వడదెబ్బకు నివారణ ఉందా?

01-05-2019: నా పేరు కిరణ్‌. సేల్స్‌మేన్‌గా చేస్తున్నాను. ఈ వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎండదెబ్బ తగిలింది. దాని ప్రభావంవల్ల అనారోగ్యంపాలయ్యాను. వడదెబ్బకు గురికాకుండా ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? దీని బారిన పడకుండా ఉండేందుకు హోమియోపతిలో ఏవైనా ముందస్తుగా వాడే నివారణ మందులు ఉంటాయా?
 
కొన్ని సందర్భాల్లో వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ అధిక ఎండను తట్టుకొని పనిచేయడం ఆరోగ్యానికి ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే హోమియోపతి వైద్య విధానంలో ఎండదెబ్బకు గురికాకుండా ముందస్తు నివారణ మందులు లభించడమే కాకుండా, దీని బారిన పడిన వారికి మంచి చికిత్స అందుబాటులో కూడా ఉంటుంది.
 
వడదెబ్బ ఒక ప్రాణాంతకమైన పరిస్థితి అనే చెప్పవచ్చు. ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేసే ఈ వడదెబ్బ ఎక్కువగా చిన్న పిల్లలను, వృద్ధులను ప్రభావితం చేస్తుంది. అధిక వాతావరణ ఉష్ణోగ్రతకు గురికావడం వల్ల శరీరం శీతలీకరణ వ్యవస్థ కోల్పోయి, శరీర ఉష్ణోగ్రత 102పైగా పెరిగి కేంద్ర నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపడాన్ని వడదెబ్బ అని అంటాము. సాధారణంగా వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమట పట్టడం ద్వారా శరీరం సాధారణ ఉష్ణోగ్రతను కలిగి ఉండేలా చేస్తుంది. ఇలా ఎక్కువ సమయం ఎండను ఎదుర్కొన్నప్పుడు చెమట ద్వారా నీరు, ఇతర లవణాలు అధిక సంఖ్యలో కోల్పోవడం జరుగుతుంది. ఇలా కోల్పోయిన నీరు, లవణాలు సమానస్థాయిలో తిరిగి పొందిన క్రమంలో శరీరం రీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ సమయంలో శరీరంలోని కణాలు రక్తంలోని నీటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీని వల్ల రక్తం పరిమాణం తగ్గి, గుండె, చర్మానికి, ఇతర అవయవాలకు రక్తప్రసరణ చేయలేకపోవడం వల్ల చర్మం శీతలీకరణ వ్యవస్థ మందగించి, శరీర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వడదెబ్బ లక్షణాలు కనిపిస్తాయి.
 
లక్షణాలు: ఎండదెబ్బకు గల లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి. శరీరం శీతలీకరణ వ్యవస్థ కోల్పోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత 102 పైగా పెరగడం, చర్మం పొడిబారడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపించడం, గుండె దడ, వాంతులు, వికారం, విరోచనాలు, కండరాల తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.
 
తీసుకోవలసిన జాగ్రత్తలు:
నీరు, ఇతర శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి.
ఎక్కువ ఎండ తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎండలో వెళ్లవలసిన పరిస్థితి ఉంటే వదులుగా ఉండే, పల్చని, లేత వర్ణం దుస్తులు వేసుకోవాలి. కాటన్‌ దుస్తులు ధరిస్తే మంచిది. తలపై ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మద్యపానం, కెఫిన్‌ కలిగిన పానీయాలు తీసుకోరాదు. అవి అధిక మూత్ర విసర్జన కలిగించడం ద్వారా డీహైడ్రేషన్‌కు గురిచేస్తాయి. కాబట్టి తీసుకోకపోవడం మంచిది.
గాలి ప్రసరణ బాగా ఉండేలా చూసుకోవాలి. చల్ల గాలి తగిలేలా ఉండటం మంచిది.
హోమియోకేర్‌ చికిత్స: హోమియోపతి వైద్యవిధానం వడదెబ్బకు గురికాకుండా నివారణ చికిత్సను అందించడం జరుగుతుంది. అంతేకాకుండా వడదెబ్బకు గురైనవారికి ప్రాథమిక చికిత్స అందించి, త్వరగా కోలుకోవడానికి హోమియోకేర్‌ చికిత్స దోహదపడుతుంది.
 
-డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ CMD
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి