షుగర్‌ వ్యాధిగ్రస్తుల్లో వచ్చే సెక్స్‌ సమస్యలకు ఆయుర్వేదం మేలు

ఆంధ్రజ్యోతి, 02/04/2013: అప్పటి దాకా సాఫీగా సాగుతున్న దాంపత్య జీవితంలో ఒక్కసారిగా కుదుపు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఎందుకిలా జరిగిందో అర్థంకాక మానసిక వేదన మొదలవుతుంది. షుగర్‌ వ్యాధి మూలంగా అంగస్తంభన సమస్యలు మొదలయినపుడు అనుభవించే సంఘర్షణ ఇది. అయితే ఈ సమస్యకు ఆయుర్వేదం అద్భుతమైన పరిష్కారాన్ని చూపుతుందని అంటున్నారు ఆయుర్వేద వైద్యనిపుణులు డా. నరసింహ.

పురుషుల్లో అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలన సమస్య, శృంగారం పట్ల కోరికలు తగ్గిపోవడం అనేవి ముఖ్యమైన సెక్స్‌ సమస్యలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో సెక్స్‌ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో 60 శాతం మందిలో శృంగార సమస్యలు ఏర్పడుతున్నాయి. అంగస్తంభన సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేదంలో డయాబెటిస్‌ను మధుమేహం అంటారు. అంగస్తంభన సమస్య అంటే శృంగారంలో పాల్గొనాలి అనుకున్నప్పుడు అంగం తగినంత స్తంభించకపోవడం, పాల్గొనే సమయంలో మెత్తబడిపోవడం జరుగుతుంది. మధుమేహం ఉన్న వారిలో రక్తనాళాలలో లోపాలు ఏర్పడటం వల్ల అంగస్తంభన సమస్యలు మొదలవుతాయి. అంగంలోనికి రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల అంగం తగినంత స్తంభించదు. షుగర్‌ వ్యాధిగ్రస్తుల్లో వచ్చే డయాబెటిక్‌ న్యూరోపతి, రెటినోపతి వల్ల ఎక్కువగా శృంగార సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యలకు మానసిక ఆందోళన తోడవడంతో సమస్య మరింత జటిలం అవుతుంది. వీరిలో క్రమంగా సెక్స్‌పట్ల కోరికలు తగ్గి అనాసక్తి వస్తుంది. చిన్న వయసులో షుగర్‌ వ్యాధి బారినపడిన వారిలో శృంగార సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. 
కారణాలు
 
మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో శృంగార సమస్యలు రావడానికి కారణాలు అనేకం ఉంటాయి. శారీరక, మానసిక కారణాలు రెండు ఉంటాయి. 
  • మానసిక ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌ వల్ల శృంగార సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 
  • అధిక బరువు, కొలెసా్ట్రల్‌, హార్మోన్ల లోపాలు, స్మోకింగ్‌, మద్యం సేవించడం వల్ల కూడా సెక్స్‌ సమస్యలు మొదలవుతాయి. 
  • నాడీ, గుండె, కిడ్నీ, మూత్రసంబంధ వ్యాధుల వల్ల రక్తనాళాలలో లోపాలు ఏర్పడి శృంగార సమస్యలకు
  • దారితీయవచ్చు.
  • ఆయుర్వేదం ప్రకారం మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో వాతం, పిత్తం, కఫం దోషాలు మారిపోవడం వల్ల శృంగార సమస్యలు ఏర్పడతాయి. వాతదోషం దూషించబడటం వల్ల నాడీ సంబంధిత లోపాలు ఏర్పడతాయని, పిత్తం, రక్తం దూషించడం వల్ల రక్తనాళాలలో లోపాలు ఏర్పడతాయని చెప్పబడింది. 
  • మానసిక కారణాల వల్ల అంగస్తంభన సమస్య ఏర్పడిన వారిలో నిద్రలో అంగస్తంభనలు మామూలుగానే ఉంటాయి. కానీ శారీరక కారణాల వల్ల ఏర్పడిన వారిలో నిద్రలో అంగస్తంభనలు ఉండవు. 
  • మధుమేహం ఉన్న వారు శృంగారంలో పాల్గొన్నప్పుడు వీర్యస్ఖలనం అయి బయటకు రాకుండా మూత్రాశయంలోనికి వెళుతుంది. దీనిని రెట్రోగ్రేడ్‌ ఎజాక్యులేషన్‌గా పేర్కొంటారు. 
  • డయాబెటిస్‌ ఉన్న వారిలో కొందరికి వీర్యస్ఖలనం అయినా భావప్రాప్తి ఉండదు. వీర్యస్ఖలనం కాకపోయినా కొందరిలో భావప్తాప్తి కలుగుతుంది. 
  • ఎక్కువ కాలం మధుమేహంతో బాధపడుతున్న వారిలో శృంగార సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. 
  • షుగర్‌ లెవెల్స్‌ను మందులు లేదా ఇన్సులిన్‌తో కంట్రోల్‌ చేసుకున్నా శృంగార సమస్యలలో ఎటువంటి మార్పు ఉండదు.
వ్యాధి నిర్ధారణ 
హార్మోన్ల పరీక్ష, పినైల్‌ డాప్లర్‌ స్డడీ వంటి పరీక్షలు వ్యాధి నిర్ధారణలో బాగా ఉపయోగపడతాయి.
 
ఆయుర్వేద చికిత్స 
డయాబెటిస్‌తో బాధపడుతూ శృంగార సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఆయుర్వేదంలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ లేకుండా వీటితో చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. పురుషుల్లో వచ్చే శృంగార సమస్యలకు, సంతానలేమి సమస్యలకు ఆయుర్వేదంలో ప్రత్యేకంగా వాజీకరణ ఔషధాలు చెప్పబడినాయి. ఈ ఔషధాలను 4 నుంచి 6 నెలల పాటు క్రమంతప్పకుండా వాడితే మంచి ఫలితం ఉంటుంది. శృంగార సమస్యలకు మందులతో పాటు కౌన్సెలింగ్‌ అవసరమవుతుంది. షుగర్‌ లెవెల్స్‌ను ఆహారనియమాల ద్వారా, వ్యాయాయం ద్వారా నియంత్రణలో ఉంచుకునే వారిలో సెక్స్‌ సమస్యలు తక్కువగానే ఉంటాయి. మధుమేహంను మందుల ద్వారా కంట్రోల్‌ చేసుకుంటూ ఆహారనియమాలు పాటించాలి.యోగ, మెడిటేషన్‌ చేయాలి. బరువును నియంత్రణలో పెట్టుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మధుమేహం ఉన్నా శృంగార సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. 

 డాక్టర్‌ ఎం. నరసింహ 
ఎం.డి (ఆయుర్వేద), సెక్సాలజిస్ట్‌ 
యస్‌.బి. స్పెషాలిటీ క్లినిక్‌ 
హైదరాబాద్‌, విజయవాడ,తిరుపతి 
ఫోన్స్‌ : 924656 4433 
939656 4433