సంతానం కలిగే మార్గం లేదా?

ప్రశ్న: నాకు పెళ్లయి రెండేళ్లు అవుతోంది. నా సమస్య ఏమిటంటే శృంగారంలో పాల్గొన్నప్పుడు త్వరగా వీర్యస్ఖలనం అవుతోంది. దీనివల్ల నా భార్యను సంతృప్తిపరచలేకపోతున్నాను. దీనివల్ల మా మధ్య గొడవలు వస్తున్నాయి. నా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా? - ఆర్‌.కె. మూర్తి, వైజాగ్‌ 
 
జవాబు:  శీఘ్రస్ఖలనం చాలా సున్నితమైన అంశం. ఇది మాన సికంగా ఎంతో భయాన్ని కలగజేస్తుంది. కానీ ఇది వ్యాధి కాదు. ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. వైవాహిక జీవితం సంతృప్తికరంగా లేదని అనే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో ఎక్కువయింది. దీనికి ముఖ్యకారణాలు భయం, ఆందోళన, తొందరగా చేయాలనే తపన, సెక్స్‌ సరిగ్గా చేయగలనో లేదో అనే భయం, డయాబెటిస్‌, థైరాయిడ్‌, ఒబేసిటి లాంటి సమస్యలు, కొన్ని రకాల మందులు వాడటం వల్ల ఈ సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. హోమియో మందులతో శృంగార జీవితం మరింత ఆనందమయం చేసుకోవచ్చు. అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలు సరియైన హోమియో వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే ఇట్టే తొలగిపోతాయి. 
 
******

ప్రశ్న: డాక్టర్‌గారూ, నాకు పెళ్లయి పది సంవత్సరాలు అవుతోంది. ఇంతవరకు పిల్లలు కలగలేదు. హోమియోలో నా సమస్యకు పరిష్కారం లభిస్తుందా? 

 

- రమేష్‌, విజయవాడ

జవాబు: సంతానలేమి చాలా సున్నితమైన అంశం. మానసికంగా, శారీరకంగా ఎంతో బాధను కలిగిస్తుంది. దీనిని వ్యాపారాత్మకంగా కాకుండా, మానవతా దృక్పథంతో చూడాల్సి ఉంటుంది. ఒక ఏడాది పాటు ఎలాంటి సంతాన నిరోధక పద్ధతులు అవలంభించకుండా శృంగారంలో పాల్గొన్నప్పటికీ పిల్లలు పుట్టకపోతే సంతానలేమిగా చెప్పవచ్చు. ఈ సమస్యకు పురుషులలో 40 శాతం కారణాలుంటే, స్త్రీలలో 40 శాతం కారణాలుంటాయి. మిగతా 20 శాతం ఇద్దరిలో ఉంటాయి. కాబట్టి అన్ని కారణాలను సమీకరించి చికిత్స చేస్తే సత్ఫలితాలను అందుకోవచ్చు. పురుషులలో వీర్యకణాల సంఖ్య, కదలికలు, అంగస్తంభన సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు, వెరికోసిల్‌ వంటి కారణాలను గుర్తించి చికిత్స చేయాలి. స్త్రీలలో హార్మోనల్‌ అసమతుల్యత, ఫైబ్రాయిడ్స్‌, స్థూలకాయం, రుతుక్రమంలో సమస్యలు, పీసీఓడిలాంటి కారణాలను గుర్తించి చికిత్స చేయాలి. ప్రకృతి నియమాలపైన ఆధారపడిన హోమియో చికిత్సతో సంతానలేమి సమస్యను సులభంగా అధిగమించవచ్చు. 
 
********
 
ప్రశ్న: నాకు 12 సంవత్సరాల నుంచి సొరియాసిస్‌ వ్యాధి ఉంది. ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు. హోమియోలో దీనికి పరిష్కారం ఉందా? 

  రాములు, హైదరాబాద్‌

జవాబు: సొరియాసిస్‌ అనేది సైకొసొమాటిక్‌ వ్యాధి. ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఆందోళన, దెబ్బలు తగలడం, కొన్ని రకాల మందులు వాడటం, కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల తరువాత సొరియాసిస్‌ రావడానికి ఆస్కారం ఉంటుంది. శరీరంపైన చిన్న మచ్చలతో పొట్టు మాదిరిగా రాలిపోతుంది. కొంచెం దురద, మంట ఉంటుంది. కొందరిలో సొరియాసిస్‌ వల్ల కీళ్లనొప్పులు వస్తాయి. దీనివల్ల మానసిక స్థితిలో చాలా మార్పులు వస్తాయి. ఒకరకమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. హోమియోపతిలో సొరియాసిస్‌ తగ్గడానికి చాలా మంచి మందులు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచే ఇమ్యునో మాడ్యులేటర్స్‌ ఉన్నాయి. రోగికి సత్వరమైన చికిత్సతో పాటు, నమ్మకమైన పరిష్కారాన్ని చూపించవచ్చు.

********

ప్రశ్న: నేను గత పదేళ్ల నుంచి కీళ్లనొప్పులతో బాధపడుతున్నాను. కాళ్లనొప్పులు, వాపులతో నడవటం కష్టంగా ఉంది. హోమియో మందులతో కీళ్లనొప్పులకు పరిష్కారం లభిస్తుందా?

- రేవతి, హైదరాబాద్‌

 
జవాబు: మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఇది ఒక అటోఇమ్యూన్‌ డిజార్డర్‌. ఈ సమస్యకు సరియైన చికిత్స లేక చాలా మంది ఎన్నో దుష్ఫలితాలతో బాధపడుతున్నారు. అయితే హోమియో మందులతో కీళ్లనొప్పులను తగ్గించడం సాధ్యమవుతుంది. నిపుణులైన హోమియో వైద్యుని కలిసి చికిత్స తీసుకోండి. 
 
*****
 
ప్రశ్న: నా వయస్సు 32 సంవత్సరాలు. 8 ఏళ్ల క్రితం ఒక అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకున్నాను. అప్పటి నుంచి నా అంగంపైన చిన్న చిన్న నీటి పొక్కుల మాదిరిగా వచ్చి పగిలిపోతున్నాయి. తిరిగి వస్తున్నాయి. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపండి?
 
- నరేష్‌, అమలాపురం
జవాబు: లక్షణాలను బట్టి చూస్తే మీరు హెర్పిస్‌ వ్యాధితో బాధపడుతున్నారని అర్థమవుతోంది. ఒక గుండు సూది గుండు పైన కోటి వైరస్‌ల దాకా ఇమిడిపోయేంత సూక్ష్మమైన వైరస్‌ ఇది. జీవితాంతం వేధిస్తుంది. లైంగిక కలయిక ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ వెన్నెముక చివరి భాగం శాక్రమ్‌ చుట్టూ ఉండే నాడుల్లో నిద్రావస్తలో ఉండి అవసరమైనపుడు సునామిలా విజృంభిస్తుంది. జననాంగాలపై చిన్న చిన్న నీటిపొక్కుల్లా వచ్చి పగిలి పుండ్లలాగా తయారవుతుంటాయి. మూత్రంలో దురద, జ్వరం, ఒళ్లంతా నొప్పులు, చికాకు, నీరసం వంటి లక్షణాలుంటాయి. దీనివల్ల అంగస్తంభన సమస్యలు, చర్మవ్యాధులు, గర్భిణుల్లో అబార్షన్స్‌కావడం జరుగుతుంది. అయితే ఈ వ్యాధి ఉన్నంత మాత్రాన భయపడాల్సిన పనిలేదు. లైంగిక వ్యాధులను తగ్గించడంలో హోమియో పాత్ర అమోఘం. మూలకారణాన్ని గుర్తించి చికిత్స చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 
 
డా. మధు వారణాశి, ఎం.డి
ప్రముఖ హోమియో వైద్యులు ,
ప్లాట్‌ నెం 188, వివేకానందనగర్‌ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్‌,
ఫోన్‌ : 8897331110, 8886 509 509.