శీఘ్రస్ఖలన సమస్యకు ఇక గుడ్‌బై

ఆంధ్రజ్యోతి, 26-02-2013: ఇప్పటిదాకా మానసిక ఒత్తిళ్లే శీఘ్రస్ఖలన సమస్యకు అతిపెద్ద కారణమని చాలామంది చెబుతూ వచ్చారు. ఆ మాట విన్నవారంతా మానసిక ఒత్తిళ్లు ఎప్పటికీ ఉండేవే కాబట్టి శీఘ్రస్ఖలన సమస్య ఎప్పటికీ పోయేది కాదనుకున్నారు. సరియైన వైద్యచికిత్సలకు వెళ్లకుండా జీవితమంతా ఆ క్షోభను భరిస్తూనే ఉండిపోయారు. వాస్తవానికి మానసిక కారణాలతో శీఘ్రస్ఖలన సమస్య రావడ ం అన్నది కేవలం 10 శాతం మందిలోనే. మిగతా 90 శాతం మందికి శారీరక కారణాలే ఉంటాయి. ఆయుర్వేద ఔషధాలతో ఆ 90 శాతం మంది తమ శీఘ్రస్ఖలన సమస్య నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. మిగతా 10 శాతం సమస్యలు కౌన్సెలింగ్‌తో తొలగిపోతాయి. అలా నూటికి నూరు శాతం మంది శీఘ్రస్ఖలన సమస్యనుంచి పూర్తిగా బయటపడవచ్చునంటున్నారు, ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్‌ వర్థన్‌ 

ఎంత చిర్రెత్తించే విషయమది? ఎంత అసహనం, ఎంత వికారం? ప్రారంభంలోనే ముగిసిపోవడం ఎంత బాధాకరం? శరీరం విపరీతంగా ఉద్రేకానికి లోనవుతుంది. కొద్ది క్షణాల్లోనే అంతా ముగిసిపోతుంది. ఆమె ఆశ్చర్యంగా నా వేపు చూస్తుంది. ఆ ఆశ్చర్యంలో అసహనం కూడా మిళితమై ఉంటుంది. ఆమె కళ్లలోకి చూడలేక తలదించుకునే పరిస్థితి. ప్రతిసారీ ఆ పరాభవం తప్పడం లేదు. నిజం చెప్పాలంటే శీఘ్రస్ఖలనం ఇప్పుడు పడకగది సమస్యలా లేదు. అది అంతకన్నా చాలా పెద్దదైపోయింది. అది నా జీవితంలోని ప్రతి విభాగాన్నీ ప్రభావితం చేస్తోంది. నా ఆత్మగౌరవం, నా ఆత్మవిశ్వాసం అడుగంటిపోతున్నాయి. నేనిప్పటికి చాలా మంది డాక్టర్లను సంప్రదించాను. ఆండ్రాలజిస్టులు, సెక్సాలజిస్టుల్ని కలిశాను. వీళ్లంతా డి-సెన్సిటైజేషన్‌ క్రీములు, స్ర్పేలు సూచించారు. మరికొందరు డబుల్‌ కాండోమ్‌ లు, రబ్బర్‌ రింగ్స్‌ ఇచ్చారు. కొందరు హిప్నోథెరపీ చేశారు. అవన్నీ తాత్కాలిక ంగా ఉపకరించేవే తప్పఏ ఒక్కరూ నా సమస్యను సమూలంగా తొలగించే ప్రయత్నం చేయలేదు. జీవితంలో ఈ పరిస్థితులనుంచి బయటపడతాననే ఆశ నా మనసులో దాదాపు లేకుండా పోయింది. అయినా చివరి ప్రయత్నంగా ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నాను. మీ విధానంలో అయినా నా సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందా? ఈ శీఘ్రస్ఖలన సమస్యనుంచి బయటపడే ఆయుర్వేద మార్గం చూపండి. నాకు నా పూర్వపు లైంగిక జీవితం తిరిగి నాకు ప్రదానం చేయండి. ఈ వేదన, ఈ క్షోభ, ఈ అవమానకర జీవితానికి చరమగీతం పాడేందుకు చేయూతనివ్వండి.
 
***********
 
పురుషుడి జీవితాన్ని అమితంగా కుదిపేసే అతిపెద్ద భయాల్లో శీఘ్రస్ఖలనం ఒకటి. నిజమే...! ఇది పరమ చికాకు కలిగించే విషయం. ఈ సమస్య ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేస్తుంది. అనుక్షణం ఆత్మన్యూనతా భావంతో కుంగిపోయేలా చేస్తుంది. వివాహబంధం నుంచి తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధం చేస్తుంది. వాస్తవానికి, శీఘ్రస్ఖలనం అన్నది ఎవరో నూటికి ఒకరిద్దరు ఎదుర్కొనే సమస్య కాదు. దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నవారే. ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాదాపు 40 శాతం మంది పురుషులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. 15 ఏళ్ల క్రితం కేవలం 5 శాతం మందిలోనే ఈ శీఘ్రస్ఖలన సమస్య ఉండేది. ఇప్పుడది 40 శాతం మందిలో ఉంటోంది. అలాగే ఒకప్పుడు 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కుల్లోనే ఈ సమస్య కనిపించేది. ఇప్పుడది 18 నుంచి 40 ఏళ్లలోపు వారిలో కూడా ఈ సమస్య ఉంటోంది 
పురుషుల్లో అత్యధికులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ఇదే. నిజానికి శీఘ్రస్ఖలన సమస్య నపుంసకత్వానికన్నా ఎక్కువగా బాధిస్తుంది. నపుంసకుడు ఆ ప్రయత్నమే చే యడు కాబట్టి సమస్యే లేదు. కానీ, శీఘ్రస్ఖలన సమస్య ఉన్నవారు ప్రతిసారీ శృంగారంలో పాల్గొంటూనే ఉంటారు. ప్రతిసారీ విఫలమవుతూనే ఉంటారు. తాను నిరాశకు గురికావడమే కాదు. తన భాగస్వామిని కూడా తీవ్రమైన నిరాశకు గురిచేస్తారు.
 
***********
 
ఇవీ కారణాలు 
శీఘ్రస్ఖలన సమస్యకు హార్మోనల్‌ లెవెల్స్‌లో తేడాలు, కెమికల్‌ (సెరటోనిన్‌)లెవెల్స్‌లో తేడాలు, ఎజాకులేటరీ సిస్టమ్‌లోని లోపాలు ఒక ప్రధాన కారణమవుతాయి. అలాగే, వంశానుగతంగా, జన్యుపరంగా వచ్చే మూలాలు కూడా శీఘ్రస్ఖలనానికి కారణమవుతాయి.
 
శారీరక కారణాల్లో అంగం శీర్షంలో అతిగా స్పందించే లక్షణం ఒక కారణం. ప్రొసే్ట్రట్‌ వ్యాధులు ఉన్నవారిలో కూడా ఈ సమస్య ఉంటుంది. యురెథ్రాలో వాపు గానీ, ఇన్‌ఫెక్షన్లు ఉన్నా ఈ సమస్య రావచ్చు. అంటే మూత్రాన్ని, శుక్రాన్ని తీసుకువచ్చే యూరేటరీ ట్యూబ్స్‌లో సమస్య ఉన్నా, యురెథ్రాలో సమస్య ఉన్నా ఈ సమస్య రావచ్చు. అలాగే బిపి, షుగర్‌, అతి మద్యపానం వీటివల్ల కూడా శీఘ్రస్ఖలన సమస్య రావచ్చు. తరుచూ యాంటీడిప్రెసెంట్‌ మందులు వాడే వారిలో కూడా ఈ సమస్య ఉంటుంది. వెన్నెముక బలంగా దెబ్బతిన్నా ఈ సమస్య రావచ్చు. అలాగే హైపర్‌ లేదా హైపో థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు కూడా ఈ ఇబ్బంది రావచ్చు. ప్రమాదాల కారణంగా గానీ, సర్జరీల వల్ల గానీ, నరాలు దెబ్బతిన్నవారిలోనూ ఈ సమస్య రావచ్చు. అందువల్ల శీఘ్రస్ఖలన సమస్యకు కేవలం మానసికి ఒత్తిళ్లే కారణమని చెప్పడంలో అర్థం లేదు. అందుకే సైకోటిక్‌, యాంటీ డిప్రెసెంట్‌, యాంటీ యాంగ్జిలైటిస్‌ మందులు ఇవ్వడం వల్ల ఏ ప్రయోజనమూ లేకపోగా వాటి దుష్ప్రభావాలతో ఎంతో నష్టం కూడా జరుగుతుంది.
 
సరైన వైద్యం అందకపోతే... 
శీఘ్రస్ఖలన సమస్య వల్ల ఆ సమస్యను అస్తమానం తలుచుకుంటూ ఉండడం వల్ల ఆందోళన మొదలవుతుంది. ఆందోళన వల్ల శృంగారం అంటేనే వెనుకంజ వేసే యాంగ్జయిటీ వస్తుంది. ఈ యాంగ్జయిటీ చివరికి డిప్రెషన్‌కు దారి తీస్తుంది. డిప్రెషన్‌ అంగస్తంభన లోపాలకు దారి తీస్తుంది. అంగస్తంభన లోపం చివరికి నపుంసకత్వానికి దారి తీస్తుంది. 
శీఘ్రస్ఖలన సమస్య మౌలికంగా రెండు ప్రధాన సమస్యలకు దారి తీస్తుంది. వాటిలో మొదటిది దాంపత్యబంధం భారంగానూ, బాధాకరంగానూ మారుతుంది. ఈ సమస్య అంతిమంగా సంతానలేమికి కూడా కారణమవుతుంది.

అల్లోపతి ఏంచేస్తుంది? 
వీటితో పాటు అంగ శీర్శాన్ని మొద్దుబారేలా చేసేందుకు డి-సెన్సిటైజేషన్‌ క్రీములు, స్ర్పేలు సూచిస్తారు. దీనివల్ల పురుషుడికి కలిగే ప్రయోజనం అటుంచి. ఆ క్రీముతో సీ్త్ర జననాంగం మొద్దుబారిపోయి అసలు ఆ శృంగారం తాలూకు అనుభూతే కలగకుండాపోతుంది. కొందరికి లాంగ్‌ లవ్‌ కాండోమ్స్‌ ఇస్తారు. ఆ కాండోమ్‌లో లోకల్‌ అనస్థిటిక్‌ డ్రగ్‌ను పెడతారు. మరికొందరికి ఒకేసారి రెండేసి కాండోమ్స్‌ వాడమంటారు. మరికొందరు అంగాన్ని బిగదీసే ఒక రింగ్‌ను రోజూ అరగంట సేపు ఉంచమంటారు. అలాగే కొందరు ముక్కులో వేసుకునే నాసల్‌- స్ర్పే సూచిస్తారు. ఇదే కాకుండా కొందరికి వ్యాసో డైలేటర్‌ డ్రగ్‌ను నేరుగా అంగంలోకి ఇంజెక్ట్‌ చేస్తారు. ఏమైనా అల్లోపతి విధానంలో వారు చేసేవన్నీ తాత్కాలికంగా ఉపకరించేవే తప్ప సమస్యను శాశ్వతంగా తొలగించలేవు. పైగా వాటిని వినియోగించడం ద్వారా ఆ వ్యక్తి ఒక తీవ్రమైన ఆత్మన్యూనతా భావానికి గురవుతాడు. శృంగారంలో పాల్గొంటున్నా, ఒక రోగిష్టి భావనే ఉంటుంది తప్ప సహజమైన తనకు సహజమైన ఆ లైంగిక శక్తి తనకున్నట్లు అనిపించదు.

ఆయుర్వేదం ఓ అద్భుతం 
అల్లోపతిలొ శీఘ్రస్ఖలనం అన్నది ఎప్పటికీ తొలగిపోని శాశ్వత వ్యాధి. ఆయుర్వేదంలో అది సంపూర్ణంగా తొలగిపోయే సమస్య. మౌలికంగా శీఘ్రస్ఖలనం అన్నది వాత వికృతి వల్ల తలెత్తే సమస్య. ఒకసారి వాతం ప్రకోపిస్తే అది పిత్తాన్నీ, కఫాన్నీ పెంచేస్తుంది. పిత్తం పెరిగితే లైంగిక వ్యవస్థ బలహీనపడుతుంది. లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. అంగస్తంభనలు తగ్గిపోతాయి. అందువల్ల లైంగిక శక్తి బలంగా ఉండాలంటే వాతపిత్తకఫాలు మూడూ సమతుల్యంగా ఉండాలి. ఆ లక్ష్యంగానే ఆయుర్వేదం పనిచేస్తుంది. ఆయుర్వేదం శీఘ్రస్ఖలనాన్ని అరికట్టడమే కాదు, గొప్ప లైంగిక నియంత్రణా శక్తినిస్తుంది. శృంగారంలో లోతైన ఆనందానికి పాత్రుల్ని చేస్తుంది. ఆయుర్వేదంలో అష్టాంగాలు అంటూ ఒక ఎనిమిది విభాగాలు ఉన్నాయి. వాటిలో లైంగిక విషయాలకే ప్రత్యేకించి వాజీకరణ తంత్రం ఉంది. ఇది సమస్త లైంగిక సమస్యలకు నివారణా మార్గాలను సూచించడంతో పాటు సంతాన లేమి సమస్యను కూడా పరిష్కరిస్తుంది.

శాశ్వత పరిష్కారంగా.... 
శీఘ్రస్ఖలన సమస్య నివారణకు ఆయుర్వేదంలో వాతహర చికిత్సలు చేస్తాం. వాతపిత్తకఫాలు సామ్యావస్థకు చేరుకునే వైద్యం చేస్తాం. ఆ పైన వాజీకరణ చికిత్సలు చేస్తాం. ఇందులో వీర్యకణాల సంఖ్యను పెంచే విధానం కూడా ఉంటుంది. వీటితో పాటు లైంగిక పటిమను పెంచేవి, మానసిక సమస్యలను తొలగించేవి, శుక్రాన్ని శక్తివంతం చేసేవి ఇలా పలురకాల ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. వాతపిత్తకఫాలు సామ్యావస్థకు చేరుకున్నప్పుడు సప్తధాతువులూ వృద్ధి చెందుతాయి. వైద్య చికిత్సలతో శుక్రంలో పుష్టి ఏర్పడితే శృంగారంలో పరిపూర్ణ ఆనందాన్ని పొందే స్థితి ఏర్పడుతుంది. కావాలనుకున్నవారికి ఈ సమస్యలన్నీ తొలగిపోయి సంతానప్రాప్తి కూడా కలుగుతుంది. ఆయుర్వేద చికిత్సలతో సప్తధాతువుల్లోని చివరిదైన శుక్రం పరిపుష్టం కావడమే కాకుండా, ప్రాణవంతమైన ఓజస్సు కూడా వృద్ది చెందుతుంది. అయితే వాజీకరణాలు గానీ, రసాయనాలు గానీ తీసుకునే ముందు శరీరంలోని ఆమాన్ని, అంటే వ్యర్థ, విషపదార్థాలను సంపూర్ణంగా తొలగించుకోవాలి. అందుకు పంచకర్మ చికిత్సలు చేయించుకోవాలి. వీటన్నిటిద్వారా మొత్తంగా మీ లైంగిక శక్తి. కండరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ సర్వశక్తివంతంగా మారి, అవి తమ సహజశైలిలో పనిచేయడం మొదలెడతాయి. ఫలితంగా శీఘ్రస్ఖలన సమస్యకు ఇక ఎంతమాత్రం తావులేకుండా పోతుంది. 

డాక్టర్‌ వర్ధన్‌ 
ది కేరళ ఆయుర్వేదిక్‌ కేర్‌, 
స్పెషాలిటీ, పంచకర్మ సెంటర్‌, స్కైలేన్‌ థియేటర్‌ లేన్‌, బషీర్‌బాగ్‌, హైదరాబాద్‌, బ్రాంచ్‌: దానవాయి పేట, రాజమండ్రి 
ఫోన్‌: 9866666055, 8686848383