పసందైన పడగ్గదికి.

ఆంధ్రజ్యోతి, 11-10-2015: సుఖవంతమైన దాంపత్య జీవితానికి.. ఈ కూరగాయలకు గట్టి బంధం ఉంది. పడగ్గదిలో పండంటి కాపురం చేయాలంటే.. వీటిని తినాల్సిందే! ఎందుకంటే..
 
బీట్‌రూట్‌ : పడగ్గదిలో ఇద్దరూ చురుగ్గా ఉండేందుకు ఉపకరిస్తుంది బీట్‌రూట్‌. ఇందులో నైట్రేట్‌ అధికం. దీనివల్ల ముడుచుకుపోయిన రక్తనాళాలు స్వేచ్ఛగా విచ్చుకుని.. రక్తప్రసరణ సుఖవంతం అవుతుంది. ఫలితంగా దాంపత్యసౌఖ్యం మీద ఆసక్తి ఏర్పడుతుంది.
 
క్యారెట్‌ : సెక్సువల్‌ ఫెర్ఫార్మెన్స్‌కు క్యారెట్‌కు సంబంధం ఉంది. ఎందుకంటే క్యారెట్‌లో విటమిన్‌ ఎ పుష్కలం. ఇది వీర్యకణ వృద్ధికి తొడ్పడుతుంది. శృంగార పటుత్వం పెంచుతుంది.
 
బెండ : విటమిన్లు, జింక్‌లను జుర్రుకోవాలంటే బెండకాయల్ని తినాలి. ఎందుకంటే మగవాళ్లలో శృంగార అవయవం చురుగ్గా మారాలంటే జింక్‌ అత్యవసరం. శరీరంలో జింక్‌ కనక తక్కువగా ఉంటే పురుషులు సెక్స్‌లో బలహీనులు అవుతారు.
 
ఉల్లి : ఆఫ్రోడైసియాక్‌ ప్రాపర్టీస్‌ కలిగిన ఉల్లి.. సెక్సువల్‌ ఆర్గాన్స్‌కు కొత్తఊపును ఇస్తుంది. మైథునం పట్ల ఎక్కడలేని మోహం కలిగిస్తుంది.
 
పాలకూర : ఇందులో పోలేట్‌, అమినోఆసిడ్స్‌ ఎక్కువ. రక్తంలో హోమొసిస్టిన్‌ మోతాదు పెరగడం వల్ల గుండెరక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే ప్రమాదం ఉంది. దీనివల్ల కూడా శృంగార సమస్యలు తలెత్తుతాయి. అయితే పాలకూర తినడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. శృంగారానికి మార్గం సుగమం అవుతుంది.
 
టొమోటోలు : శృంగారవాంఛల్ని ఉద్రేక పరిచే గుణం లైకోపిన్‌ సొంతం. ఇది ఎర్రగా మాగిన టొమోటోల్లో ఉంటుంది. తరచూ టొమోటోలను తినడం వల్ల ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నుంచి కూడా బయట పడవచ్చు.