‘బిగువు’ పెంచాలంటే?

ఆంధ్రజ్యోతి(17-10-15):ప్రశ్న:నాతో సెక్స్‌ చేస్తున్నప్పుడు తనకెలాంటి తృప్తి కలగటం లేదని మావారు కంప్లెయింట్‌ చేస్తున్నారు. యోనిని బిగుతుగా చేసే చిట్కాలు ఏమైనా ఉన్నాయా?

జవాబు: ‘కెగెల్‌ ఎక్సర్‌సైజ్‌లు’ యోని మార్గాన్ని, కటి కండరాలను బిగుతుగా చేస్తాయి. ఈ వ్యాయామాలు చేయటం ఎంతో తేలిక! ఇందుకోసం మూత్ర విసర్జన చేయటానికి ఉపయోగించే కండరాలను బిగిపడుతూ వదిలే వ్యాయామం చేయాలి. ఈ కండరాలను నెమ్మదిగా లోపలికి 3 సెకండ్ల పాటు బిగపట్టి వదిలేయాలి. ఇలా పదిసార్లు చేయాలి. రోజుకి రెండుసార్లు చొప్పున రెండు వారాలపాటు ఈ వ్యాయామం చేస్తే నెల రోజుల్లో తేడా కనిపిస్తుంది. ఈ వ్యాయామంతో మార్పు కనిపిస్తే ఇంతకంటే అడ్వాన్స్‌డ్‌ ఎక్సర్‌సైజె్‌సకు వెళ్లొచ్చు. ఈ వ్యాయామాల్లో ‘వెజైనల్‌ ఎగ్స్‌’ లేదా ‘లవ్‌ బీడ్స్‌’ను లోపల యోని కండరాలతో బలంగా పట్టి ఉంచాలి. యోని కండరాలు మరింత బలంగా తయారవటం కోసం ‘వెజైనల్‌ వెయిట్స్‌’తో కూడా వ్యాయామం చేయొచ్చు. ఈ వ్యాయామాల వల్ల యోని కండరాలు బలంగా, బిగుతుగా తయారవటంతో పాటు దంపతులిద్దరికీ సెక్స్‌లో దీర్ఘమైన భావప్రాప్తి కూడా కలుగుతుంది.

 
డాక్టర్‌. షర్మిల మజుందార్‌
కన్సల్టెంట్‌ సెక్సాలజిస్ట్‌
రామయ్య ప్రమీల హాస్పిటల్‌.