వణికిస్తున్న చలితో ‘వైరస్‌’ ముప్పు

ఆంధ్రజ్యోతి(22-10-2016): సాయంత్రం ఆరైందంటే చల్లటి గాలులు వీస్తున్నాయి. ఉదయం ఎనిమిది గంటల వరకు వాతావరణం చల్లగా ఉంటోం ది. ఈ కాలంలో ఇన్‌ఫ్లూంజా, ఫ్లూ వైరస్‌, రైనో వైరస్‌ దాడి చేసే ప్రమాదముంది. ఈ వైరస్‌తో జబ్బులు చుట్టుముడుతాయి. ఆస్తమా, సీవోపీడీ, న్యుమోనియా, స్వైన్‌ఫ్లూ వంటి జబ్బులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మ హిళలు, వృద్ధులు, పిల్లలకు మరింత గడ్డు కాలం. ఈ కాలంలో శరీరంలో తేమ శాతం తగ్గిపోవడంతో చర్మం రక్షణ శక్తి సన్నగిల్లుతోంది. చల్లటి ప్రదేశంలో బయట కు వెళ్లినా సమస్యే. కాస్తా ఎండ తీక్షణలో తిరిగినా ఇబ్బందే. మారుతున్న వాతావరణంతో ఎంతంటి శక్తి వంతులకైనా ఇబ్బందులు తప్పవు. వాతావరణ మార్పు లతో చల్లటి గాలులకు శరీరం తెల్లగా పొడిబారినట్లు మారిపోతోంది. పెదవులు పగిలిపోయి ముఖం కాంతి హీనంగా మారుతుంది. అరికాళ్లు పగిలి ఇబ్బంది పడు తుంటారు. ఈ కాలంలో శరీరంలో తేమ శాతం తగ్గిపో వడంతో చర్మం రక్షణ శక్తి తగ్గిపోవడం వల్ల దురద వస్తుది. ముఖం పొడిబారిపోవడం వల్ల పగుళ్లు చోటు చేసుకుంటాయని, చేతులపై పగుళ్ల మాదిరిగా తెల్లటి గీతలు చోటు చేసుకుంటాయని వైద్యులు వివరిస్తు న్నారు.
మహిళలకు హార్మోన్ల సమస్యలు 
మహిళల్లో తేమ శాతం తగ్గడం వల్ల హోర్మన్లకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి. మధు మేహం, థైరాయిడ్‌ ఉన్న వారికి పరీక్ష కాలమే. అరచే తులు పగిలిపోతాయి. చేతులు పొడిబారిపోతాయి, సునితంగా ఉండే అమ్మాయిల శరీరం త్వరగా పొడివా రిపోతుందని వైద్యులు వివరించారు. పాదాలు, పెదవులు పగలడం, ముఖంపై పొడారిపోయినట్లు ఉం డడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ కాలం లో వినియోగించే సబ్బులు, షాంపో, దుస్తుల విషయం లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.
చర్మ సమస్యలు బాధిస్తాయి
ఈ కాలంలో చిక్కటి నూనేతో మాయిశ్చరైజ్‌ చేయవద్దు. ఒక వైపు మాత్రమే మాయిశ్చరైజ్‌ చేయాలి. మూడు నాలుగు సార్లు మాయిశ్చరైజ్‌ చేయాలి. చలికాలంలో కేవలం 5 నుంచి 10 నిమి షాల లోపే స్నానం ముగించాలి. కొంచెం వెచ్చటి నీళ్లతో స్నానం చేయడం మంచింది. స్నానం చేసి వచ్చిన వెంటనే పొడి దుస్తులతో తుడుచుకోవాలి. కాళ్లకు చెప్పలు లేకుండా నడవొద్దు. చేతులు, పాదాలు పగిలితే గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి అందులో కొద్దిసేపు పాదాలు ఉంచి ఆ తరువాత తీయాలి. అనంతరం పాదాలను శుభ్రంగా పొడిబట్టతో తుడిచి నాణ్యమైన క్రీముతో మర్థన చేస్తే పగుళ్లు తగ్గుముఖం పడుతాయి. అరచేతులు, వేళ్ల సందుల్లో పగులు ఉంటే కూడా ఇదే పద్ధతిని పాటించడం మంచింది. 
- డాక్టర్‌ స్వప్నప్రియ, చర్మవ్యాధి నిపుణురాలు, కేర్‌ ఆస్పత్రి
శ్వాసకోశ బాధితులు అప్రమత్తంగా ఉండాలి
చలికాలంలో సీవోపీడీ, అస్తమా, స్వైన్‌ఫ్లూ తీవ్రత పెరుగుతాయి. రైనో వైరస్‌, ఇన్‌ఫ్లూంజా, ఫ్లూ వైరస్‌ దాడి చేసే ప్రమాదం ఉంది. శ్వాసకోశ సమస్యలున్న వారు చలికాలంలో తిరగవద్దు. ఆస్తమా బా ధితులు తప్పని సరిగా ఇన్‌హేలర్‌ వినియోగించాలి. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే ఇంటిలో రెండు, మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. చల్లటి పదార్థాలు తీసుకోవద్దు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి డస్ట్‌, స్మోకింగ్‌, లంగ్‌, స్కిన్‌ ఎలర్జీ సమస్యలు ఉంటాయి. చల్లని ప్రదేశంలో తిరిగినా, చల్లటి ఆహారం తీసుకున్నా, ఏసీ గదుల్లో ఉన్నా అస్తామా సమస్య పెరు గుతుంది. ఈ కాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదముంది. అస్తమా, న్యుమోనియాతో బాధపడే వారు మందులను వాడకపోతే సమస్య తీవ్రంగా మారే అవకాశముంది. ఆలస్యం చేస్తే క్రమేణా నీరు ఉపిరితిత్తుల్లోకి చేరుతుంది. దీంతో ఊపిరితిత్తుల్లోని పొరలు ఉబ్బిపోయి శ్వాస ఆడడం కష్టంగా మారుతోంది. 
- డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌, పల్మానాలజిస్టు, చెస్ట్‌ ఆస్పత్రి
ఈ కాలంలో ఇలా
బాగా వేడి, చల్లటి నీళ్లు కాకుండా గోరువె చ్చనీటితో స్నానం చేయాలి.
వేడినీటితో తలస్నానం చేయొద్దు. జుట్టును వదులుగా ఉంచుకోవాలి. 
 సబ్బుల కన్నా సున్నిపిండి, శనగపిండిని ఉపయోగించడం మేలు. 
 సబ్బు వాడడం తప్పనిసరైతే గ్లిసరిన్‌ సబ్బు లను మాత్రమే వినియోగించాలి. 
 హెయిర్‌ కండిషనర్‌ తప్పనిసరిగా వాడాలి. 
 కళ్లు, పెదాలపై మాయిశ్చరైజ్‌ తప్పనిసరి చేయాలి. 
 రోజుకు రెండు సార్లు చేతులకు నూనే రాయాలి. 
 పెదవువలకు లిప్‌క్రీమ్‌ వినియోగించాలి. 
ఫేస్‌ స్క్రబ్‌ చేయించుకోవద్దు. 
 చలి సమయంలో బయట తిరగొద్దు. 
వాహనాలు నడిపే వారు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి.
 
వృద్ధులు జర జాగ్రత్త..
చల్లటి వాతావరణంలో జాగింగ్‌ చేయొద్దు.
 మధుమేహం, గుండె, ఉపిరితీత్తులతో బాధ పడే వారు ముందుగా వ్యాక్సిన్‌ వేసుకోవాలి. 
దగ్గు, జలుబు రెండు రోజుల్లో తగ్గకపోతే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. 
 చల్లటి ప్రదేశంలో తిరగకూడదు. శరీరం పూర్తిగా కవరయ్యేలా దుస్తులు వేసుకోవాలి. 
 త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసు కోవాలి. 
పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. 
 వాజిలిన్‌, క్రీమ్‌, పెట్రోలియం జెల్లి వంటి వా టిని వినియోగించాలి. 
 రోజుకు నాలుగు సార్లు మాశ్చరైజ్‌ చేసు కోవాలి. 
 నీళ్లు ఎక్కువగా తాగాలి. 
 ఫ్రీజ్‌లో పెట్టిన ఆహారపదార్థాలు, నీళ్లు తీసు కోవద్దు. 
 తెల్లవారుజాము 5 నుంచి 6 గంటల్లో జాగిం గ్‌ చేయకూడదు 
 కాస్తా ఎండ తగిలే సమయంలో జాగింగ్‌ చేస్తే శరీరానికి మంచింది. 
చెట్లు ఎక్కువ ఉన్న ప్రాంతం కాకుండా కాస్తా ఎండ తగిలే ప్రాంతంలో జాగింగ్‌ చేయాలి. 
 తలకు మంకీటోపీలు ధరించాలి. చెవుల్లో దూది పెట్టుకోవాలి. 
 వాకింగ్‌ చేసే వారు షూ, సాక్స్‌ తప్పనిసరిగా వేసుకోవాలి. 
 శీతలపానీయాలు, బయట విక్రయించే జ్యూసులు తాగొద్దు. 
 జాగింగ్‌ చేసి ఇంటికిరాగానే స్నానం చేయొద్దు