వాజీకరణ చికిత్సతో శృంగార సమస్యలకు చెక్

ఆంధ్రజ్యోతి, 19-02-2013: మారిన జీవనశైలి కారణంగా ఏర్పడుతున్న మానసిక ఒత్తిడి, డయాబెటిస్‌ వంటి ఆరోగ్య సమస్యలు పురుషులలో లైంగిక పరమైన సమస్యలకు దారితీస్తున్నాయి. వీటిలో ప్రధానంగా అంగస్తంభన సమస్య పురుషులను మానసికంగా కృంగదీస్తోంది. కారణాలు ఏవైనప్పటికీ వాజీకరణ చికిత్స ద్వారా పురుషులలో ఏర్పడే అన్ని రకాల లైంగిక సమస్యలను శాశ్వతంగా దూరం చేయవచ్చని అంటున్నారు డాక్టర్‌ నరసింహ. 

పురుషులు బాధపడే శృంగార సమస్యలలో అంగస్తంభన, శీఘ్రస్ఖలన, కోరికలు తగ్గడం ప్రధానమైనవి. ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది అంగస్తంభన సమస్య. దీనిని ఆయుర్వేదంలో నపుంసికత లేక క్లైభ్యంగా పేర్కొనబడింది. శృంగారంలో పాల్గొన్నపుడు లేక హస్తప్రయోగం చేస్తున్నపుడు అంగం తగినంతగా స్తంభించకపోవడం లేక ఒకవేళ స్తంభించిన చివరివరకు తగినంతగా స్తంభించి ఉండకపోవడాన్ని అంగస్తంభన సమస్యగా చెప్పవచ్చును. ఈ సమస్యతో బాధపడేవారిలో సెక్స్‌ కోరికలు మామూలుగానే ఉంటాయి. మగవారిలో సర్వసాధారణంగా అంగస్తంభన సమస్యతో 30 శాతం మంది బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 40 ఏళ్లు దాటిన వారిలో 50 శాతం మంది, 60 ఏళ్లు దాటిన వారిలో 60 శాతం మంది అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో 60 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 కోట్లమందికిపైనే అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
 
కారణాలు 
 • అంగస్తంభన సమస్యతో బాధపడేవారు మానసిక ఒత్తిడికి లోనుకావడం, వారిలో ఆత్మవిశ్వాసం తగ్గడం, డిప్రెషన్‌తో బాధపడడం జరుగుతుంది. 
 • అంగంలోకి రక్తప్రసరణ జరగకపోవడం అన్నది అంగస్తంభన సమస్యకు ముఖ్యమైన కారణం. 
 • అంగస్తంభన సమస్య శారీరక, మానసిక కారణాల వల్ల ఏర్పడుతుంది. వీటిలో కూడా 60 శాతం శారీరక కారణాలు, 40 శాతం మానసిక కారణాలుగా చెప్పవచ్చు. 
 • మానసిక ఆందోళన, ఒత్తిడి, భయం, డిప్రెషన్‌, ఫెర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీ మొదలైన మానసిక కారణాల వల్ల అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది. 
 • డిప్రెషన్‌, పెర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీతో బాధపడుతున్నవారికి వారి సెక్స్‌ సామర్ధ్యంపైన నమ్మకం లేనందున అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది. 
 • ఆల్కహాల్‌ తీసుకోవడం, పొగత్రాగడం, గుట్కాలు నమలడం వల్ల కూడా అంగస్తంభన సమస్య వస్తుంది. 
 • హార్మోన్ల లోపాల వల్ల ముఖ్యంగా టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ లోపం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. 
 • అధిక బరువు, కొలెసా్ట్రల్‌ ఎక్కువగా ఉన్న వారిలో కూడా ఈ సమస్య రావచ్చు. 
 • మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎక్కువగా నాడులు, రక్తనాళాలు వికృతి చెందడం వల్ల అంగస్తంభన సమస్య మిగిలిన వ్యాధుల కంటే ఎక్కువగా ఉంటుంది. 
 • నాడీ సంబంధ వ్యాధులు, సుఖ వ్యాధులు, కిడ్నీ సంబంధిత వ్యాధుల వల్ల కూడా అంగస్తంభన సమస్యలు ఏర్పడవచ్చు. 
 • ఎక్కువ కాలం ఇతర వ్యాధులకు వాడిన మందుల వల్ల కూడా 25 శాతం మందిలో ఈ సమస్య రావచ్చు. 
 • అధిక రక్తపోటు, గుండె జబ్బులు, డిప్రెషన్‌, అల్సర్‌, కేన్సర్‌ సంబంధిత వ్యాధులకు, నొప్పి, వాపు తగ్గించే మందుల వల్ల కూడా అంగస్తంభన సమస్యకు దారితీస్తుంది.

వ్యాధి నిర్ధారణ 
అంగస్తంభన సమస్య వచ్చినవారు మంచి నిపుణులైన వైద్యులను సంప్రదిస్తే హార్మోన్‌ల పరీఓ; పినైల్‌ డాప్లర్‌ వంటి పరీక్షలు చేయించి వ్యాధి నిర్ధారణ చేస్తారు.

ఆయుర్వేద వాజీకరణ చికిత్స 
అంగస్తంభన సమస్యకు ఆయుర్వేదంలో ఎన్నో రకాల మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా శాశ్వత పరిష్కారాన్ని ఇస్తాయి. ఆయుర్వేదంలో కొన్ని వేళ సంవత్సరాల క్రితమే శృంగార సమస్యలు, సంతానలేమి సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్నే కేటాయించారంటే ఆయుర్వేదం ఈ సమస్యలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో చెప్పవచ్చు. ఆ విభాగాన్నే ‘వాజీకరణ చికిత్స’గా పేర్కొన్నారు. వాజీకరణ ఔషధాలు వాడినట్లయితే పురుషులలో శృంగార సమస్యలతోపాటు సంతానలేమి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

జాగ్రత్తలు 
అంగస్తంభన సమస్య రాకుండా ఉండాలంటే మానసిక ఆందోళన, ఒత్తిడి లేకుండా యోగ, వ్యాయామం, వాకింగ్‌ వంటివి చేయాలి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆహారంలో పండ్లు, పాలు, మినుములతో చేసినవి ఎక్కువగా ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. 
ఆయుర్వేద వాజీకరణ ఔషధాలను 4 నెలల నుండి 6 నెలలపాటు శృంగార సమస్యలపై అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణుల పర్యవేక్షణలో వాడినట్లయితే అంగస్తంభన సమస్యను సులభంగా తొలగించుకోవచ్చు. 

డాక్టర్‌ ఎం. నరసింహ 
ఎం.డి (ఆయుర్వేద),సెక్సాలజిస్ట్‌ 
యస్‌.బి. స్పెషాలిటీ క్లినిక్‌ 
హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి 
ఫోన్స్‌ : 924656 4433 
939656 4433