఎజి అనే పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. పిసిఆర్‌(హెపటైటిస్‌), డిఎన్‌ఎ క్వాలిటేటివ్‌ టెస్ట్‌ ద్వారా కూడా వ్యాధిని గుర్తించవచ్చు.
 
హోమియో చికిత్స 
శరీర సమతుల్యతను గాడిలో పెట్టడమే హోమియో వైద్య విధానం ప్రథమ లక్షణం. రోగ నిరోధక శక్తి మీద హోమియో మందులు ప్రభావశీలంగా పనిచేస్తాయి. హెచ్‌ఐవి రోగులలో ప్రధానంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. హోమియో మందుల ద్వారా రోగ నిరోధక శక్తి తగ్గకుండా ఆపినట్లయితే రోగి హెచ్‌ఐవి దుష్ప్రభావాల బారిన పడకుండా మరికొంత కాలం ఆపవచ్చు. అయితే మందులతోపాటు పోషక పదార్థాలు తీసుకోవడంవల్ల రోగ నిరోధక శక్తి క్రమంగా మెరుగుపడి ఆరోగ్యవంతమైన జీవితాన్ని తిరిగి పొందవచ్చు. హెపటైటిస్‌ బి, సి వ్యాధులను కూడా హోమియో వైద్యంతో సంపూర్ణంగా నయం చేయవచ్చు. 

డాక్టర్‌ రవికిరణ్‌ 
(ఎం.డి., హోమియో) 
డైరెక్టర్‌ అండ్‌ సీనియర్‌ ఫిజీషియన్‌ 
మాస్టర్స్‌ హోమియోపతి 
అమీర్‌పేట్‌,కూకట్‌పల్లి,దిల్‌సుఖ్‌నగర్‌, 
హైదరాబాద్‌, విజయవాడ, కరీంనగర్‌ 
ఫోన్‌ : 7842 106 106, 
9032 106 106